Photo Credit: Vivo
Vivo's Fold 5 measures 9.2m in thickness when folded and 4.3m when unfolded
ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లోకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రతి స్మార్ట్ ఫోన్ కంపెనీ ఉత్తమ బ్రాండ్ నుండి అత్యుత్తమ స్పెసిఫికేషన్లతో ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో కూడా ఈ సెగ్మెంట్లో పలు బ్రాండ్లను ప్రకటించింది. వివో తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వివో X ఫోల్డ్ 5ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనితో పాటు వివో X200 FE మోడల్ కూడా లాంచ్ అయింది. వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌కి ధరను కంపెనీ రూ.1,49,999గా నిర్ణయించింది ప్రస్తుతం ఇది టైటానియం గ్రే కలర్ ఆప్షన్‌లో బుకింగ్‌కి అందుబాటులో ఉంది. జూలై 30 నుండి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మరియు వివో అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి రానుంది.
వివో X ఫోల్డ్ 5లో 8.03 అంగుళాల AMOLED ఫోల్డబుల్ ఇన్నర్ డిస్‌ప్లే (2480×2200 పిక్సెల్స్ రిజల్యూషన్), అలాగే 6.53 అంగుళాల AMOLED కవర్ స్క్రీన్ (2748×1172 పిక్సెల్స్) తో వస్తుంది. ఈ రెండూ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, TÜV Rheinland గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 3.0, మరియు Zeiss Master Colour సర్టిఫికేషన్ కలిగి ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్15 బేస్డ్ ఫన్ టచ్ OS 15 రన్ అవుతుంది. అంతేకాకుండా, LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజ్, మరియు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ తో ఇది పని చేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో త్రిబుల్ కెమెరా సెట్ అప్ ఉంది. 50MP సోనీ IMX921 ప్రైమరీ లెన్స్ , 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్, 50MP సామ్‌సంగ్ JN1 అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం లోపలి, బయట ఫోల్డ్‌లపై 20MP కెమెరాలు (f/2.4) ఉన్నాయి. ఇంకా, AI ఇమేజ్ స్టూడియో ఫీచర్లు ఫోటోగ్రఫీకి స్పెషల్ ఎఫెక్ట్స్ అందిస్తాయి..
ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ బ్యాక్అప్ ఉంది. ఇది 80W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఇది IPX8 + IPX9 + IP5X రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ నీటిలో పడిన, దుమ్ములో పడిన ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని ఉండదు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ నానో సిమ్, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, OTG, NFC, మరియు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు మందం 9.2mm కాగా, అన్‌ఫోల్డ్ చేసినపుడు 4.3mm మాత్రమే ఉంటుంది. మొత్తం బరువు 217 గ్రాములు మాత్రమే. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే, ఇది మార్కెట్లో ఉన్న ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
ప్రకటన
ప్రకటన