Photo Credit: Samsung
గూగుల్ ప్లే కన్సోల్‌లో Samsung Galaxy F36 5G, Galaxy M36 5G తో కలిసి కనిపించింది (చిత్రంలో)
ప్రముఖ మొబైల్ బ్రాండ్ సామ్‌సంగ్ ఇండియన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన షేర్ను కలిగి ఉంది. ఈ బ్రాండ్ నుండి కొత్త మొబైల్ లు ఎప్పుడు లాంచ్ అయినా సరే మార్కెట్లో మంచి సేల్స్ జరుగుతూ ఉంటాయి. సామ్‌సంగ్ ఇటీవలే గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. గెలాక్సీ F36 5G అని పేరుపెట్టిన ఈ మోడల్‌ను త్వరలో భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో లైవ్ అయిన ఒక ప్రోమోషనల్ పేజీ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ లో లైవ్ అయిన ప్రకటన ప్రకారం, సామ్‌సంగ్ గెలాక్సీ F36 5G త్వరలోనే లాంచ్ కాబోతుంది. అయితే కంపెనీ ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరియు లాంచ్ తేదీపై ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
సామ్‌సంగ్ తాజా F-సిరీస్ ఫోన్ "Flex HI-FAI" అనే ట్యాగ్‌లైన్‌తో ప్రమోట్ అవుతోంది. ఇందులో “AI” అక్షరాలు హైలైట్ చేయడం వల్ల, ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు ఉండే అవకాశముంది అని తెలుస్తుంది. అందుతున్న 3 ప్రకారం, ఈ ఫోన్‌కి ఎడమవైపు సిమ్ ట్రే ఉండనుందని తెలుస్తోంది. అలాగే, బ్యాక్ పార్ట్లో చాలా స్లిమ్‌గా ఉండే కెమెరా మాడ్యూల్ ఉన్నట్టు కనిపించింది.
గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్‌లో ఇటీవల ఈ ఫోన్ స్పాట్ చేయబడింది. దాని ప్రకారం గెలాక్సీ F36 5Gలో సెల్ఫీ కెమెరా కోసం ‘టియర్‌డ్రాప్' నాచ్ డిజైన్ ఉండనుంది. ఇక హార్డ్‌వేర్ పరంగా చూస్తే, ఈ ఫోన్‌లో Exynos 1380 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. కనీసం 6GB RAMతో వస్తుందని ఆ లిస్టింగ్ చూస్తే తెలుస్తుంది.
డిస్‌ప్లే విషయానికి వస్తే 1,080 x 2,340 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో, 450ppi పిక్సెల్ డెన్సిటీ కలిగిన స్క్రీన్ ఉండొచ్చని చెబుతున్నారు. ఇది ఆండ్రాయిడ్15 ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడుతూ సామ్‌సంగ్ యొక్క One UI 7 ఇంటర్‌ఫేస్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
గెలాక్సీ M36 5G ఫోన్ వివరాలు:
Exynos 1380 చిప్‌సెట్‌ను ఆధారంగా తీసుకొని సామ్‌సంగ్ గెలాక్సీ M36 5G ఫోన్‌ను భారత్‌లో జూన్ 27న విడుదల చేసింది. ఇది 8GB వరకు RAM మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, 6.7ఇంచుల ఫుల్-HD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ F36 5G ఎప్పటి నుంచే వినియోగదారుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. AI ఫీచర్లు, పవర్ఫుల్ ప్రాసెసర్, లేటెస్ట్ డిజైన్‌తో ఇది మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మిగతా బ్రాండ్ ఫోన్లకు గట్టి పోటీగా నిలిచే అవకాశముంది. ధర మరియు లాంచ్ తేదీపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ ఫోన్ లాంచింగ్ కోసం సామ్‌సంగ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ కూడా ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్, స్టూడెంట్స్, మిడ్రేంజ్ పీపుల్ ని టార్గెట్ చేసుకుని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రకటన
ప్రకటన