జూన్ 9 నుండి జూన్ 13 వరకు కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో జ‌ర‌గ‌నున్న‌ WWDC 2025

వ‌రల్డ్ డెవ‌ల‌ప‌ర్స్ స‌మావేశం (WWDC) 2025లో టూల్స్‌, టెక్నాల‌జీ, సాఫ్ట్‌వేర్ ఫీచ‌ర్స్‌లో వ‌స్తోన్న మార్పుల‌కు సంబంధించిన అనేక విష‌యాల‌పై పూర్తిస్థాయిలో విశ్లేష‌ణ‌ను తెలియ‌జేయ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.

జూన్ 9 నుండి జూన్ 13 వరకు కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో జ‌ర‌గ‌నున్న‌ WWDC 2025

Photo Credit: Apple

WWDC 2025 ఆన్‌లైన్ టెలికాస్ట్ ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌వారు డెవ‌ల‌ప్‌మెంట్స్ లో వ‌స్తోన్న మార్పుల‌ను తెలుసుకునే అవకాశం

ముఖ్యాంశాలు
  • డెవలపర్లు ఆపిల్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా వ్యక్తిగత యాక్సెస్ కోసం అప్లై
  • ఆపిల్ iOS 19, iPadOS 19, macOS 16 ఆవిష్కరించనుందని అంచనా
  • కీనోట్ సేష‌న్‌కు ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విన్న‌ర్స్ సైతం అప్లై చ
ప్రకటన

కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో జూన్ నెల‌లో వ‌రల్డ్ డెవ‌ల‌ప‌ర్స్ స‌మావేశం (WWDC) 2025 నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆపిల్ కంపెనీ వెల్ల‌డించింది. గ‌త ఏడాదికి కొన‌సాగింపుగా ఈ వార్షిక స‌మావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఆన్‌లైన్ టెలికాస్ట్ ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌వారు డెవ‌ల‌ప్‌మెంట్స్ లో వ‌స్తోన్న మార్పుల‌ను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు టూల్స్‌, టెక్నాల‌జీ, సాఫ్ట్‌వేర్ ఫీచ‌ర్స్‌లో వ‌స్తోన్న మార్పుల‌కు సంబంధించిన అనేక విష‌యాల‌పై పూర్తిస్థాయిలో విశ్లేష‌ణ‌ను తెలియ‌జేయ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.జూన్ 9వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు,రాబోయే జూన్ 9 నుంచి 13 వ‌ర‌కూ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని ఆపిల్ పార్క్‌లో WWDC 2025 ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ నిర్వ‌హించే ఇన్ ప‌ర్స‌న్ కీనోట్ సెష‌న్‌,తో మొద‌ల‌వుతుంది. ఇది జూన్ 9వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. అంతే కాదు, రాబోయే ఏడాది పొడ‌వునా iOS, iPadOS, visionOS, watchOS, tvOS లాంటి ఆపిల్ ఫ్లాట్‌ఫాంల‌లో వ‌చ్చే స‌రికొత్త ఆప్‌డేట్‌లతోపాటు మార్పుల గురించి క్లుప్తంగా ఇందులో వివ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి.

స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విన్న‌ర్స్

అయితే, సీట్లు ప‌రిమితంగా ఉన్న ఈ స‌మావేశానికి ఔత్సాహికులు అంద‌రూ ఆహ్వానితులేన‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. అందు కోసం డెవ‌ల‌ప‌ర్స్ ఆపిల్ డెవ‌ల‌పర్ యాప్‌తోపాటు కంపెనీ అధికారికి వెబ్ సైట్ ద్వారా ఆప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ కీనోట్ సేష‌న్‌కు ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విన్న‌ర్స్ సైతం అప్లై చేస్తుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది.

