Vi, Vivo స‌రికొత్త‌ ఒప్పందం.. భారత్‌లోని Vivo V50e కొనుగోలుదారులకు ప్రత్యేకమైన 5G రీఛార్జ్‌ ప్లాన్‌

అన్ లిమిటెడ్ కాలింగ్ తోపాటు 3GB వరకూ రోజువారీ డేటా కూడా పొందొచ్చు. కొత్తవారికే కాకుండా ఇప్పటికే Vi వినియోగిస్తున్నవారికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది

Vi, Vivo స‌రికొత్త‌ ఒప్పందం.. భారత్‌లోని Vivo V50e కొనుగోలుదారులకు ప్రత్యేకమైన 5G రీఛార్జ్‌ ప్లాన్‌

Photo Credit: Vivo

వివో V50e (చిత్రంలో) ఏప్రిల్‌లో భారతదేశంలో ప్రారంభించబడింది

ముఖ్యాంశాలు
  • Vivo V50e వినియోగ‌దారులు ఫోన్‌లో Vi నంబ‌ర్‌తో లాగిన్ అయితే చాలు
  • Vi ప్రీపెయిడ్ యూజర్స్ ఒక ఏడాదిపాటు ఓటీటీ, లైవ్ టీవీ సబ్‌స్క్రిప్షన్ పొందే
  • అన్ లిమిటెడ్ కాలింగ్ తోపాటు 3GB వరకూ రోజువారీ డేటా కూడా పొందొచ్చు
ప్రకటన

Vivo ఇండియాతో ఒప్పందం కుదర్చుకోవడం ద్వారా Vivo V50e హ్యాండ్‌సెట్‌ కొనుగోలుదారులకు గొప్ప ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులు 5G కనెక్టివిటీతోపాటు ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు ఉచితంగా యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మన దేశంలోని Vi ప్రీపెయిడ్ యూజర్స్ ఒక ఏడాదిపాటు ఓటీటీ, లైవ్ టీవీ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే, వీరు అన్ లిమిటెడ్ కాలింగ్ తోపాటు 3GB వరకూ రోజువారీ డేటా కూడా పొందొచ్చు. కొత్తవారికే కాకుండా ఇప్పటికే Vi వినియోగిస్తున్నవారికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది.350కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌,దేశంలో రూ. 1,197 స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్ ను Vivo V50e కొనుగోలుదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు Vi ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్ 84 రోజుల వరకూ చెల్లుబాటు అవ్వడంతోపాటు 12 నెలల Vi మూవీస్, టీవీ సబ్స్క్రిప్షన్, జియో హాట్స్టార్, జీ 5, సోనీ లివ్, లయన్స్ గేట్‌ ప్లే, ఫ్యాన్ కోడ్‌ తోసహా 17 ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు యాక్సెస్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో 350కి పైగా లైవ్ టీవీ ఛానెల్లను చూడొచ్చు.

రూ. 1,197 స్పెష‌ల్ ప్లాన్‌ను రీఛార్జ్

Vivo V50e ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి జూన్ 30 మ‌ధ్య కొనుగోలు చేసినవారికి ఈ స్పెష‌ల్ ప్రీపెయిడ్‌ ఆఫ‌ర్ వ‌ర్తించ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. అలాగే, Vi కొత్త వినియోగ‌దారుల‌తోపాటు ఇప్ప‌టికే ఉన్న‌వారికి కూడా ఇది అందుబాటులో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే, ఈ ఆఫ‌ర్ ను యాక్టివేట్ చేసేందుకు యూజ‌ర్స్ త‌మ ఫోన్‌లో Vi ప్రీపెయిడ్ సిమ్‌ను వేసి, రూ. 1,197 స్పెష‌ల్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Vi నంబ‌ర్‌తో లాగిన్

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న త‌ర్వాత మొద‌టి మూడు నెల‌లు Vi మూవీస్‌, టీవీ స‌బ్‌స్క్రిప్ష‌న్ యాక్సెస్ అవుతుంది. త‌ర్వాతి తొమ్మిది నెల‌ల‌కు ఉచిత‌ యాస్సెస్ కావాలంటే, మొద‌టి రిఛార్జ్ త‌ర్వాత ఏడాదిలోపు చేసిన మూడు రిఛార్జ్‌ల తర్వాత యాక్టీవ్ అవుందని కంపెనీ వెల్ల‌డించింది. Vivo V50e వినియోగ‌దారులు వారి ఫోన్‌లో Vi నంబ‌ర్‌తో లాగిన్ అయిన త‌ర్వాత ఈ ఉచిత స‌ర్వీసుల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. అంతే కాదు, స్మార్ట్ టీవీల‌లో స్ట్రీమింగ్ కోసం ఇదే నంబ‌ర్ ఉప‌యోగించి వీక్షించేందుకు యాక్సెస్ ఉంటుంది.

Vivo V50e ధ‌ర, స్పెసిఫికేష‌న్స్‌

ఈ ఏడాది ఏప్రిల్‌లో Vivo V50e ఫోన్ మ‌న దేశంలో విడుద‌ల అయ్యింది. ఇది మీడియాటెక్ Dimensity 7300 ప్రాసెస‌ర్‌, 90 W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 5,600mAh బ్యాట‌రీతో మార్కెట్‌లోకి వ‌చ్చింది. 50 మెగాపిక్సెల్ డ్యూయ‌ల్ రియ‌ల్ కెమెరా యూనిట్‌, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూట‌ర్‌ను అందించారు. అలాగే, దీని 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్‌ల ధ‌ర‌లు వ‌రుస‌గా రూ. 28,999, రూ. 30,999లుగా ఉన్నాయి.

Comments

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »