తాజా లీక్ ద్వారా iPhone 17 Series కలర్ ఆప్షన్‌లు బహిర్గతం అయ్యాయి. ఇవి చూసేందుకు గతంలో వచ్చిన వాటికంటే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి
Photo Credit: Apple
ఐఫోన్ 16 ప్రో మాక్స్ (ఎడమ) మరియు ఐఫోన్ 15 ప్రో మాక్స్ (కుడి) యొక్క మ్యూట్ చేయబడిన రంగు టోన్‌లు
ఈ ఏడాది వినియోగదారులను ఆకర్షించేందుకు iPhone నుంచి కొత్త మోడల్స్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రెండు నెలలలో కొత్తగా లాంఛ్ కాబోయే iPhone 17 Series కు సంబంధించిన అనేక అంచనాలు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అంతే కాదు, ప్రస్తుత వేరియంట్‌ను iPhone 17 ఎయిర్ భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. తాజా లీక్ ద్వారా iPhone 17 Series కలర్ ఆప్షన్‌లు బహిర్గతం అయ్యాయి. ఇవి చూసేందుకు గతంలో వచ్చిన వాటికంటే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.టిప్‌స్టర్ డమ్మీ యూనిట్ డిస్‌ప్లే,తాజాగా ట్విట్టర్ వేదికగా సోనీ డిక్సన్ అనే ఓ టిప్‌స్టర్ iPhone 17 Series కు చెందిన డమ్మీ యూనిట్‌లను డిస్‌ప్లే చేస్తూ ఓ ఇమేజ్‌ను షేర్ చేశారు. దీంతో మార్కెట్ వర్గాలలో ఈ సిరీస్‌పై చర్చ మొదలైంది. iPhone 17 ప్రో, iPhone 17 ప్రో మాక్స్ కలర్ ఆప్షన్‌లలో సరికొత్త మార్పును గమనించవచ్చు. అంతే కాదు, ఈ రెండు మోడల్స్ కూడా తెలుపు, నలుపు, నేవీ బ్లూ కలర్స్‌లో సాధారణ రంగులలో ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ కలర్ ఆప్షన్‌లలో ఇంత వరకూ కంపెనీ నుంచి వెలువడని ఓ కొత్త కలర్ ఇందులో కనిపిస్తోంది. అంతే కాదు, ఇదే ఈ సిరీస్‌లో నాలుగవ కలర్ ఆప్షన్‌గా ఉంది. అయితే, గతంలో చూసిన ప్రో మోడల్‌కు ఇది భిన్నంగా ఉంది. ఈ ఇమేజ్‌లో iPhone 17 ప్రో, iPhone 17 ప్రో మాక్స్ రెండు కూడా ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లో కనువిందు చేస్తున్నాయి. ఇది గతంలో వచ్చిన మోడల్స్‌లో ఎక్కడా కూడా కనిపించలేదు.
తాజాగా టిప్‌స్టర్ షేర్ చేసిన ఇమేజ్‌లలో iPhone 17, iPhone 17 ఎయిర్ మోడల్స్‌ను స్పష్టంగా చూడొచ్చు. అంతే కాదు, ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లు కూడా తెలుపు, నలుపు, లేత నీలం రంగు కలర్ ఆప్షన్‌లలో కనిపిస్తున్నాయి. అలాగే, ఇదే ఇమేజ్‌లో iPhone 17 నాలుగవ కలర్ ఆప్షన్‌లో సందడి చేస్తోంది. అయితే, ఇది లేత గులాబీ రంగుతో వచ్చే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో iPhone 17 ఎయిర్ మోడల్ గోల్డ్ ఫినిషింగ్‌తో కనిపిస్తోంది.
అయితే, ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న ఇమేజ్ వాస్తవమైనదే అయితే, iPhone నుంచి మొదటిసారిగా ఈ కలర్ వేరియంట్, గోల్డ్ ఫినిషింగ్‌తో వస్తోన్న సిరీస్‌గా ఇది గుర్తింపు పొందుతుంది. అంతే కాదు, గత అనుభవాల దృష్ట్యా ఈ కలర్ ఆప్షన్ higher-end వేరియంట్స్‌లో మాత్రమే కనిపించేది. అయితే, ఇది మంచి వార్తే అయినప్పటికీ, ప్రో లైనప్‌లో ఈ అవకాశం లేకపోవడం వల్ల నాన్ ప్రో మోడల్స్‌పై కొనుగోలుదారులు ఆసక్తి చేపే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన