Oppo K13x 5G ధర మన దేశీయ మార్కెట్‌లో రూ. 15,999 కంటే తక్కువ ఉండొచ్చు. గత ఏడాది మార్కెట్‌లోకి వచ్చిన K12x 5G కి కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తోంది.
Photo Credit: Oppo
Oppo K13x 5G 360-డిగ్రీల డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీతో వస్తుందని పేర్కొన్నారు
Oppo నుంచి కొత్త K13x 5G రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మోడల్ కు సంబంధించిన కలర్ ఆప్షన్స్ వంటి పలు కీలక అంశాలను కంపెనీ ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తూ వస్తోంది. తాజాగా దీని నిర్మాణ వివరాలను వెల్లడించింది. ఇది sea sponges ద్వారా ప్రేరణ పొంది, దీని తయారీ కోసం స్పాంజ్ బయోమిమెటిక్ షాక్ అబ్జార్ప్షన్ సిస్టమ్ వినియోగించినట్లు కంపెనీ ధృవీకరించింది. అంతే కాదు, దీని ధర మన దేశీయ మార్కెట్‌లో రూ. 15,999 కంటే తక్కువ ఉండొచ్చు. గత ఏడాది మార్కెట్‌లోకి వచ్చిన K12x 5G కి కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తోంది.పది శాతం ఎక్కువ మన్నిక,తాజాగా కంపెనీ వెలువరించిన పత్రికా ప్రకటనలో రాబోయే Oppo K13x 5G sea sponges నుంచి ప్రేరణ పొంది, స్పాంజ్ బయోమిమెటిక్ షాక్ అబ్జార్ప్షన్ సిస్టమ్‌తో వస్తున్నట్లు స్పష్టం చేసింది. shock-absorbing మెటీరియల్ తో రూపొందడం ద్వారా ఫోన్ లోని ఇంటర్‌నల్ పార్టులకు ఎలాంటి డేమేజ్ జరగకుండా రక్షించేందుకు ఈ స్పాంజ్ లాంటి లేయర్స్ ఉపయోగపడతాయి. ఇది ఫోన్ రక్షణకు సహకరిస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ AM04 high-strength తో కూడిన అల్యూమినియం అల్లాయ్ ఇన్నర్ ఫ్రేమ్ తో రూపొందించబడింది. ఇది మిగిలిన అల్లాయ్ లతో పోల్చి చూస్తే, పది శాతం ఎక్కువ మన్నికతో ఉంటుందని అంచనా.
కొత్త Oppo K13x 5G బాక్స్‌లో యాంటీ డ్రాప్ షీల్డ్ కేస్‌తో వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. క్రిస్టల్ గ్లాస్ ప్పొటెక్షన్ కలిగి ఉండే డిస్‌ప్లేతో ఇది రూపొందించబడింది. దీని స్క్రీన్ స్ల్పాష్ టచ్, గ్లోవ్ టచ్ మోడ్ లకు సపోర్ట్ చేస్తుంది. దీంతో తడి, జిడ్డు, గ్లోవ్డ్ చేతులతో కూడా ఫోన్ ను సులబంగా హ్యాండిల్ చేయవచ్చు. అంతే కాదు, ఇది 360 డిగ్రీల డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీతో అటాచ్ చేయబడి ఉంటుందని కంపెనీ చెబుతోంది.
Oppo K13x 5G ఎస్‌జీఎస్ గోల్డ్ డ్రాప్ రెసిస్టెన్స్, ఎస్‌జీఎస్ మిలిటరీ స్టాండర్డ్, ఎంఐఎల్ ఎస్‌టీడీ 810 హెచ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ లతో కూడా వస్తోంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ దుమ్ము, నీటి నియంత్రణకు ఐపీ65 రేటింగ్ ను కలిగి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. కనిపిస్తున్న డిజైన్ బట్టీ, ఈ హ్యాండ్ సెట్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ తో వస్తుందని అంచనా వేయవచ్చు.
ఈ హ్యాండ్ సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 45W వార్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీతో రావచ్చని అంచనా. అలాగే, 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో జూన్ చివరి వారం నాటికి Oppo K13x 5G విడుదల కావొచ్చని అంచనా.
ప్రకటన
ప్రకటన