ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ద్వారా Oppo Reno 14 5G సిరీస్ ఫోన్‌ల అమ్మ‌కాలు

ఈ సిరీస్‌లోనే Reno 14 ప్రో మోడ‌ల్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెస‌ర్‌తో రూపొందించారు. తాజాగా, ఈ రెండు మోడల్స్‌నూ కంపెనీ దేశీయ మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది.

ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ద్వారా Oppo Reno 14 5G సిరీస్ ఫోన్‌ల అమ్మ‌కాలు

Photo Credit: Oppo

ఒప్పో రెనో 14 ప్రోలో 6.83-అంగుళాల OLED స్క్రీన్ ఉంది

ముఖ్యాంశాలు
  • ఈ సిరీస్‌ చైనీస్ వేరియంట్‌ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత క‌ల‌ర్ ఓఎస్‌పై న‌
  • Reno 14 5G మోడ‌ల్‌ 6.59 అంగుళాల 1.5కే ఫ్లాట్ OLED స్క్రీన్‌తో వ‌స్తోంది
  • Reno 14 ప్రో 5G ని మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెస‌ర్‌తో రూపొందించారు
ప్రకటన

Oppo సంస్థ త‌మ అధికారిక సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో మ‌న దేశంతోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లో Oppo Reno 14 5G సిరీస్‌ను లాంఛ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కంపెనీ మే నెల‌లోనే చైనా మార్కెట్‌లో Reno 14 5G సిరీస్‌ను విడుద‌ల చేసింది. ఇందులో మోడ‌ల్స్ ఉన్నాయి. అక్క‌డ లాంఛ్ చేసిన మోడ‌ల్స్‌కు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌ను వినియోగించారు. అలాగే, ఇందులోనే Reno 14 ప్రో మోడ‌ల్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెస‌ర్‌తో రూపొందించారు. తాజాగా, ఈ రెండు మోడల్స్‌నూ కంపెనీ దేశీయ మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది.రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్‌లు,Oppo Reno 14 5G సిరీస్ విడుద‌ల‌కు సంబంధించిన కంపెనీ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా వివిధ అంశాల‌ను పోస్టుల ద్వారా పంచుకుంటూ, రాబోయే హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా బ‌హిర్గ‌తం చేసింది. ఈ పోస్టుల ద్వారా తెలిసిన అంశాల ప్ర‌కారం, ఇది ఫారెస్ట్‌గ్రీస్‌తోపాటు మ‌రో క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో ల‌భించ‌నుంది. అలాగే, ట్రిపుల్ కెమెరా యూనిట్‌, వెనుక ఏరోస్పేస్ గ్రేట్ అల్యూమినియం ఫ్రేం ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వెబ్‌సైట్‌ల‌లో

సిరీస్‌లోని రెండు మోడ‌ల్స్ జూలై 1న మ‌లేషియాలో లాంఛ్ కానున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. త‌మ వెబ్‌సైట్ ద్వారా ప్రీ ఆర్డ‌ర్‌ల‌కు అవ‌కాశం క‌ల్పించింది. కొనుగోలుదారులు RM 200 ( సుమారు రూ. 4వేలు) త‌క్ష‌ణ త‌గ్గింపుతోపాటు RM 2396 ( సుమారు రూ. 45 వేలు) వ‌ర‌కూ ఖ‌రీదు చేసే గిఫ్ట్‌ల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అయితే, ఇండియాలో ఈ సిరీస్‌ లాంఛ్ తేదీని వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ, లాంఛ్‌ను టీచ్ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వెబ్‌సైట్‌ల‌లో ప్ర‌త్యేక వెబ్ పేజీని క్రియేట్ చేసింది.

చైనీస్ వేరియంట్‌ల మాదిరిగా

ఈ సిరీస్‌లోని రెండు మోడ‌ల్స్ కూడా ఇప్ప‌టికే చైనాలో విడుద‌ల కావ‌డంతో ఇండియాలో రాబోయే వాటి స్పెసిఫికేష‌న్స్ వీటినే పోలి ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ సిరీస్ చైనీస్ వేరియంట్‌ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత క‌ల‌ర్ ఓఎస్‌పై ర‌న్ అవుతున్నాయి. అలాగే, 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరాతోపాటు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు.

వేరు వేరు ప్రాసెస‌ర్‌ల‌తో

అయితే, Reno 14 5G మోడ‌ల్‌ 6.59 అంగుళాల 1.5కే ఫ్లాట్ OLED స్క్రీన్‌తో వ‌స్తుండ‌గా, Reno 14 ప్రో 5G మోడ‌ల్ 6.83 అంగుళాల OLED స్క్రీన్‌తో 1.5కే రిజ‌ల్యూష‌న్‌తో వ‌స్తోంది. ఇదే వ‌రుస‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6000mAh బ్యాట‌రీతో Reno 14 5G రూపొందించ‌బడింది. అలాగే, Reno 14 ప్రో 5G మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెస‌ర్‌, 80W వైర్డ్, 50W వైర్‌లెస్‌ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6200mAh బ్యాట‌రీని క‌లిగి ఉంటుంది. ఇండియాలో ఈ సిరీస్ లాంఛ్ తేదీ అధికారిక ప్ర‌క‌ట‌న కోసం మార్కెట్ వ‌ర్గాలు ఆస‌క్త‌గా ఎదురు చూస్తున్నాయి.

Comments

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »