వివో నుంచి సరికొత్తగా రెండు మోడల్స్ మార్కెట్లోకి రాబోతోన్నాయి. వివో X300, వివో X300 ప్రో అనే రెండు మోడల్స్ అక్టోబర్ 13న మార్కెట్లోకి రాబోతోన్నాయి. ఈ మోడల్స్ ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి.
Photo Credit: Vivo
వివో ఎక్స్ 300 ప్రో (చిత్రంలో) దాని పూర్వీకుడికి సమానమైన డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది
వివో నుంచి వచ్చే ఫోన్లకు మార్కెట్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెమెరా పని తీరు, వీడియో, ఆడియో, బ్యాటరీ ఇలా అన్నింట్లోనూ వివో తమ వినియోగదారుల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలో వివో నుంచి రెండు కొత్త మోడల్స్ వస్తోండటంపై యూజర్స్ ఆసక్తిని కనబర్చుతున్నారు. వివో ఎక్స్300 సిరీస్ వచ్చే నెలలో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ సోమవారం ప్రకటించింది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్షరర్ (OEM) నుండి రాబోయే లైనప్‌లో వివో ఎక్స్300, వివో ఎక్స్300 ప్రో అనే రెండు మోడళ్లు ఉంటాయని తెలుస్తోంది. లాంచ్‌కు ముందు ప్రామాణిక వివో ఎక్స్300 వేరియంట్ రంగులు లీక్ అయ్యాయి.ఈ హ్యాండ్‌సెట్ నాలుగు షేడ్స్‌లో వస్తుంది. ఇందులో వెల్వెట్ గ్లాస్ మెటీరియల్ ఉంటుంది.
వివోలో ప్రొడక్ట్ మేనేజర్ హాన్ బాక్సియావో రాబోయే వివో ఎక్స్300 సిరీస్ అక్టోబర్ 13న స్థానిక సమయం సాయంత్రం 7 గంటలకు (భారతదేశంలో ఉంటే సాయంత్రం 4:30 గంటలకు) చైనాలో లాంచ్ అవుతుందని ప్రకటించారు. వివో ఎక్స్300 సిరీస్ కెమెరా డెకోలో నీటి బిందువుల్లాంటి ఆకారంతో కొత్తగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ కొత్త మోడల్స్ ఫ్రీ బ్లూ, కంఫర్టబుల్ పర్పుల్, ప్యూర్ బ్లాక్, పింక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. Vivo X300 సిరీస్ ఇప్పటికే మోడల్ నంబర్ 751440 తో “ఫస్ట్ ఎవర్ కస్టమ్-బిల్ట్” సూపర్ సెన్స్ వైబ్రేషన్ మోటారుతో వస్తుందని నిర్ధారించబడింది. ఇది మెరుగైన డిజైన్, అధునాతన విద్యుదయస్కాంత పరిష్కారాలను కలిగి ఉందని పేర్కొన్నారు.
ప్రో మోడల్‌లో యాజమాన్య యూనివర్సల్ సిగ్నల్ యాంప్లిఫైయర్ చిప్‌సెట్, డ్యూయల్-ఛానల్ UFS 4.1 ఫోర్-లేన్ ఆన్‌బోర్డ్ స్టోరేజీతో ఉంటుంది. ఇది రీడ్ అండ్ రైట్ వేగాన్ని 70 శాతానికి పైగా పెంచుతుందని, గరిష్టంగా 8.6Gbps వేగాన్ని చేరుకోగలదని Vivo పేర్కొంది.
రెండు హ్యాండ్‌సెట్‌లు 23mm ఫోకల్ లెంగ్త్, HPB సెన్సార్‌తో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌ను పొందుతాయని అధికారి తెలిపారు. వివో ఎక్స్ 300 ప్రో 85 ఎంఎం 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటు, CIPA 5.5-లెవల్ యాంటీ-షేక్ సర్టిఫికేషన్‌ను పొందుతుందని కూడా టీజ్ చేయబడింది. అక్టోబర్ 13న జరగనున్న వివో X300 సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.
ప్రకటన
ప్రకటన