కెమెరా సెటప్ విషయంలో కూడా ఈ ఫోన్ స్పెషల్ గా నిలిచింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిపి డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. వీడియో కాల్స్, సెల్ఫీలకు ఇది మంచి క్లారిటీని అందిస్తుంది.
Photo Credit: Samsung
Samsung Galaxy A17 5G సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది.
శాంసంగ్ నుంచి మరో సరికొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చింది. గెలాక్సీ A17 5G బుధవారం కొన్ని దేశాల్లో అధికారికంగా విడుదలైంది. ఇది గతంలో వచ్చిన గెలాక్సీ A16 5Gకి కంటిన్యూషన్గా వచ్చిందని చెప్పొచ్చు. డిజైన్, ప్రాసెసర్, కెమెరా, సాఫ్ట్‌వేర్ ఇలా ప్రతి విభాగంలోనూ అనేక అప్‌గ్రేడ్‌లతో ఇది వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5nm టెక్నాలజీతో తయారైన Exynos 1330 ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇది అత్యాధునికమైన ఆండ్రాయిడ్ 15 పై ఆధారపడిన One UI 7 ఇంటర్‌ఫేస్‌తో పని చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటంతో ఫోను స్మూత్ స్క్రోలింగ్కి సపోర్ట్ చేస్తుంది.కెమెరా సెటప్ విషయంలో కూడా ఈ ఫోన్ స్పెషల్ గా నిలిచింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిపి డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. వీడియో కాల్స్, సెల్ఫీలకు ఇది మంచి క్లారిటీని అందిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఇది IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తోంది. దీనివల్ల ఫోన్ నీటిలో పడిన, దుమ్ములో పడిన ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఈ ఫోన్ ధర EUR 239 ఉంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 24,000. ప్రస్తుతానికి 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో 6GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం శాంసంగ్ స్టోర్ లో ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇది బ్లాక్, బ్లూ, గ్రే మూడు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో వస్తోంది.
ఈ డివైస్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ (నానో + నానో) ఉంది.
ఫోన్‌ను పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగ్ 5nm Exynos 1330 ఆక్టా-కోర్ ప్రాసెసర్, Mali-G68 MP2 GPU, అధికంగా 8GB వరకూ RAM, మరియు 256GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. డేటా భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ను ఇచ్చారు.
శాంసంగ్ గెలాక్సీ A17 5G లో 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, USB Type-C వంటి ఆధునిక ఆప్షన్లు ఉన్నాయి. ఫోన్ సైజ్ విషయానికి వస్తే 164.4 x 77.9 x 7.5mm, 192 గ్రాములు బరువుతో వస్తుంది. ఇది స్లిమ్ & లైట్‌వెయిట్ డిజైన్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A17 5G అనేది మిడ్రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ, స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ ప్రాసెసర్, మెరుగైన కెమెరా ఫీచర్లు, 5G కనెక్టివిటీ, భారీ బ్యాటరీ వంటి అన్ని స్పెసిఫికేషన్స్ తో కలిపిన కంప్లీట్ ప్యాకేజ్ గా వస్తుంది. మిడ్ సెగ్మెంట్లో, స్మార్ట్ డిజైన్ తో మంచి ఫోన్ కోరుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన