ఈ సిరీస్‌లోని రెండు ఫోన్లూ K13 టర్బో, టర్బో ప్రో యాక్టివ్ మరియు పాసివ్ కూలింగ్ వ్యవస్థలతో రాబోతున్నాయి. ఇందులో ఉపయోగించిన సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది 0.1mm బ్లేడ్‌లతో 18,000 rpm వేగంతో తిరుగుతుంది. దీని వలన ఫోన్ లోపల హీట్ వేగంగా బయటకు వెళ్లిపోతుంది.
Photo Credit: Oppo
Oppo K13 Turbo Pro (చిత్రంలో) వెనుక భాగంలో RGB లైటింగ్ సిస్టమ్ ఉంది
ఒప్పో కొత్తగా తీసుకువస్తున్న K13 టర్బో సిరీస్ త్వరలోనే భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఇటీవల కంపెనీ ఇచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం, ఈ సిరీస్‌ను ఆగస్టు 11న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. చైనాలో ఇటీవలే డెబ్యూట్ చేసిన ఈ లైనప్‌లో రెండు మోడల్స్ ఉన్నాయి. ఒప్పో K13 టర్బో మరియు K13 టర్బో ప్రో. ఇండియన్ వర్షన్లలో కొన్ని ప్రత్యేక ఫీచర్లను కూడా అందించబోతున్నారు, ముఖ్యంగా టెంపరేచర్ కంట్రోల్ చేసేందుకు బిల్ట్-ఇన్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ వంటి యాక్టివ్ కూలింగ్ వ్యవస్థను చేర్చారు.ఒప్పో సంస్థ ఈ ఫోన్లను ఫ్లిప్ కార్ట్ తో పాటు ఒప్పో ఇండియా స్టోర్ ద్వారా విక్రయించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దీనికోసం ప్రత్యేకమైన మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఇక ధర విషయానికొస్తే, ఈ సిరీస్ రూ. 40,000 లోపు ధరతో లభించనుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
ఈ సిరీస్‌లోని రెండు ఫోన్లూ K13 టర్బో, టర్బో ప్రో యాక్టివ్ మరియు పాసివ్ కూలింగ్ వ్యవస్థలతో రాబోతున్నాయి. ఇందులో ఉపయోగించిన సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది 0.1mm బ్లేడ్‌లతో 18,000 rpm వేగంతో తిరుగుతుంది. దీని వలన ఫోన్ లోపల హీట్ వేగంగా బయటకు వెళ్లిపోతుంది. దీని తో పాటు 7,000 sqm వెపర్ చాంబర్ మరియు 19,000 sqm గ్రాఫైట్ లేయర్ వంటి పాసివ్ కూలింగ్ భాగాలు కూడా ఉన్నాయి.
K13 టర్బో ప్రో మోడల్‌లో స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ఉపయోగించారు. గత జెనరేషన్ తో పోల్చితే, ఇందులో CPU పనితీరు 31 శాతం, GPU పనితీరు 49 శాతం మెరుగైనదిగా కంపెనీ పేర్కొంది. ఇందులో ప్రత్యేకంగా NPU (న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్) ఉండటంతో తక్కువ పవర్ ఉపయోగించి AI ఆధారిత పనులను వేగంగా పూర్తిచేయగలదు.
ఈ ఫోన్ ద్వారా యూజర్లు జెమినీ ఫీచర్లు పొందగలరు. ఉదాహరణకు టెక్స్ట్ సారాంశం, స్మార్ట్ సజెషన్లు, స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని ఆధారంగా తీసుకునే ఆన్-స్క్రీన్ అవేర్‌నెస్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే Wi-Fi 7, 5G, మరియు బ్లూటూత్ 6.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, K13 టర్బో మోడల్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మల్టీకోర్ పనితీరులో 41 శాతం మెరుగుదల, అలాగే పవర్ కనెక్షన్ లో 40 శాతం తగ్గుదల ఇస్తుందని ఒప్పో పేర్కొంది. ఇందులో Arm G720 MC7 GPU ఉంటుంది, ఇది 25 శాతం మెరుగైన గ్రాఫిక్స్ పనితీరు మరియు హెవీ గేమింగ్‌లోనూ స్థిరమైన FPS అందించగలదని ఒప్పో కంపెనీ చెబుతుంది.
ఈ ఫోన్‌లో NPU 880 అనే అధునాతన యూనిట్ ఉంది. ఇది 40 శాతం మెరుగైన AI పనితీరు అందిస్తుంది. దీని వలన రియల్ టైమ్ వాయిస్ రికగ్నిషన్, సీన్ ఆప్టిమైజేషన్, స్మార్ట్ ఎన్‌హాన్స్‌మెంట్స్ వంటి ఫీచర్లు మరింత ప్రభావవంతంగా పని చేస్తాయి.
చివరగా చెప్పాలంటే...ఒప్పో K13 టర్బో సిరీస్, ప్రత్యేకించి గేమింగ్, AI ఆధారిత పనితీరు, మరియు థర్మల్ మేనేజ్‌మెంట్‌లో బెటర్ చేంజెస్ చూపిస్తూ, ప్రీమియం ఫోన్ సెగ్మెంట్‌లో గట్టి పోటీకి సిద్ధమవుతోంది. అతి త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ కాబోతున్న ఈ సిరీస్, టెక్ ప్రియుల మనసును ఖచ్చితంగా గెలవనుంది.
ప్రకటన
ప్రకటన