Photo Credit: Vivo
వివో T4 లైట్ 5G 6,000mAh బ్యాటరీతో వస్తుంది.
ప్రముఖ చైనీస్ మొబైల్ మేకింగ్ కంపెనీ Vivo తాజాగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగంలో Vivo T4 Lite 5G మోడల్‌ను మన దేశంలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది విడుదలైన Vivo T3 Lite 5G కు కొనసాగింపు దీనిని పరిచయం చేయనుంది. ఇది మీడియాటెక్ డైమెన్సెసిటీ 6300 ప్రాసెసర్‌తో శక్తిని గ్రహిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, ఈ మోడల్‌కు గతంలో వచ్చిన T3 Lite 5G కంటే శక్తివంతమైన బ్యాటరీని అందించే అవకాశాలు ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 10,000 ఉంటుందని, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానున్నట్లు సమాచారం.జూన్ నెల చివరి నాటికి,కొత్త Vivo T3 Lite 5G విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, గతంలో వచ్చిన లీక్‌ల ఆధారంగా రాబోయే ఈ స్మార్ట్ ఫోన్ జూన్ నెల చివరి నాటికి మన దేశంలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతే కాదు, T3 Lite 5G హ్యాండ్‌సెట్ స్లిమ్ డిజైన్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రూపొందించబడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే మన దేశంలో Vivo కంపెనీ నుంచి రాబోయే తమ Vivo T4 Lite 5G విడుదలకు సంబంధించిన ప్రచార పనులను మొదలుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh కలిగిన భారీ బ్యాటరీతో రానున్నట్లు తెలియడంతోపాటు, ధర కూడా రూ. 10000 కావడంతో, ఈ ధర రేంజ్‌లో ఇంతటి బ్యాటరీ సామర్థ్యం కలిగిన మొదటి హ్యాండ్‌సెట్‌గా T4 Lite 5G నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వచ్చిన Vivo T3 Lite 5G మోడల్ కేవలం 5000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి వచ్చింది.
డిస్‌ప్లే విషయానికి వస్తే, ఈ ధర పరిధిలో వెయ్యి నిట్‌ల వరకూ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉన్న మొదటి ఫోన్‌గా Vivo T4 Lite 5G ను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అలాగే, ఈ మోడల్‌కు ఏఐ ఆదారిత ఫీచర్స్‌ను కూడా జోడించినట్లు స్పష్టం చేసింది. దీని అమ్మకాల కోసం Vivo ఇండియ అధికారిక వెబ్ సైట్‌తోపాటుగా స్పెషల్ ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసిన ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది.
తాజాగా మార్కెట్‌కు పరిచయం అయిన iQOO Z10 Lite ను పోలి ఉండే స్పెసిఫికేషన్స్‌తో Vivo T4 Lite 5G ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ iQOO Z10 Lite హ్యాండ్‌సెట్ ఐపీ54 రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. అలాగే, ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిత్‌తో రూపొందించబడింది. ఈ మోడల్ మిడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో 8జీబీ RAM 256జీబీ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ప్రకటన
ప్రకటన