Photo Credit: Nothing
నథింగ్ హెడ్‌ఫోన్ 1 నలుపు మరియు తెలుపు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది
ప్రముఖ టెక్ బ్రాండ్ నథింగ్, తన ఫ్లాగ్‌షిప్ డివైస్ నథింగ్ ఫోన్ 3 తో పాటు నథింగ్ హెడ్‌ఫోన్ 1 ను కూడా మంగళవారం భారత మార్కెట్లోకి అఫీషియల్ గా విడుదల చేసింది. ఈ హెడ్ ఫోన్ భారత్ తో పాటు కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో కూడా లాంచ్ అయ్యాయి. ఓవర్-ది-యర్ డిజైన్‌తో వచ్చిన ఈ హెడ్‌ఫోన్లు, యాక్టివ్ నోయిజ్ కెన్సిలేషన్ (ANC) మరియు 40mm డైనమిక్ డ్రైవర్లు కలిగి ఉన్నాయి. బ్రిటిష్ ఆడియో కంపెనీ KEF ట్యూనింగ్ చేయడంతో సౌండ్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ హెడ్‌ఫోన్లు AAC కోడెక్‌తో 80 గంటల వరకు మరియు LDAC ఆడియో ప్లేబ్యాక్ లో 54 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని నథింగ్ కంపెనీ పేర్కొంది. ఇది Android మరియు iOS రెండింటికీ సపోర్ట్ చేస్తాయి.
భారతదేశంలో నథింగ్ హెడ్‌ఫోన్ 1 ధర రూ. 21,990గా నిర్ణయించారు. జూలై 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, విజయ్ సేల్స్, మింత్రా, క్రోమా మరియు ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే...బ్లాక్ మరియు వైట్ కలర్స్ లో ఈ హెడ్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయి. స్టార్టింగ్ సేల్ ఆఫర్ కింద కస్టమర్స్ కి రూ.19,999 ధరకు లభించనున్నాయి.
నథింగ్ హెడ్‌ఫోన్ 1 ఓవర్-ఇయర్ డిజైన్‌తో వస్తాయి. వీటి బాడీ ట్రాన్స్‌పరెంట్ రెక్టాంగులర్ షేప్లో ఉండగా, మధ్యలో ఒవల్ మాడ్యూల్ కనిపించేలా డిజైన్ చేశారు. ఈ హెడ్ ఫోన్స్ 42dB వరకు ANC సపోర్ట్ చేస్తాయి, అలాగే దీనిలో ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఉంది. కాల్స్ సమయంలో సర్రౌండింగ్ నోయిస్ తగ్గించేందుకు నాలుగు మైక్రోఫోన్లతో కూడిన ఎన్విరాన్‌మెంటల్ నోయిజ్ కెన్సిలేషన్ (ENC) మోడ్ అందించారు.
కనెక్టివిటీ పరంగా చూస్తే... హెడ్‌ఫోన్ 1 లో బ్లూటూత్ 5.3, అలాగే AAC, SBC, LDAC కోడెక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్పెషల్ గా డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంది, అంటే ఒకేసారి రెండు డివైస్‌లతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి Android 5.1 లేదా iOS 13 పైగా ఉన్న డివైస్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఈ హెడ్‌ఫోన్లలో టచ్ కంట్రోల్స్ స్థానంలో టాక్టైల్ బటన్‌లు సెట్ చేశారు. ఇందులో ఉన్న రోలర్, ప్యాడిల్, బటన్ వంటి బటన్ కంట్రోల్స్ తో వాల్యూమ్ కంట్రోల్, మ్యూజిక్ చేంజ్, మరియు ANC మోడ్ మార్చుకోవచ్చు.
నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ బ్యాక్అప్ ఉంది. ఇది USB Type-C పోర్ట్ ద్వారా 120 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అదనంగా, 3.5mm ఆడియో జాక్ కూడా కలిపి ఇస్తున్నారు. అంతేకాకుండా, ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్‌లో కేవలం 5 నిమిషాల పాటు ఛార్జింగ్ పెడితే 5 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుందని నథింగ్ చెబుతోంది.
ANC ఆన్ చేసి AAC ఆడియో వినిపిస్తే 35 గంటలు, LDAC ఆడియోతో 30 గంటల పాటు బ్యాటరీ టైమ్ వస్తుంది. ANC ఆఫ్ చేసి, AAC ఆడియో వినిపిస్తే 80 గంటల వరకు, LDAC ఆడియో వినిపిస్తే 54 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్ ఫోన్స్ ప్రీమియం రేంజ్ లో రావడంతో మిడిల్ క్లాస్ పీపుల్ ఆసక్తి చూపించకపోవచ్చు.
ప్రకటన
ప్రకటన