కంపెనీ నిపుణుల‌తో నేరుగా క‌నెక్ట్

ఈ స‌మావేశం ద్వారా కంపెనీ సాఫ్ట్‌వేర్‌, ఫ్లాట్‌ఫాంల‌లో చెందిన డెవ‌ల‌ప్‌మెంట్స్‌ను అనాల‌సిన్ చేసేందుకు ఆపిల్ ఫ్లాట్‌ఫాంల స్టేట్ ఆఫ్ ది యూనియ‌న్‌ను రూపొందించ‌నుంది. అలాగే, WWDC 2025 ద్వారా మొత్తంగా, వంద‌కుపైగా టెక్నిక‌ల్ సెష‌న్‌ల‌ను ఆపిల్ నిపుణులతో నిర్వ‌హించ‌నుంది. దీంతో రాబోయే టెక్నాల‌జీతోపాటు ఫ్రేమ్‌వ‌ర్స్ గురించిన చాలా స‌మాచారం తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇందులో లార్జ్ యాడ్స్‌, హెడ్‌లైన్స్ గురించి వెల్ల‌డించే గైడ్‌లు, డాక్యుమెంటేష‌న్‌ల‌ను కూడా ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఆన్ లైన్ గ్రూప్ ల్యాబ్‌ల ద్వారా కంపెనీ నిపుణుల‌తో నేరుగా క‌నెక్ట్ అవ్వొచ్చు. దీంతో పాటు వ‌న్ ఆన్ వ‌న్ అపాయింట్‌మెంట్ల ద్వారా ఆపిల్ ఇంటెలిజెన్స్‌, డిజైన్‌, డెవ‌ల‌పర్ టూర్ వంటి అనేక విష‌యాల‌ను గూర్చి తెలుసుకోవ‌చ్చు.

మేజ‌ర్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్‌డేట్‌లు

తాజాగా, ఆపిల్ కంపెనీ అధికారికంగా వెల్ల‌డించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, గ‌త స‌మావేశాల‌ను బ‌ట్టీ.. దీనిలో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉంటాయో ఇప్ప‌టికే ఓ అంచనాకు రావ‌చ్చు. అలాగే, ఇందులో ముఖ్యంగా కంపెనీ మేజ‌ర్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్‌డేట్‌ల‌కు సంబంధించిన కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించ‌నుంది. ముఖ్యంగా, macOS 16, watchOS 12, iOS 19, iPadOS 19, tvOS 19. iOS 19, iPadOS 19 ల‌లో వ‌స్తోన్న కొత్త డెవ‌ల‌ప్‌మెంట్‌ల గురించిన స‌మాచారం ప్ర‌క‌టించ‌వ‌చ్చు. అలాగే, కొత్త విజువ‌ల్ సిస్ట‌మ్‌కు సంబంధించిన అంశాలు కూడా వెల్ల‌డికానున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. కొంత ఆశ్చర్యం కలిగించే విషయం ఫ్రంట్ కెమెరాల విషయంలో కనిపిస్తోంది.
  2. OPPO Reno15 Pro Miniలో 6.32 అంగుళాల AMOLED డిస్ప్లే ఇవ్వనున్నారు.
  3. రికార్డ్ క్రియేట్ చేసిన Samsung Exynos 2600 చిప్ సెట్.. ఎప్పటి నుంచి
  4. ఫోటోగ్రఫీ పరంగా ముందు, వెనుక భాగాల్లో ఒక్కోటి చొప్పున 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఇవ్వవచ్చు.
  5. మార్కెట్లోకి రానున్న వన్ ప్లస్ వాచ్ లైట్ .. స్మార్ట్ వాచ్ ఫీచర్స్ ఇవే
  6. యాపిల్ యాప్ స్టోర్‌లో ఇకపై ఎక్కువ యాడ్స్.. కారణం ఇదేనా?
  7. రియల్ మీ 16 ప్రో ప్లస్ ఫీచర్స్ లీక్.. ప్రత్యేకతలివే
  8. Amazon Pay యాప్‌లో ఇకపై ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా UPI ట్రాన్సాక్షన్‌లను పూర్తి చేయవచ్చు.
  9. ఈ టాబ్లెట్ లావెండర్ డ్రిఫ్ట్ మరియు షాడో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
  10. కెమెరా విభాగంలో OnePlus 15R గణనీయమైన అప్‌గ్రేడ్‌ను అందించింది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »