Photo Credit: Vivo
Vivo Y400 Pro 5G ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ ઓફર કરશે
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Vivo తమ Y సిరీస్ నుంచి Vivo Y400 Pro 5Gను ఇండియాలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాబోయే హ్యాండ్‌సెట్‌కు చెందిన డిజైన్‌ను టీజ్ చేయడంతోపాటు ఈ నెల చివరిలో లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుందని, సరికొత్త ఏఐ ఆధారిత ఫీచర్స్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేతో అత్యంత సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నాయి. ధరకు సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడనప్పటికీ, Y400 సిరీస్ మోడల్స్‌తోపాటు ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
తాజాగా కంపెనీ నుంచి వెలువడిన ప్రమోషనల్ పోస్టర్ Vivo Y400 సిరీస్ లాంఛ్ సూచిస్తోంది. దీంతో ఈ లైనప్‌లో వచ్చే ఇతర హ్యాండ్‌సెట్‌లతోపాటుగా రాబోయే Vivo Y400 Pro 5G కూడా మార్కెట్‌లోకి విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఓ పత్రికా ప్రకటన ద్వారా ఇది మన దేశీయ మార్కెట్‌లో జూన్ 20 లాంఛ్ కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. రాబోయే హ్యాండ్‌సెట్ రూ. 25000 ధరల విభాగంలో ఉండొచ్చని అంచనా. వైట్, గోల్డ్, నెబ్యులా పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో లభించనుంది.
ప్రమోషనల్ పోస్టర్‌లో రెండు వేరు వేరు పరిమాణంలో ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌లు కలిగిన కెమెరా సెన్సార్‌లను గమనించవచ్చు. గతంలో వచ్చిన లీక్‌లను బట్టీ, రాబోయే Vivo Y400 Pro 5G 7.4 ఎంఎం మందంతో ఉంటుంది. అలాగే, 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+3డీ కర్వ్డ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రాబోతుందని భావిస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియల్ కెమెరా యూనిట్‌తో రావచ్చు.
రాబోయే Vivo Y400 Pro 5G మోడల్‌కు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ప్రత్యేక అందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది 8జీబీ RAM+ 128జీబీ, 8జీబీ+ 256జీబీ స్టోరీజీ వేరియంట్‌లలో అందుబాటులోకి రావొచ్చు. 90W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండి, 5500mAh బ్యాటరీతో దీనిని రూపొందించే అవకాశాలు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch 15తో రన్ అయ్యే Vivo Y400 5G అధనపు ఫీచర్స్ విషయానికి వస్తే, ఏఐ సూపర్ లింక్, ఏఐ నోట్ అసిస్ట్, ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్, ఏఐ స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సర్స్ విత్ గూగుల్ లాంటి సరికొత్త ఏఐ ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించినట్లు ప్రచారంలో ఉంది.
ప్రకటన
ప్రకటన