Photo Credit: Realme
Realme GT 7T MediaTek Dimensity 8400-Max SoC పై నడుస్తుంది
మొబైల్ కొనుగోలుదారులకు Realme అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. తాజాగా మార్కెట్లోకి వచ్చిన GT 7 సిరీస్ హ్యాండ్‌సెట్‌లపై కళ్లుచెదిరే డిస్కౌంట్‌ను తీసుకొచ్చింది. Bestseller Day అనే పేరుతో పరిచయమైన ఈ సేల్ ఇప్పటికే మొదలైంది. ఈ సేల్లో Realme GT 7, GT 7T హ్యాండ్‌సెట్‌లపై బ్యాంక్ ఆఫర్లతోపాటు no-cost EMI, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి మరిన్ని ఆప్షన్లను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు Realme అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించడం ద్వారా ఆఫర్లను పొందొచ్చు. జూన్ 14 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.రూ. 3 వేల వరకూ బ్యాంక్ ఆఫర్,కొత్త Bestseller Day ఆఫర్‌లో Realme GT 7 కొనుగోలుపై రూ. 3 వేల వరకూ బ్యాంక్ ఆఫర్‌ను లేదా రూ. 5 వేల వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. ఈ GT 7 మోడల్ 8GB RAM+ 256GB స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ. 39,999లు ఉండగా, సేల్ ఆఫర్‌లో 34,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇదే మోడల్లో 12 GB RAM+ 512 GB స్టోరేజీ వేరియంట్ రూ. 46,999లు ఉంటే, ఆఫర్‌లో దీనిని రూ. 41,999లకు కొనుగోలు చేయవచ్చు.
ఈ Realme GT 7 డిస్‌ప్లే 6.78 అంగుళాల ఎల్టీపీఎస్ అమోలెడ్ 1.5కె తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15తో Realme యూఐ 6.0 తో రన్ అవుతుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణతో అందించారు. 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తోంది. 7,700ఎంఎం వ్యాపర్ ఛాంబర్ కూలింగ్ యూనిట్‌ను కూడా కలిగి ఉంటుంది. 50-మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 906 వెనుక కెమెరాతోపాటు 32- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
Realme GT 7T మోడల్ హ్యాండ్‌సెట్‌పై కూడా డిస్కౌంట్‌ను అందించారు. దీని కొనుగోలుపై రూ. 3 వేల వరకూ తక్షణ తగ్గింపు లేదంటే, రూ. 6 వేల వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో 8 GB RAM, 256 GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 34,999లు ఉండగా, సేల్‌లో దీని ధర రూ. 28,999 లకు తగ్గుతుంది. అలాగే, 12 GB RAM, 512 GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 41,999 ఉంటే, రూ. 35,999లకు లభిస్తుంది.
Realme GT 7T స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. దీనికి 6.68 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. అలాగే, 1.5కె రిజల్యూషన్‌తో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పరిచయమైంది. ఇది మీడియాటెక్ డైమెన్‌సిటీ 8,400 మ్యాక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీనికి 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఛార్జింగ్ వేగంతోపాటు బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ లాంటివి GT 7ను పోలి ఉంటాయి.
ప్రకటన
ప్రకటన