దీని ధర రూ.16,490గా ఉండగా, 6GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో వచ్చింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 48MP ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.6.51 అంగుళాల HD+ డిస్‌ప్లే, అల్ట్రా గేమ్ మోడ్ 2.0, పవర్ బటన్‌లో ఉన్న ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఆధునాతన ఫీచర్లతో ఇది విడుదలైంది.
Photo Credit: Vivo
Vivo Y30 5G (చిత్రంలో) జూలై 2022లో ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో ప్రారంభించబడింది
వివో తమ వై సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, వివో వై31 5G మోడల్‌ను కంపెనీ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ, ఈ హ్యాండ్‌సెట్ భారత వినియోగదారులకు బడ్జెట్ రేంజ్‌లో ఒక మంచి ఆప్షన్ గా రావచ్చని టెక్నాలజీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2021లో విడుదలైన వివో వై31 4G వెర్షన్ భారత మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీని ధర రూ.16,490గా ఉండగా, 6GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో వచ్చింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 48MP ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
6.58 అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌కి ఉన్నాయి. ఇప్పుడు రాబోయే 5G వెర్షన్ మరింత అధునాతన ఫీచర్లతో రానుందని అంచనా వేస్తున్నారు.ఇది వరకు వివో వై30 5G మోడల్‌ను కంపెనీ కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 6.51 అంగుళాల HD+ డిస్‌ప్లే, అల్ట్రా గేమ్ మోడ్ 2.0, పవర్ బటన్‌లో ఉన్న ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఆధునాతన ఫీచర్లతో ఇది విడుదలైంది.
ఇప్పుడు కంపెనీ మరో వై సిరీస్ ఫోన్‌ను కూడా త్వరలో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. వివో వై400 మోడల్‌ను ఆగస్టు 4న ఇండోనేషియాలో ఆవిష్కరించనున్నారు. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల 120Hz ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, 6000mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ IMX852 ప్రధాన కెమెరా ఉండనున్నాయి. అంతేకాకుండా, ఇది IP68 మరియు IP69 సర్టిఫికేషన్లు కలిగి ఉండడం వల్ల దుమ్ములో, నీటిలో పడిన ఎట్టువంటి ప్రాబ్లం ఉండదని చెబుతున్నారు. వివో వై400 ఫోన్ కేవలం హార్డ్‌వేర్ పరంగా మాత్రమే కాకుండా, సాఫ్ట్‌వేర్‌లో కూడా అనేక కొత్త AI ఫీచర్లను తీసుకురానుంది. ఇందులో గూగుల్ సర్కిల్ టూ సెర్చ్, AI పట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్, AI నోట్స్ సమ్మరీ, AI క్యాప్షన్, AI డాక్యుమెంట్స్, లింక్ టు విండోస్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్ బరువు సుమారు 196 గ్రాములు కాగా, 7.90mm డెన్సిటీ మాత్రమే ఉండనుందని సమాచారం. ఇదే తరహాలో, వివో వై31 5G కూడా భారత్‌లో విడుదలైతే, ఇది బడ్జెట్ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలవవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, లభ్యత వంటి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. సో, ఈ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్రకటన
ప్రకటన