అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న వివో X ఫోల్డ్ 5...ప్రైస్ ఎంతో తెలుసా

ఈ వివో X ఫోల్డ్ 5 బరువు వచ్చేసి మొత్తంగా 209g ఉంటుంది. ఇటువంటి ఫోల్డ్ మోడల్స్ కి ఈ బరువు చాలా తక్కువ అని చెప్పొచ్చు.

అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న వివో X ఫోల్డ్ 5...ప్రైస్ ఎంతో తెలుసా

Photo Credit: Vivo

Vivo అధికారికంగా చైనాలో Vivo X ఫోల్డ్ 5 టీజింగ్ ప్రారంభించింది

ముఖ్యాంశాలు
  • ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ని తట్టుకునేలా రూపొందించబడిన డిజైన్
  • లైట్ వెయిట్ తో, స్లిమ్ బాడీ తో ఈజీగా ఎక్సెస్ చేయవచ్చు
  • 6000mAh బ్యాటరీ బ్యాకప్ ఇస్తూ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్
ప్రకటన

ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో కొత్త కొత్త ఫోన్లు వరుసగా లాంచ్ అవుతూనే ఉన్నాయి. స్లిమ్, ఫ్లిప్, ఫోల్డ్ మోడల్స్ ఇలా ఎన్నో వేరియంట్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా తన కొత్త ఫోల్డబుల్ మోడల్ వివో X ఫోల్డ్ 5ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికే బయటకు వచ్చేసింది, అందులో చూపించిన స్పెసిఫికేషన్లు చూస్తే ఈ ఫోన్ పక్కా ప్రీమియం కేటగిరీలోదే అని చెప్పొచ్చు.ఈ ఫోన్‌లో లోపల మరియు బయట రెండు డిస్‌ప్లేలు 8T LTPO ప్యానల్స్ తో వచ్చాయి. ఇవి ఫోన్ కి మంచి ప్రీమియం లుక్ ను అందిస్తున్నాయి.
వీటికి హై రిఫ్రెష్ రేట్, అల్ట్రా హై రిజల్యూషన్, హై పిక్సెల్ డెన్సిటీ ఉండడం వల్ల యూజర్స్‌కు అత్యుత్తమ విజువల్ అనుభూతిని ఇస్తుంది. రెండు స్క్రీన్లు కూడా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉండగా, హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, TUV రెహినాల్డ్ ఐ ప్రొటెక్షన్ 3.0, జెస్ మాస్టర్ కలర్ సర్టిఫికేషన్ లాంటి టాప్ క్లాస్ సాంకేతికతలు ఇందులో ఉన్నాయి.

వాతావరణం ఎంత చలిగా ఉన్నా ఈ ఫోన్ పనిచేస్తుంది. మైనస్ 20 డిగ్రీలలో కూడా వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇక పొరపాటుగా డస్ట్‌లో పడినా, నీటిలో తడిచినా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి IP5X, IPX9+ రేటింగ్స్ ఉన్నాయి. అంతే కాదు, ఒక మీటరు లోతైన నీటిలో 1000 సార్లు ఫోన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినా కూడా ఎలాంటి సమస్య రాకుండా పనిచేస్తుందని వివో తెలిపింది.

లీకైన సమాచారం ప్రకారం, ఈ మోడల్ గత సంవత్సరం వచ్చిన వివో ఫోల్డ్ 3 (219g) కంటే తక్కువ బరువుతో, మరింత స్లిమ్ మోడల్‌గా రానుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇందులో 8.03 అంగుళాల ఇన్నర్ ఫోల్డబుల్ స్క్రీన్, 6.53 అంగుళాల కవర్ డిస్ప్లే ఉన్నాయి.

కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండడం వల్ల అధ్బుతమైన ఫోటోలు తీయవచ్చు. ఎక్కువ సేపు వాడే వాళ్ల కోసం ఇందులో 6000mAh బ్యాటరీ బ్యాక్అప్ కూడా అందిస్తున్నారు. అలాగే 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పనితీరులో కూడా రాజీ పడకుండా, Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి హైఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ ధర ఎంత అనేది ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ స్పెసిఫికేషన్స్ బట్టి వివో నుంచి వచ్చిన గత ఫోల్డ్ మోడల్స్ కి దగ్గరగానే ధర ఉండవచ్చు అని టెక్ పండితులు అంచనా వేస్తున్నారు.

Comments

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »