మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మూడు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. 8GB+128GB బేస్ మోడల్ ధర రూ. 26,999 కాగా, 8GB+256GB వేరియంట్ రూ. 29,999.
Photo Credit: Motorola
మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ అదిరిపోయే బ్యాటరీతో ఎంట్రీ
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటోరోలా తన పట్టును మరింత బిగించేందుకు 'ఎడ్జ్ 70 ఫ్యూజన్'ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఆధునిక కుర్రకారు అభిరుచులకు తగ్గట్టుగా స్టైలిష్ డిజైన్, అల్ట్రా-మోడరన్ ఫీచర్లతో ఈ ఫోన్ తీసుకొచ్చింది. కేవలం చూడటానికే కాకుండా, పనితీరులో కూడా ఇది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరలోనే మోటోరోలా అందిస్తోంది. నేటి తరం స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆశించే వేగం, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ వంటి అన్ని అంశాలను సమపాళ్లలో మిళితం చేస్తూ ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.
ధర విషయానికి వస్తే, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మూడు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. 8GB+128GB బేస్ మోడల్ ధర రూ. 26,999 కాగా, 8GB+256GB వేరియంట్ రూ. 29,999, టాప్-ఎండ్ 12GB+256GB మోడల్ ధర రూ. 32,999 గా కంపెనీ నిర్ణయించింది. అయితే, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారికి రూ. 2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది, దీనివల్ల ప్రారంభ ధర రూ. 24,999 కి తగ్గుతుంది. మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఎర్లీ బర్డ్ సేల్ నిర్వహించబడుతుంది. ఆ తర్వాత మార్చి 12 నుండి సాధారణ విక్రయాలు ప్రారంభమవుతాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల సూపర్ హెచ్‌డి 1.5K ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు, ఇది వినియోగదారులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ముఖ్యంగా 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల పట్టపగలు ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హెచ్‌డిఆర్ 10 ప్లస్ సపోర్ట్, 10-బిట్ కలర్ డెప్త్ వంటి ఫీచర్లు సినిమా చూసే అనుభూతిని ఇంటికే తెస్తాయి. స్క్రీన్ భద్రత కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఉపయోగించడం విశేషం, ఇది ఫోన్ కింద పడినా గీతలు పడకుండా రక్షిస్తుంది.
పనితీరు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మోటోరోలా ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను వాడింది. ఇది మల్టీ టాస్కింగ్, హెవీ గేమింగ్ చేసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉండటం వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. వినియోగదారులకు భరోసా ఇస్తూ, మూడు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఇది ఫోన్ ఎక్కువ కాలం కొత్తదిగా ఉండటానికి సహాయపడుతుంది.
ఫోటోగ్రఫీ కోసం మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ LYTIA 710 ప్రైమరీ సెన్సార్ ఉంది, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల నడిచేటప్పుడు ఫోటోలు తీసినా లేదా వీడియోలు తీసినా అస్సలు షేక్ అవ్వవు. దీనితో పాటు 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది, ఇది మైక్రో ఫోటోగ్రఫీని కూడా సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు, ఇది 4K క్వాలిటీలో వీడియోలను రికార్డ్ చేయగలదు. సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారికి, ఫోటోలు దిగేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పచ్చు.
ఈ ఫోన్ లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఇందులోని 7,000mAh భారీ బ్యాటరీ. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు కేవలం 193 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంతో రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. అదనంగా, ఈ ఫోన్ ఐపి68, ఐపి69 రేటింగ్స్‌తో వస్తుంది, అంటే నీటిలో పడినా లేదా దుమ్ము చేరినా ఫోన్‌కు ఏమీ కాదు. దీనితో పాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉండటం వల్ల ఈ ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది.
ప్రకటన
ప్రకటన