డిసెంబర్ 8న BIS సర్టిఫికేషన్ సైట్‌లో 2511FPC34I మోడల్ నంబర్‌తో ఒక కొత్త Poco డివైస్ లిస్టింగ్ కనిపించింది. ఇది Poco X8 Pro కే సంబంధించిన మోడల్ నంబర్ అని భావిస్తున్నారు. ఈ వివరాలను టిప్‌స్టర్ సుధాంశు అంభోర్ గుర్తించారు.
Photo Credit: poco
Poco X8 Pro భారత మార్కెట్లో త్వరలో లాంచ్, ధర, స్పెసిఫికేషన్లు అందుబాటులో
Poco తన కొత్త Poco X8 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో త్వరలోనే విడుదల చేయనుండొచ్చని తాజా సమాచారం సూచిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ ఫోన్‌కు సంబంధించిన ఇండియా వేరియంట్ BIS వెబ్‌సైట్‌లో కనిపించడం లాంచ్ దగ్గర్లోనే ఉందని తెలిపింది. ఈ డివైస్‌లో MediaTek Dimensity 8500 చిప్‌సెట్, అలాగే IP68 రేటింగ్ ఉన్న బలమైన బాడీ ఉండొచ్చని రూమర్లు చెబుతున్నాయి. అదనంగా, ఫోన్‌లో 6.5-అంగుళాల డిస్‌ప్లే మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఈ ఫోన్, చైనాకు ప్రత్యేకమైన Redmi Turbo 5 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా గ్లోబల్ మార్కెట్లోకి రావచ్చని అంచనా.
డిసెంబర్ 8న BIS సర్టిఫికేషన్ సైట్‌లో 2511FPC34I మోడల్ నంబర్‌తో ఒక కొత్త Poco డివైస్ లిస్టింగ్ కనిపించింది. ఇది Poco X8 Pro కే సంబంధించిన మోడల్ నంబర్ అని భావిస్తున్నారు. ఈ వివరాలను టిప్‌స్టర్ సుధాంశు అంభోర్ గుర్తించారు. BIS లిస్టింగ్‌లో స్పెసిఫికేషన్ వివరాలు లేకపోయినా, డివైస్ భారత మార్కెట్లో త్వరలో ప్రవేశించే అవకాశం ఉన్నదనడానికి ఇది స్పష్టమైన సంకేతం.
Poco X8 Pro, చైనాలో మాత్రమే లభించే Redmi Turbo 5 ను ఆధారంగా చేసుకుని రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఉండొచ్చని భావిస్తున్న ముఖ్య ఫీచర్లు ఇలా ఉన్నాయి..MediaTek Dimensity 8500 ప్రాసెసర్, 6.67-అంగుళాల AMOLED LTPS డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రెజల్యూషన్, మెటల్ ఫ్రేమ్, IP68 రేటెడ్ బిల్డ్, 8,000mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ లో 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ ఉనాయి.
Redmi Turbo 5 చైనాలో వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దాని వెంటనే Poco X8 సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి రాబోయే అవకాశం ఉందని చెబుతున్నారు. Poco X8 Pro ధర భారత్‌లో రూ.30,000 కంటే ఎక్కువగా ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. పోల్చి చూస్తే, ఈ ఏడాది జనవరిలో Poco X7 Pro 5G ను రూ.27,999 ధరకు (8GB + 256GB వేరియంట్) లాంచ్ చేశారు. ఆ ఫోన్‌లో 6.73-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 8400 Ultra ప్రాసెసర్, 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 20MP ఫ్రంట్ కెమెరా, 6,550mAh బ్యాటరీతో 90W ఛార్జింగ్ ఉన్నాయి. Poco X8 Pro కూడా అదే లైన్‌లో అప్‌గ్రేడ్ ఫీచర్లతో, భారీ బ్యాటరీతో, హై-పర్ఫార్మెన్స్ హార్డ్‌వేర్‌తో రానున్నందున ధర కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చని అంచనా.!
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy A57 5G, Galaxy A37 5G With Triple Rear Cameras, 5,000mAh Batteries Announced: Price, Specifications