Photo Credit: Apple
పవర్‌బీట్స్ ప్రో 2 ఎలక్ట్రిక్ ఆరెంజ్, హైపర్ పర్పుల్, జెట్ బ్లాక్ మరియు క్విక్ సాండ్ షేడ్స్‌లో వస్తుంది.
భారత్‌లో బీట్స్ Powerbeats Pro 2ని విడుదల చేసింది. ఈ ఇయర్‌ఫోన్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో రూపొందించబడ్డాయి. వీటిలో ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ల్స్‌తోపాటు డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో, వాయిస్ ఐసోలేషన్ సపోర్ట్ వంటి ఫీచర్స్‌ను అందించారు. ఈ కేస్ Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌ఫోన్‌లు కేస్‌తో 45 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇవి Apple H2 చిప్‌సెట్, హార్ట్ రేట్ మానిటర్‌తో IPX4 రేటింగ్‌ను అందిస్తున్నాయి.
మన దేశంలో ఈ Powerbeats Pro 2 ధరను రూ. 29,900గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇవి కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఫిబ్రవరి 13 నుండి ఇతర ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకానికి రానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇవి ఎలక్ట్రిక్ ఆరెంజ్, హైపర్ పర్పుల్, జెట్ బ్లాక్, క్విక్ సాండ్ వంటి నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
Powerbeats Pro 2 ఇయర్‌ఫోన్‌లు డ్యూయల్-ఎలిమెంట్ డైనమిక్ డయాఫ్రాగమ్ ట్రాన్స్‌డ్యూసర్‌లతో అమర్చబడి ఉంటాయి. ఇవి హై-క్వాలిటీ సౌండ్‌ను అందిస్తాయని ప్రచారం జరుగుతోంది. ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌తో పాటు అడాప్టివ్ EQ ఫీచర్‌లతో సహా అడాప్టివ్ ANCకి సపోర్ట్ చేస్తాయి. ఈ సెట్ డైనమిక్ హెడ్ ట్రాకింగ్ టెక్నాలజీతో స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో వస్తున్నాయి.
ప్రతి ఇయర్‌ఫోన్‌లో ప్రత్యేకమైన వాయిస్ మైక్రోఫోన్‌తో సహా మూడు మైక్‌లు ఉంటాయి. అవి ఇన్-ఇయర్ డిటెక్షన్, హార్ట్-రేట్ మానిటరింగ్ కోసం ఆప్టికల్ సెన్సార్‌లతో పాటు యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్‌తో అమర్చబడి ఉంటాయి.
ఇందులోని హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్ అథ్లెట్లు రియల్ టైంలో వారి పనితీరును ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే, రక్త ప్రవాహాన్ని కొలవడానికి సెకనుకు 100 సార్లు కంటే ఎక్కువ పల్స్ చేసే LED ఆప్టికల్ సెన్సార్‌లను ఉపయోగిస్తుందని, డేటాను తక్షణమే ఏదైనా అనుకూలమైన ఫిట్‌నెస్ యాప్‌లతో పంచుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. మన దేశంలోని రన్నా, నైక్ రన్ క్లబ్, ఓపెన్, లాడర్, స్లోప్స్, యావోయావో వంటి యాప్‌లతో పని చేస్తుంది.
ఇయర్‌ఫోన్‌లు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో ఆపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు సీమ్‌లెస్ పెయిర్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఆపిల్ డివైజెస్‌లో, వన్-టచ్ పెయిరింగ్ చేయడం, ఆటోమేటిక్ స్విచింగ్, ఆడియో షేరింగ్, హ్యాండ్స్-ఫ్రీ సిరి, ఫైండ్ మైకి సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ వినియోగదారులు బీట్స్ యాప్ ద్వారా ఈ ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు ఇయర్‌బడ్‌లలో అందుబాటులో ఉన్న ఆన్-ఇయర్ బటన్స్, టాక్టిబుల్ వాల్యూమ్ రాకర్‌తో మ్యూజిక్‌ను కంట్రోల్ చేయవచ్చు. బీట్స్ XS నుండి XL వరకు బాక్స్‌లో ఐదు ఇయర్ టిప్‌లను అందిస్తుంది. ప్రతి ఇయర్‌ఫోన్ బరువు 8.7 గ్రాములు కాగా, కేస్ బరువు 69 గ్రాములు ఉంది.
ప్రకటన
ప్రకటన