గతంలో సామ్‌సంగ్ అధికారిక వర్గాలు ఉత్పత్తుల తుది రూపకల్పన ఆలస్యమైన కారణంగా లాంచ్ వాయిదా పడవచ్చని సంకేతాలు ఇచ్చాయి. ముఖ్యంగా S26 ప్లస్ మోడల్ అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నప్పటికీ, అది పూర్తి దశకు చేరడానికి కొంత సమయం పట్టవచ్చని అనుకున్నారు.
Photo Credit: Onleaks
Samsung Galaxy S26 సిరీస్ జనవరి 2026లో లాంచ్ కావచ్చు
సామ్‌సంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన Galaxy S26 స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ షెడ్యూల్‌ను పునఃపరిశీలిస్తున్నట్టు ఇటీవల సమాచారం వెలువడింది. కొద్ది రోజుల క్రితం వచ్చిన ఒక నివేదిక ప్రకారం విడుదలలో నాలుగు వారాల ఆలస్యం ఉండొచ్చని సూచించగా, తాజాగా కొరియా మీడియా హౌస్ Chosun తెలిపిన సమాచారం ప్రకారం, లాంచ్‌లో ఎటువంటి ఆలస్యం ఉండదని స్పష్టమైంది. వారి రిపోర్ట్ ప్రకారం, సామ్‌సంగ్ Galaxy S26 సిరీస్‌ను 2026 జనవరి చివర్లో ఆవిష్కరించి, ఫిబ్రవరిలో మొదటి సేల్స్ ప్రారంభించే ప్రణాళికలో ఉంది. 2026 జనవరి నెల చివరివారంలో విడుదల చేసి ఫిబ్రవరి 2026 ప్రారంభంలో అమ్మకాలు ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.గతంలో సామ్‌సంగ్ అధికారిక వర్గాలు ఉత్పత్తుల తుది రూపకల్పన ఆలస్యమైన కారణంగా లాంచ్ వాయిదా పడవచ్చని సంకేతాలు ఇచ్చాయి. ముఖ్యంగా S26 ప్లస్ మోడల్ అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నప్పటికీ, అది పూర్తి దశకు చేరడానికి కొంత సమయం పట్టవచ్చని అనుకున్నారు.
కానీ తాజాగా సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు దగ్గరగా ఉన్న వనరుల ప్రకారం, “ఎడ్జ్ వెర్షన్‌ను తొలగించి ప్లస్ మోడల్‌ను చేర్చడంతో హార్డ్వేర్ వెరిఫికేషన్ సమయం పెరిగింది. ఈ కారణంగా లాంచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నా, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారమైందని, తద్వారా వచ్చే ఏడాది ఫిబ్రవరి లాంచ్ ఖచ్చితమని” తెలిపారు.
ఇప్పటి వరకు లభించిన పాత సమాచారం ప్రకారం, గెలాక్సీ S26 అధికారిక ఆవిష్కరణను 2026 ఫిబ్రవరి 25న నిర్వహించనున్నట్టు భావించారు. అలాగే రెండు వారాల ప్రీ-ఆర్డర్ కాలం తరువాత, ప్రపంచవ్యాప్తంగా మార్చి మొదటి వారంలో పబ్లిక్ సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అప్పట్లో పేర్కొన్నారు.
రిపోర్ట్ ప్రకారం, Galaxy S26 Edge మోడల్ ప్రణాళికలను సామ్‌సంగ్ రద్దు చేసింది. కారణం గతంలో వచ్చిన Galaxy S25 Edge తక్కువ అమ్మకాలే. దీని ఫలితంగా సామ్‌సంగ్ S26 Plus వెర్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అమ్మకాల మధ్య తేడా ఎక్కువగా ఉండడంతో, ఎడ్జ్ వెర్షన్ కొనసాగిస్తే కంపెనీకి పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లేదని రిపోర్ట్ చెబుతోంది.
2025 ఆగస్టు నాటికి, Galaxy S25 Plus మూడు నెలల అమ్మకాలు 5.05 మిలియన్ యూనిట్లు కాగా, Galaxy S25 Edge కేవలం 1.31 మిలియన్ యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, Edge వెర్షన్ అమ్మకాలు 74% తక్కువగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే సామ్‌సంగ్ ప్లస్ మోడల్‌పై దృష్టి పెట్టి, ఎడ్జ్ సిరీస్‌ను పూర్తిగా నిలిపివేసింది.
మొత్తం మీద, సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ జనవరి చివర్లో రంగప్రవేశం చేయనున్నది. ఫిబ్రవరి ప్రారంభంలో విక్రయాలు ప్రారంభం కానున్న ఈ కొత్త ఫ్లాగ్‌షిప్‌లు, 2026లో మొబైల్ మార్కెట్‌లో భారీ చర్చకు దారితీయడం ఖాయం.
ప్రకటన
ప్రకటన
iPhone 20 Series Tipped to Launch With an Under Display Selfie Camera in 2027
ZTE Blade V80 Vita Leaked Render Suggests Design Similar to iPhone 17 Pro