Photo Credit: Vivo
Vivo X Fold 5 మరియు Vivo X200 FE ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థ Vivo బ్రాండ్ నుంచి మన దేశీయ మార్కెట్‌లోకి త్వరలోనే Vivo X Fold 5, Vivo X200 FE పేరుతో రెండు హ్యండ్‌సెట్‌లు విడుదల కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌లను జూలై 14న లాంఛ్ చేయనున్నట్లు Vivo అధికారికంగా తెలిపింది. ఈ రెండు మోడల్స్ కూడా ఇప్పటికే చైనాతోపాటు తైవాన్ మొబైల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మన ఇండియన్ మార్కట్‌లో కంపెనీ అధికారిక వెబ్ సైట్‌తోపాటు ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరను కూడా ఓ టిప్‌స్టర్ ద్వారా బహిర్గతమైంది. ఈ మొబైల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.ఇండియాలో వీటి ధర ఇలా,జూలై 14న మన దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోయే Vivo X Fold 5, Vivo X200 FE స్మార్ట్ ఫోన్‌ల ధరను ఓ టిప్‌స్టర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇండియాలో X Fold 5 హ్యాండ్‌సెట్ 16GB RAM+ 512GB స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 1,49,999లుగానూ, Vivo X200 FE మోడల్ 16GB RAM +512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 59,999గా కంపెనీ నిర్ణయించినట్లు టిప్‌స్టర్ ద్వారా అంచనా వేయబడింది.
చైనా వేరియంట్ Vivo X Fold 5 ఫోన్ 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో రూపొందించబడింది. అలాగే, దీనిలో 8.03 అంగుళాల ఇన్నర్ ఫ్లెక్సిబల్ ప్యానల్‌ను అందించారు. ఈ రెండింటి బ్రైట్ నెస్ లెవెల్ 4,500 నిట్‌ల వరకూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ హ్యాండ్‌సెట్‌ను Zeiss బ్రాండ్ ట్రిపెల్ రియర్ కెమెరా సెటప్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలి ఫొటో కెమెరాను అందించారు.
Vivo X200 FE ఫోన్ విషయానికి వస్తే, ఇది 6.31 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రూపొందించబడింది. అలాగే, మీడియాటెక్ డైమన్సెటీ 9300+ ప్రాసెసర్‌ను దీనికి అందించారు. దీని సామర్థ్యం కారణంగా ఫోన్ వేగవంతమైన పనితీరును కలిగి ఉంటుందిని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ లక్స్ గ్రే, అంబర్ ఎల్లో, ఫ్రాస్ట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది.
రెండు హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన బ్యాటరీ సామర్థ్యాన్ని చూస్తే, Vivo X Fold 5 మోడల్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే, Vivo X200 FE కు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ 7.99 ఎంఎం మందంతో 186 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. వీటి పూర్తి వివరాలు లాంఛ్‌కు ముందు రోజుల్లోనే కంపెనీ వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన