Photo Credit: Vivo
వివో X200 ప్రో భారతదేశంలో కంపెనీ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్
వివో నుంచి మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్ భారత్‌లో త్వరలో విడుదల కానుంది. తన ఫ్లాగ్ షిప్ లైనప్ X200 నుంచి వివో X200FE పేరుతో విడుదల చేయనుంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ 1.5K OLED డిస్‌ప్లేతో రానుంది. ఇది 120హెడ్జ్ రీఫ్రెష్ రేటు కలిగి ఉండనుది. సెక్యూరిటీపరంగా దీనిలో అండర్- డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఉండనున్నట్లు తెలిసింది. ఈ గ్యాడ్జెట్ గురించి అధికారిక సమాచారం వెలువడనప్పటికీ.. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్ కలిగి ఉండే అవకాశం ఉంది. వివో X200FE స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్‌లోకి జులైలో విడుదల కానున్నట్లు లీక్స్ వినిపిస్తున్నాయి.వివో X200FE ధర ఎంతంటే?(అంచనా),ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్, Snartprix సైట్స్... వీవో X200FE ధర వివరాలను అంచనా వేశాయి. భారత్‌లో దీని ధర రూ.50,000 నుంచి రూ.60,000 మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ అప్షన్స్‌లో లభించనున్నట్లు వెల్లడించాయి.
వివో X200 FE స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.31 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. అలాగే ఇది అండర్- డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో రానున్నట్లు తెలిసింది. ఈ హ్యాండ్‌సెట్ 200 గ్రాముల వరకు బరువును కలిగి ఉంటుందని సమాచారం. ఫలితంగా ఇది చాలా తేలికగా చేతిలో ఇమిడే విధంగా ఉండనుంది.
ఇక కెమెరా విషయానికొస్తే.. Zeiss బ్రాండ్ తో కూడిన ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీనిలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 3X టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను ఇందులో అమర్చినట్లు సమాచారం.
ఇక వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్ ఉపయోగించినట్లు తెలిసింది. ఈ గ్యాడ్జెట్‌లో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను తీసుకొచ్చిన్నట్లు టాక్. ఇప్పటి వరకు ఏ స్మార్ట్ ఫోన్‌లో ఉపయోగించని AI- సీజనల్ ప్రోట్రెయట్స్‌ను వాడినట్లు సమాచారం. కాగా ఈ ఫీచర్ ఇప్పటివరకు చైనాలో మాత్రమే పరిమితమై ఉంది. ఇక వివో X200 FE ఆండ్రాయిడ్ 15 ఆధారిత OSపై పనిచేస్తుంది. ఈ హ్యాండ్ సెట్‌తో పాటు మూడు సంవత్సరాల పాటు OS, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ వివో ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఈ స్మార్ట్ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటు 6500mAh భారీ బ్యాటరీతో విడుదల కానున్నట్లు టాక్. ఇక ఈ గ్యాడ్జెట్ అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలిసింది.
ప్రకటన
ప్రకటన