Photo Credit: Samsung
Samsung Galaxy A16 గత ఏడాది అక్టోబర్‌లో భారతదేశంలో ప్రారంభించబడింది
త్వరలోనే మన దేశంలో Samsung Galaxy F16ను లాంఛ్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇంకా ఖచ్చితమైన లాంఛ్ తేదీని ప్రకటించలేదు. కానీ, Galaxy F16 హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లతోపాటు దీని ధర పరిధిని ఇప్పటికే ఓ టిప్‌స్టర్ లీక్ చేశారు. రాబోయే Galaxy F16 ఫోన్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. Galaxy F16 మోడల్ Galaxy A16 5G రీబ్రాండెడ్ వెర్షన్‌గా విడుదల చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజాగా, Xలో Galaxy F16 ధర పరిధితోపాటు స్పెసిఫికేషన్‌లను దేబయన్ రాయ్ (@Gadgetsdata) అనే టిప్‌స్టర్ బహిర్గతం చేశారు. ఆ పోస్ట్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ భారత్‌లో రూ. 15,000 కంటే తక్కువ ధరకు లభించనుంది. గతంలో Galaxy A16 అక్టోబర్ 2024లో మన దేశంలో ప్రారంభించబడింది. ఈ మోడల్ 8GB+128GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో రూ. 18,999 ధరను కలిగి ఉంది. రానున్న కొత్త హ్యాండ్‌సెట్ ఈ ధర కంటే తక్కువకే రానున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో మార్కెట్ వర్గాలు కొత్త మోడల్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయి.
రాబోయే Galaxy F16 స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది MediaTek నుండి 6nm డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు 8GB LPDDR4X RAMతో రన్ అవుతుంది. అలాగే, ఈ కొత్త హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరాతోపాటు వెల్లడించబడని మూడవ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
Samsung Galaxy F16 ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించే అవకాశం ఉంది. అలాగే, ఇది 25W వరకు ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయొచ్చు. Galaxy A16 కూడా అదే స్పెసిఫికేషన్‌లతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇదే సమయంలో మిగతా ఫీచర్స్ కూడా ఈ పోలికలతో ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల భారత్‌లో కొత్త Galaxy F-సిరీస్ ఫోన్ రానున్నట్లు ప్రకటించింది. ఈ రాబోయే హ్యాండ్‌సెట్ బహుశా Galaxy F 16 5G కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, మోడల్ నంబర్ SM-E166P/DSతో Galaxy F 16 కోసం సపోర్ట్ పేజీ ప్రస్తుతం శామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో లైవ్‌లో ఉంది. ఇది ముందుగా వై-ఫై అలయన్స్ డేటాబేస్‌లో కనిపించింది. అంతే కాదు, లిస్టింగ్‌లో దీనికి డ్యూయల్-బ్యాండ్ వై-ఫై కనెక్టివిటీ ఉంటుందని సూచిస్తోంది.
ప్రకటన
ప్రకటన