Photo Credit: Realme
రియల్‌మే జిటి కాన్సెప్ట్ ఫోన్ ప్రోటోటైప్‌లో సెమీ-పారదర్శక వెనుక కవర్ ఉంది
మన దేశీయ మొబైల్ మార్కెట్‌లోకి GT 7 సిరీస్‌ను Realme త్వరలోనే ప్రారంభించనుంది. అయితే, ఇందుకు సంబంధించిన లాంఛ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. చైనాలో ఏప్రిల్‌లో విడుదలైన GT 7 ఫోన్ మాదిరి ఇండియన్ వెర్షన్ ఉంటుందని అంచనా. దీని ప్రో వెర్షన్ భారత్‌లో గత నవంబర్‌లో లాంఛ్ అయ్యింది. ఇదే సమయంలో కాన్సెప్ట్ ఫోన్ పేరుతో 10,000mAh భారీ బ్యాటరీ కలిగిన మోడల్‌ను కంపెనీ పరిచయం చేసి, మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. అంతే కాదు, ఇది 320W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని ప్రచారంలో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కంపెనీ టీజ్ చేయడంతో,కొత్త కాన్సెప్ట్ ఫోన్‌ను Realme GT సిరీస్‌లో భాగంగా ఎక్స్ వేదికగా కంపెనీ టీజ్ చేయడంతో బహిర్గతమైంది. ఇది ఏకంగా 10,000 mAh భారీ బ్యాటరీతో 320W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుండడంతో మార్కెట్ వర్గాలలో చర్చ మొదలైంది. ఈ విషయాన్ని కంపెనీ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. అయితే, కాన్సెప్ట్ ఫోన్ కావడంతో మార్కెట్‌లో అమ్మకానికి వస్తుందా? లేదా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అంతే కాదు, ఈ మోడల్‌కు సంబంధించిన పలు కీలక విషయాలు బయటకు రావడంతో మార్కెట్ వర్గాలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టీ, దీని బరువు 200 గ్రాముల కంటే ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని కంపెనీ దృవీకరించింది. ఇది 8.5 మిమీ కంటే తక్కువ పరమాణంలో ఉంటుంది. అలాగే, సెమీ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ కవర్‌తో మినీ డైమండ్ ఆర్కిటెక్చర్ ద్వారా దీనిని రూపొందించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ ఆర్కెటెక్చర్ భారీ బ్యాటరీని సెట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాదు, దీనికి ప్రపంచంలోనే narrowest ఆండ్రాయిడ్ మెయిన్ బోర్డ్‌ను అందించారు. ఇది 23.4 మిమీ కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 887Wh/L బ్యాటరీ శక్తి సాంద్రతతో మొబైల్ మార్కెట్‌లో ఉన్న అన్ని ఫోన్‌ల కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, ఈ కాన్సెప్ట్ ఫోన్ అల్ట్రా హై సిలికాన్ కంటెంట్ యానోడ్ బ్యాటరితో రూపొందిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇది పది శాతం సిలికాన్ నిష్పత్తితో ఇటీవల మొబైల్ పరిశ్రమలో ఎక్కువగా వినియోగించబడుతోంది.
Realme బ్రాండింగ్‌తోపాటు పవర్ దట్ నెవర్ స్టాప్ అనే ట్యాగ్‌లైన్‌ను కంపెనీ షేర్ చేసిన ఫోన్ డిజైన్‌లో చూడొచ్చు. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా యూనిట్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యుల్ డిజైన్‌తో ఉన్నట్లు గుర్తించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ టాప్ అప్ లేకుండా కొన్ని రోజులపాట ఒకే ఛార్జ్‌తో వినియోగంలో ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రానున్న రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన