Vivo నుంచి మ‌రో స్మార్ట్‌ఫోన్ వ‌స్తోంది.. Vivo T3 Ultra పూర్తి వివ‌రాలు ఇవే

Vivo నుంచి మ‌రో స్మార్ట్‌ఫోన్ వ‌స్తోంది.. Vivo T3 Ultra పూర్తి వివ‌రాలు ఇవే

Photo Credit: Vivo

Vivo T3 Ultra is teased in a green colourway

ముఖ్యాంశాలు
  • Vivo T3 Ultra డిజైన్ మార్కెట్‌లోని Vivo 40 సిరీస్ డిజైన్‌ను పోలి ఉంటుంది
  • ఈ హ్యాండ్‌సెట్ IP68-రేటెడ్ బిల్ట్‌తో వస్తుంది
  • Vivo T3 Ultra మోడ‌ల్‌ 80W వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది
ప్రకటన

Vivo మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధ‌మైంది. Vivo T3 Ultra హ్యాండ్‌సెట్‌ను ఈ నెలాఖరులో తీసుకురానున్న‌ట్లు దృవీక‌రించ‌డంతోపాటు లాంచ్ తేదీని, దాని డిజైన్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా, Vivo నుంచి ఇటీవల T3 ప్రో హ్యాండ్‌సెట్ దేశీయ మార్కెట్‌లో విడుదలయ్యింది. రాబోయే Vivo T3 Ultra కూడా Vivo T3 ప్రో, Vivo T3 5G, Vivo T3 లైట్ 5G, Vivo T3x 5Gలను కలిగి ఉన్న Vivo T3 లైనప్‌లో చేరనుంది.

అధికారిక వెబ్‌సైట్‌లో టీజ‌ర్ రిలీజ్

Vivo T3 Ultra సెప్టెంబర్ 12న భారతదేశంలో ప్రారంభించబడుతుందని కంపెనీ X(ట్విట్ట‌ర్‌) పోస్ట్ ద్వారా ధృవీకరించింది. అలాగే, ఫోన్ లభ్యతను నిర్ధారిస్తూ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌ ల్యాండింగ్ పేజిలో లైవ్‌లో ఉంచింది. విడుద‌ల‌కు ముందు హ్యాండ్‌సెట్ ధ‌ర‌తోపాటు స్పెసిఫికేష‌న్స్ తెలిసేలా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో టీజ‌ర్ రిలీజ్ చేసింది. Vivo కంపెనీ ఈ సంవత్సరం ఆగస్టులో దేశీయ మార్కెట్‌లో విడుద‌ల చేసిన‌ Vivo V40 సిరీస్‌ను పోలి ఉండేలా వెనుక కెమెరా మాడ్యూల్‌ను టీజర్‌లో చూపించారు. పైభాగంలో రౌండ్‌ మాడ్యూల్‌తో కొద్దిగా పైకి లేచిన నిలువు పిల్-ఆకారపు LED ఫ్లాష్ యూనిట్‌తో పాటు రెండు వెనుక కెమెరా యూనిట్‌లను కలిగి ఉంటుంది. ఇది చూసేందుకు ఎంతో ఆకర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

ఆకుపచ్చ రంగులో అందంగా..

Vivo T3 Ultra యొక్క ఫ్రంట్ ప్యానెల్ చాలా స్లిమ్ బెజెల్స్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. కుడివైపున‌ వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ ఆకుపచ్చ రంగులో అందంగా కనిపిస్తుంది. 12GB RAMతోపాటు 12GB అదనపు ఫోర్‌తో జత చేయబడిన MediaTek డైమెన్సిటీ 9200+ ప్రాసెస‌ర్‌ను అందించారు. ఇది AnTuTu బెంచ్‌మార్క్ పరీక్షలో 1,600K+ స్కోర్ చేసినట్లు కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఈ స్కోర్ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 8 Gen 2, 8S Gen 3 ప్రాసెసర్‌ల స్మార్ట్‌ ఫోన్‌ల‌ను అధిగమిస్తుందని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

పూర్తి వివరాలు సెప్టెంబర్ 9న..

Vivo T3 Ultra స్మార్ట్‌ ఫోన్ 6.78-అంగుళాల 1.5K AMOLED 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 nits గరిష్ట బ్రైట్‌నెస్‌, HDR10+ స‌పోర్ట్‌తో వ‌స్తుంది. ఈ ఫోన్‌ 80W వైర్డ్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,500mA బ్యాటరీని క‌లిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 7.58mm స్లిమ్ ప్రొఫైల్‌ కలిగి ఉన్నప్పటికీ పెద్ద 5500mAh బ్యాటరీతో రావ‌టాన్ని ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌చ్చు. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము మరియు స్ప్లాష్ నిరోధకత కోసం IP68-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. T3 Ultra ఫోన్ యొక్క సోనీ-బ్యాక్డ్ రియర్ కెమెరా యూనిట్ వివరాలు సెప్టెంబర్ 9న వెల్లడవుతాయని మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది. అలాగే దీని ధ‌ర‌ సుమారు రూ. 33,000 వ‌ర‌కూ ఉండవచ్చని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Comments
మరింత చదవడం: Vivo T3 Ultra, Vivo T3 series, Vivo T3 Ultra India Launch
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి
 
 

ప్రకటన

ప్రకటన

© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »