Photo Credit: Vivo
Vivo X200 FE నాలుగు రంగు ఎంపికలలో అందించబడుతుందని నిర్ధారించబడింది
ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో గ్లోబల్ మార్కెట్‌లోకి Vivo X200 FE లాంఛ్ చేసేందుకు Vivo సన్నాహాలు చేస్తోంది. మరో వారంలో ఈ మొబైల్ ప్రపంచ మార్కెట్‌లోకి రానున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ మలేషియా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ ఆర్డర్స్ కోసం లిస్ట్ అవుట్ చేయబడింది. పిల్ షేప్‌లో నిలువుగా ఉండే డిజైన్‌తో కూడిన ప్రధాన కెమెరా యూనిట్‌తో Vivo X200 FE రూపొందించబడింది. అలాగే, ఆకట్టుకునేలా హోల్ పంచ్ కటౌట్‌తో డిజైన్ చేయబడిన ఫ్రంట్ కెమెరా ఈ హ్యాండ్‌సెట్‌కు హైలెట్‌గా నిలుస్తుంది.Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా,తాజాగా, పింక్, ఎల్లోతోపాటు నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభించనున్న Vivo X200 FE కోసం కంపెనీ ప్రత్యేకంగా ఓ మైక్రోసైట్‌ను రూపొందించింది. అలాగే, సైట్‌లో ఓ ప్రకటన ద్వారా “Coming Soon” అని ట్యాగ్ చేయబడిన మెసేజ్‌తో జూన్ 23న పరిచయం చెయ్యడంతోపాటు జూలై 11న విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. టీజర్‌లోని ఇమేజ్‌లను పరిశీలిస్తే.. Vivo X200 FE ఫోన్ కెమెరా యూనిట్‌పై స్పష్టత వస్తోంది. దీనికి Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో ఒకే పిల్ షేప్ యూనిట్‌లో రెండు కెమెరా సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. మూడవ లెన్స్‌గా రింగ్ షేప్ ఎల్ఈడీ ఫాష్ కింద ఉంచబడింది.
రాబోయే Vivo X200 FE ఫోన్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇమేజ్‌లో కుడివైపు పవర్ బటన్‌తోపాటు వాల్యూమ్ రాకర్స్‌ను అందించారు. అలాగే, ముందు భాగంలో సన్నని బెజెల్స్, సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ గమనించవచ్చు. ఇటీవల మార్కెట్‌లోకి విడుదల అయిన Vivo S30 Pro Mini ఫోన్ డిజైన్ చాలా వరకు పోలీ ఉన్నట్లు కనిపిస్తోంది. దీని కొనసాగింపుగా Vivo X200 FE రాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Vivo X200 FE కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానప్పటికీ, ఇప్పటికే కంపెనీ మలేషియా అధికారిక వెబ్ సైట్‌లో కనిపిస్తున్న డిజైన్‌ను బట్టీ కొన్ని స్పెసిఫికేషన్స్‌ను అంచనా వేస్తున్నారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌తో శక్తిని గ్రహిస్తుందని భావిస్తున్నారు. అలాగే, 12జీబీ RAM, 512జీబీ స్టోరేజీ వేరియంట్‌తోపాటు మరిన్ని ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాబోయే Vivo X200 FE ఫోన్ 6.31 అంగుళాల ఎల్‌టీపీఓ OLED స్క్రీన్‌తో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అలాగే, దీని కెమెరా విషయానికి వస్తే, సోనీ ఐఎంఎక్స్921 సెన్సార్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌ను అందించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 90W ఛార్జంగ్ సపోర్ట్‌తో 6500mAh భారీ బ్యాటరీతో రావచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన