Photo Credit: Vivo
వివో X200 FE అంబర్ ఎల్లో, ఫ్రాస్ట్ బ్లూ మరియు లక్స్ గ్రే రంగులలో అమ్మకానికి ఉంది
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో, తన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వివో X200 FEను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇదే రోజు మరో ఫోల్డబుల్ మోడల్ అయిన వివో X ఫోల్డ్ 5 కూడా లాంచ్ చేశారు. సింపుల్ డిజైన్, పవర్ఫుల్ హార్డ్‌వేర్ తో ఈ ఫోన్ వినియోగదారుల దృష్టిని ఆకట్టుకుంటుంది.గత జూన్‌లో తైవాన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్, ఇప్పుడు భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ధర విషయంలో చూస్తే, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.54,999గా, ఇక 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.59,999గా ప్రకటించింది. అంబర్ యెల్లో, ఫ్రోస్ట్ బ్లూ, లక్స్ గ్రే వంటి మూడూ స్టైలిష్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.వివో X200 FE స్పెసిఫికేషన్లు – డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ,ఈ ఫోన్‌లో 6.31 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్‌రేట్‌తో వచ్చే ఈ డిస్‌ప్లే, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగలదు. ఇది కేవలం క్లారిటీ మాత్రమే కాక, సన్‌లైట్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
పరఫార్మెన్స్ పరంగా, ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్ ఉంది. దీని తో పాటు 16GB LPDDR5X RAM మరియు 512GB UFS 3.1 స్టోరేజ్ లభిస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ఆండ్రాయిడ్ 15 పై నడిచే ఫన్ టచ్ OS 15 ఈ ఫోన్‌కు మరింత బలంగా ఉంటుంది .
ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. Zeiss భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP సోనీ IMX921 ప్రైమరీ లెన్స్ (OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రావైడ్ లెన్స్ (120 డిగ్రీ వ్యూ),
50MP IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్, OIS) తో ఇది వస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఉంది.బ్యాటరీ, ఛార్జింగ్, మరియు ఇతర ఫీచర్లు,వివో X200 FEలో 6,500mAh బ్యాటరీ బ్యాక్అప్ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది, అంటే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఛార్జ్ అవుతుంది. భద్రత కోసం ఇది ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది.
దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఇది IP68 మరియు IP69 సర్టిఫికేషన్లను పొందింది. కనెక్టివిటీ విషయానికొస్తే, ఇందులో డ్యూయల్ నానో సిమ్, 5G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, OTG, NFC, మరియు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ డైమెన్షన్స్ విషయానికి వస్తే
. 150.83x71.76x7.99mmతో 186 గ్రాములు బరువుతో వస్తుంది. అంటే లైట్‌వెయిట్ ఫోన్ కావడంతో, దీన్ని ఒకచేతితో కూడా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే, వివో X200 FE ఒక బలమైన స్పెసిఫికేషన్లతో కూడిన ప్రీమియం మిడ్‌రేంజ్ ఫోన్. కెమెరా నాణ్యత, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఈ ధరకు ఈ ఫీచర్లు లభించడం నిజంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.జూలై 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో అఫీషియల్ ఇ-స్టోర్‌లో దొరుకుతుంది. ఇప్పటికే ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
ప్రకటన
ప్రకటన