Photo Credit: Oppo
Oppo K13x 5G మిడ్నైట్ వైలెట్ మరియు సన్‌సెట్ పీచ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది
మన దేశీయ మార్కెట్లోకి చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ Oppo నుంచి K13x 5G పేరుతో కొత్త హ్యాండ్సెట్ అడుగుపెట్టనుంది. దీనికి సంబంధించి కంపెనీ గతంలోనే సిల్హౌట్‌ను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రాబోయే స్మార్ట్ ఫోన్ వివరాలను టీజ్ చేసింది. అయితే, దీని రిలీజ్‌కు సంబంధించిన తేదీని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి మొబైల్ కలర్ ఆప్షన్లతోపాటు వెనుక ప్యానెల్ డిజైన్ రీవిల్ చేసింది. ఇది 6000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రూపొందించబడినట్లు సూచిస్తోంది. అంతే కాదు, K13x 5G కంపెనీ అధికారికి ఈ- స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అవకాశం ఉన్నట్లు మొబైల్ లభ్యతకు సంబంధించిన వివరాలను, తెలిపింది.ప్రమోషనల్ పోస్ట్‌లో Oppo K13x 5G,తాజాగా, Oppo షేర్ చేసిన ప్రమోషనల్ పోస్ట్‌లో Oppo K13x 5G ఫోన్ వెనుక ప్యానల్ డిజైన్‌ను చూడొచ్చు. అలాగే, ఓ ప్రకటనలో ఇది మిడ్ నైట్ వైలెట్, సన్ సెట్ పీచ్ కలర్ ఆప్షన్లలో లభించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. వెనుక డిజైన్‌ను పరిశీలిస్తే, ఎడమవైపున నిలువుగా ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో ఎలిప్టికల్ కెమెరా మాడ్యుల్‌ను చూడొచ్చు.
అలాగే, రెండు కెమెరా సెన్సార్లు, పక్కనే టెక్ట్స్‌లో Oppo K13x 5G AI బ్యాక్ట్ కెమెరా సిస్టమ్‌తో వచ్చినట్లు స్పష్టంగా కలినిపిస్తుంది. ఇది ఈ ఫోన్‌కు చెందిన AI ఇమేజింగ్, ఎడిటింగ్ ఫీచర్స్‌తో రూపొందిచబడి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవల Digit వెలువరించిన నివేదిక ఆధారంగా చూస్తే, Oppo K13x 5G మోడల్ జూన్ చివరి వారంలో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ మాత్రం దీని విడుదల తేదీని ఇప్పటి వరకూ అధికారికంగా వెల్లడించలేదు. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ లభ్యతకు సంబంధించిన Oppo ఇండియా అధికారిక వెబ్ సైట్తోపాటు ఎంపిక చేసిన ఆన్లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని అంచనా.
రాబోయే Oppo K13x 5G హ్యాండ్సెట్ ధర విషయానికి వస్తే, దీని ధర మన దేశంలో రూ. 15,999 కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, డిజైన్ పరంగా, ఈ ఫోన్లో రౌండ్ అంచులతో కూడిన ఫ్లాట్ డిస్ప్లే ప్యానెల్, ఫ్రంట్ కెమెరా కోసం పైన హోల్ పంచ్ స్లాట్‌తో రూపొందించవచ్చని అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన