త్వరలో రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్, ఈ మొబైల్లో అదిరిపోయే కొత్త ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు

రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్ త్వరలో లాంఛ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ టీజర్‌ విడుదలైంది. Realme 15 Pro 5G Game of Thrones Edition కొత్త కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.

త్వరలో రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్, ఈ మొబైల్లో అదిరిపోయే కొత్త ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు

Photo Credit: Realme

రియల్‌మే 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్ ఇలాంటి స్పెసిఫికేషన్లతో ప్రారంభం కావచ్చు

ముఖ్యాంశాలు
  • రియల్‌మే 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్‌లో అప్‌గ్రేడింగ్ ఫీచర్లతో వచ
  • ప్రస్తుతం మూడు కలర్స్‌లో Realme 15 Pro 5G ఫోన్
  • కొత్త కలర్స్‌లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్
ప్రకటన

రియల్‌ మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ త్వరలో ప్రారంభం కానుంది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఫోన్ టీజర్‌ను విడుదల చేశారు. రాబోయే ప్రత్యేక వేరియంట్‌కు సంబంధించి కంపెనీ ఇతర వివరాలను వెల్లడించ లేదు. రియల్‌ మీ 15 ప్రో 5G ఫోన్ జూలైలో భారతదేశంలో లాంఛ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ మూడు రంగులు, నాలుగు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, టెక్ సంస్థ రాబోయే ప్రత్యేక ఎడిషన్ ఫోన్‌ను కొత్త కలర్స్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఇలాంటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు కలిగి ఉంటుంది.Realme 15 Pro 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ ధర, లభ్యత (అంచనా)
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌ మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్‌ను త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధ్రువీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, లాంఛ్ తేదీ ఇంకా వెల్లడించ లేదు. అయితే దీని ధర జూలైలో విడుదలైన స్టాండర్డ్ రియల్‌ మీ 15 ప్రో 5G మోడల్ ధర రూ. 31,999లుగా ఉన్న బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు సమానమైన ధర ఉండొచ్చు.
 

మరోవైపు, టాప్-ఆఫ్-ది-లైన్ 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్లు వరుసగా రూ. 33,999లు, రూ. 35,999లు, రూ. 38,999 ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఇది ఫ్లోయింగ్ సిల్వర్, వెల్వెట్ గ్రీన్, సిల్క్ పర్పుల్ కలర్సర్ అందించబడుతుంది.

  • Realme 15 Pro 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు (అంచనా)
  • Realme 15 Pro 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్‌ కూడా అప్‌గ్రేడింగ్ వెర్షన్‌గా ఉండబోతుంది.
  • Realme 15 Pro ఫోన్‌లో ఉండినట్టే అనేక ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు ఇందులో కూడా ఉండనున్నాయి.
  • Realme 15 Pro 5G 6.8-అంగుళాల 1.5K (2,800×1,280 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌, 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,500Hz వరకు ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 6,500 nits వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. దీని ఫ్రంట్ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

పైన చెప్పినట్లుగా ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 SoC ద్వారా పవర్‌ను పొందుతుంది. దీనికి 12GB వరకు LPDDR4X RAM, 512GB వరకు UFS 3.1 ఇంటర్నెల్ స్టోరేజ్ ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే, ఇది 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్‌తో జత చేయబడింది. ముందు భాగంలో హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

అంతేకాదు 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తుంది. Realme 15 Pro 5G దుమ్ము, నీటి నిరోధకత కోసం IP66+IP68+IP69 రేటింగ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో అమర్చబడి ఉంది. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఫెస్టివల్ సేల్‌లో అదిరే ఆఫర్లు.. సెక్యూరిటీ కెమెరాల ధర ఎంతంటే
  2. ఈ ఇప్పుడు మార్కెట్‌లో వాషింగ్ మెషీన్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి
  3. ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరను కంపెనీ రూ. 94,900కి తగ్గించింది.
  4. త్వరలో రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్, ఈ మొబైల్లో అదిరిపోయే కొత్త ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు
  5. అమెజాన్ సేల్లో 2025 అదిరిపోయే డీల్స్, విద్యార్థులకు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు
  6. ఈ కేటగిరీలో ఉత్తమ డీల్‌గా లెనోవో V15 G4 ల్యాప్‌టాప్‌ చెప్పుకోవచ్చు
  7. క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, వడ్డీ లేని EMI ఆప్షన్లు కూడా లభిస్తున్నాయి.
  8. ఫెస్టివల్ సేల్‌లో 2 ఇన్ 1 ల్యాప్‌టాప్‌లపై అదిరే ఆఫర్లు.. ఏ ఏ మోడల్ ఎంతకు వస్తుందంటే?
  9. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో హోమ్ అప్లయన్సెస్‌పై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.
  10. ఈ సేల్‌లో లభించే ఆఫర్లతో మీ కొనుగోలు మరింత లాభదాయకంగా మారుతుంది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »