మార్కెట్లోకి సరికొత్త Vu Glo QLED TV స్మార్ట్ టీవీలు లాంఛ్ అయ్యాయి. అధునాతమైన ఫీచర్లతో పాటు బడ్జెట్ ధరకే వివిధ సైజుల్లో టీవీలు సేల్స్ ప్రారంభమయ్యాయి.
Photo Credit: Vu
కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి టీవీలో ఇన్‌స్టంట్ నెట్‌వర్క్ రిమోట్ ఉందని Vu చెబుతోంది
మీ ఇంట్లో కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసం మంచి మంచి ఫీచర్స్‌తో ఉన్న సరికొత్త స్మార్ట్ టీవీ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ టీవీ తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంది. Vu Glo QLED TV 2025 (డాల్బీ ఎడిషన్) మంగళవారం భారతదేశంలో ఆవిష్కరించడం జరిగింది. ఇది 43 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు ఐదు సైజులలో లభిస్తుంది. QLED TV Google TV ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. 2GB RAMతో జత చేయబడిన VuOn AI ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. కంపెనీ ప్రకారం ఇది దృశ్య మెరుగుదల కోసం డాల్బీ విజన్, HDR10, HLG టెక్నాలజీలను కలిగి ఉంది. అయితే ఆడియో కోసం డాల్బీ అట్మోస్ మద్దతు ఉంది.
భారతదేశంలో Vu Glo QLED TV 2025 (డాల్బీ ఎడిషన్) వివిధ సైజుల్లో పొందవచ్చు. సైజ్‌ను బట్టి ధర ఆధారపడి ఉంటుంది. వినియోగదారులు తమ బడ్జెట్‌కు తగట్టు తమకు నచ్చిన టీవీని కొనుక్కోవచ్చు. ఈ టీవీ ధర 43 అంగుళాల మోడల్‌కు రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టీవీలు 50 అంగుళాలలు, 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు వరసగా రూ.30,990, రూ. 35,990, రూ. 50,990లు. వీటితో పాటు 75 అంగుళాల పెద్ద టీవీ కూడా రూ.64,9990లకు పొందవచ్చు.
ఈ Vu Glo QLED టీవీ 4K (3,840 x 2,160 పిక్సెల్స్) QLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇది డాల్బీ విజన్, HDR10, HLG టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తుంది. A+ గ్రేడ్ ప్యానెల్ 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 92 శాతం NTSC కలర్ గామట్ కవరేజీని కలిగి ఉంటుంది.
ఈ టీవీ గూగుల్ టీవీ OSపై రన్ అవుతుంది. దీని వల్ల వినియోగదారులు టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, స్పాటిఫై వంటి యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ అసిస్టెంట్, బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ వంటి ఫీచర్‌లను కూడా ప్రారంభిస్తుంది. ఇది వరసగా వాయిస్ కంట్రోల్, కంటెంట్ కాస్టింగ్‌ను అనుమతిస్తుంది. ముఖ్యంగా Vu స్పెషల్ Wi-Fi హాట్ కీతో ఇన్‌స్టంట్ నెట్‌వర్క్ రిమోట్‌ను వినియోగదారులకు అందిస్తోంది.
ఈ మేరకు Vu Glo QLED టీవీలో ఇన్‌స్టంట్ నెట్‌వర్క్ రిమోట్ ఉందని కంపెనీ వెల్లడించింది. కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి Wi-Fi హాట్ కీ ఉంది. అలాగే వినియోగదారులు వినియోగించే కంటెంట్‌ను బట్టి ప్రత్యేకమైన క్రికెట్ మోడ్, సినిమా మోడ్‌ను కూడా ఉపయోగించవచ్చు.
Vu సంస్థ గ్లో QLED టీవీలో 1.5GHz క్లాక్ స్పీడ్‌తో VuOn AI ప్రాసెసర్‌ను అమర్చినట్టు తెలిపింది. ఇది 2GB RAM, 16GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడింది. ఆడియో కోసం, అంతర్నిర్మిత 24W డాల్బీ అట్మాస్ సిస్టమ్ ఉంది. గ్లో QLED టీవీలో గేమింగ్ కోసం అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR), ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM), ఫస్ట్-పర్సన్ షూటర్ (FPS) గేమ్‌లను ఆడుతున్నప్పుడు కచ్చితమైన లక్ష్యం కోసం క్రాస్-హెయిర్ ఫంక్షన్ కూడా ఉన్నాయి.
ఈ Vu Glo QLED టీవీలు వివిధ సైజుల్లో ఆగస్ట్ 12, 2025 నుంచి సేల్స్‌కు పెట్టడం జరిగింది. ఈ టీవీలో ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్, భారత్ అంతటా రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంది. ఈ టీవీలకు ఒక ఏడాది వారంటీ కూడీ లభిస్తుంది.
ప్రకటన
ప్రకటన