2025 పనాసోనిక్ P-సిరీస్ టీవీల ధరలు రూ.17,990 నుండి ప్రారంభమై రూ.3,99,990 వరకు ఉన్నాయి.

ఈ టీవీ సైజులు 65 అంగుళాలు, 75 అంగుళాలు వరకు ఉన్నాయి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 4K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తున్నాయి.4K స్టూడియో కలర్ ఇంజిన్, హెక్సా క్రోమా డ్రైవ్ వంటి కలర్ టెక్నాలజీ ఇందులో ఉంది.

2025 పనాసోనిక్ P-సిరీస్ టీవీల ధరలు రూ.17,990 నుండి ప్రారంభమై రూ.3,99,990 వరకు ఉన్నాయి.

Photo Credit: Panasonic

పానాసోనిక్ షినోబిప్రో మినీఎల్ఈడి టీవీలు బెజెల్-లెస్ డిజైన్‌ను అందిస్తాయి

ముఖ్యాంశాలు
  • 4K రిజల్యూషన్, 120HZ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది
  • ప్రీ ఇన్స్టాల్ అయి వస్తున్న అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్
  • ప్రారంభ ధర రూ. 17,990 మాత్రమే
ప్రకటన

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పనాసోనిక్, భారత మార్కెట్‌లో తన కొత్త P-సిరీస్ టీవీ రేంజ్ ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో షినోబీప్రో మినీఎల్ఈడి ఫ్లాగ్‌షిప్ మోడల్‌తో పాటు, 4K గూగుల్ టీవీలు, ఫుల్ హెచ్‌డీ మరియు హెచ్‌డీ రెడీ గూగుల్ టీవీ మోడల్స్‌తో కలిపి మొత్తం 21 ఎల్ఈడి మోడల్స్ ఉన్నాయి. ప్రీమియం నుండి కాంపాక్ట్ హోమ్ అవసరాల వరకు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త లైనప్‌ను రూపొందించారు. కొత్త పనాసోనిక్ టీవీలు స్లిమ్ బెజెల్ డిజైన్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM) వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి.2025 పనాసోనిక్ P-సిరీస్ టీవీల ధరలు రూ.17,990 నుండి ప్రారంభమై రూ.3,99,990 వరకు ఉన్నాయి. 65 అంగుళాల షినోబీప్రో మినీ ఎల్ఈడి టీవీ ధర రూ.1,84,990 కాగా, 75 అంగుళాల మోడల్ ధర రూ.3,19,990గా నిర్ణయించారు. ఈ టీవీలు దేశవ్యాప్తంగా పనాసోనిక్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌తో పాటు ఎంపిక చేసిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా లభ్యమవుతున్నాయి.

పనాసోనిక్ షినోబీప్రో మినీఎల్ఈడి టీవీల ఫీచర్లు:

టీవీ సైజులు 65 అంగుళాలు, 75 అంగుళాలు వరకు ఉన్నాయి. ఇవి మినీ హోమ్ థియేటర్ ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 4K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తున్నాయి. 4K స్టూడియో కలర్ ఇంజిన్, హెక్సా క్రోమా డ్రైవ్ వంటి కలర్ టెక్నాలజీ ఇందులో ఉంది. 66W స్పీకర్స్, డాల్బీ ఆట్మాస్, డిటిఎస్ ట్రూ సర్‌రౌండ్, ఇన్‌బిల్ట్ హోమ్ థియేటర్ ట్యూయిటర్లతో వస్తుంది. ఇది బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.

అంతేకాకుండా గూగుల్ టీవీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటి యాప్‌లు కూడా ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్తగా రిలీజ్ అయ్యే కంటెంట్ మొత్తం యాక్సెస్ చేయవచ్చు. రిమోట్ కంట్రోల్, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ ఫీచర్స్ తో టీవీని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు.2x HDMI 2.1 పోర్టులు, 2x USB పోర్టులు, వై-ఫై, బ్లూటూత్, ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ కనెక్టివిటీ ఫీచర్స్ తో టీవీ ని మల్టిపుల్ పర్పస్ కి యూస్ చేయవచ్చు. ఇదే కాకుండా తక్కువ లాటెన్సీతో ప్రత్యేక గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పొందవచ్చు.

ఈ కొత్త పనాసోనిక్ P-సిరీస్ టీవీలు ప్రీమియం డిజైన్, అధునాతన సౌండ్ & పిక్చర్ క్వాలిటీతో వినియోగదారులకు మరింత అద్భుతమైన వినోదాన్ని అందించనున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ తో బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకునే కస్టమర్స్ కి ఈ టీవీలు మంచి ఎంపిక అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీ ప్రైస్ రేంజ్ బట్టి టీవీ సిరీస్ లో మీకు నచ్చిన టీవీని ఎంపిక చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హై రేంజ్ పీపుల్ ప్రతి ఒక్కరు యాక్సెస్ చేసే విధంగా ఈ టీవీల రేంజ్ ఉన్నది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సరికొత్త ఫీచర్లతో Vivo TWS 5 సిరీస్ ఇయర బడ్స్, ధర, స్పెషికేషన్లు ఇక్కడ చూడండి
  2. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో Ricoh GR Mode అనే ప్రత్యేక మోడ్‌ను కూడా అందించారు
  3. ఫోన్ ఇవి ఫోన్ లాంచ్ సమయంలో తక్కువగా లేకుండా Xiaomi 17 వంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలదని సూచిస్తున్నాయి
  4. నోట్‌బుల్ ఎల్‌ఎంలో నానా బనానా అప్డేట్.. ఇకపై మరింత సులభతరం
  5. ఫోన్ 7,000mAh పైగా సామర్థ్యం కలిగిన బ్యాటరీతో, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది
  6. వెబ్ పేజ్ సమ్మరైజింగ్ కోసం అప్డేట్.. జెమినీలో కొత్త అప్డేట్ ఇదే
  7. ఫోన్ ఫోల్డ్ అయినప్పుడు దాని థిక్నెస్ 9.2mm, మరియు అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 4.6mm ఉంటుంది
  8. ఆపిల్ టీవీలో ‘ఎఫ్ 1 ది మూవీ’.. ఈ కొత్త ఛేంజ్ చూశారా?
  9. 3 కలర్స్‌లో అదిరిపోయే హెడ్‌ఫోన్లు, సౌండ్ బై బోస్ టెక్నాలజీ, ఆడియో రికార్డింగ్ కోసం ఐదు మైక్రోఫోన్ సెటప్ వీటి ప్రత్యేకత
  10. కెమెరా పరంగా, Nothing Phone 3aలో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »