చైనా అరుదైన ఘ‌న‌త‌.. చ‌ంద్రునిపై ఉన్న మట్టి నుంచి నీటిని ఉత్ప‌త్తి చేశారు!

చాంగే-5 మిష‌న్‌లో చైనా తీసుకువచ్చిన చంద్రుని మట్టిని ఉపయోగించి పెద్ద మొత్తంలో నీటిని ఉత్పత్తి చేసే బ్రాండ్-న్యూ మెత‌డ్‌ని కనుగొన్నట్లు స్టేట్‌ బ్రాడ్‌కాస్టర్ CCTV వెల్ల‌డించింది.

చైనా అరుదైన ఘ‌న‌త‌.. చ‌ంద్రునిపై ఉన్న మట్టి నుంచి నీటిని ఉత్ప‌త్తి చేశారు!
ముఖ్యాంశాలు
  • చాంగే-5 మిష‌న్‌లో తీసుకువ‌చ్చిన చంద్రుని మ‌ట్టి నుంచి నీటిని ఉత్ప‌త్తి చే
  • చంద్రునిపై అధిక వ‌నరులున్న ప్ర‌దేశాల‌పై బీజింగ్ ఆధిపత్యం చెలాయించే అవకాశం
  • ఒక మెట్రిక్ టన్ను చంద్రుని మ‌ట్టి సుమారు 51 నుండి 76 కిలోగ్రాముల నీటి ఉత్
ప్రకటన

చైనా శాస్త్రవేత్తలు ఓ స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌కు తెర‌లేపి.. ప్రంచంచ దేశాల‌ చూపును త‌మవైపు తిప్పుకునేలా చేశారు. 2020వ సంవ‌త్స‌రంలో చంద్ర‌మండ‌ల‌ యాత్ర నుండి తిరిగి తీసుకువచ్చిన చంద్రుని మట్టిని ఉపయోగించి పెద్ద మొత్తంలో నీటిని ఉత్పత్తి చేసే బ్రాండ్-న్యూ మెత‌డ్‌ని కనుగొన్నట్లు స్టేట్‌ బ్రాడ్‌కాస్టర్ CCTV వెల్ల‌డించింది. చంద్రునిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయనే విష‌యాన్ని గ‌తంలోనే చైనా శాస్త్రవేత్తలు స్ప‌ష్టం చేశారు. చాంగే-5 మిష‌న్‌ సహాయంతో జాబిల్లి నుంచి భూమికి తీసుకొచ్చిన మట్టిని గత నాలుగేళ్ల నుంచి పరిశోధించిన అక్క‌డి సైంటిస్టులు ఆ మ‌ట్టి నుంచి నీటిని ఉత్ప‌త్తి చేశారు. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు చంద్రుని నేలలో హైడ్రాజ‌న్‌ ఖనిజాలు పెద్ద మొత్తంలో ఉన్నాయ‌ని క‌నుగొన్నారు. ఇది ఎక్కువ ఉష్ణోగ్రతలలో వేడి చేసినప్పుడు ఇతర మూలకాలతో చర్య జరిగి నీటి ఆవిరిని ఉత్పత్తి చేస్తుందని CCTV తెలిపింది.

CCTV తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మూడు సంవత్సరాల సుధీర్ఘ‌ పరిశోధనల‌తోపాటు ప‌లు ద‌ఫాలుగా చేసిన ప‌రీక్ష‌ల‌ల్లో వ‌చ్చిన‌ ఫ‌లితాల ఆధారంగా చంద్రుని మ‌ట్టిని ఉప‌యోగించి పెద్ద మొత్తంలో నీటిని ఉత్పత్తి చేయడానికి సరికొత్త పద్ధతి కనుగొనబడింది. ఇది భవిష్యత్తులో చంద్రునిపై పరిశోధనా కేంద్రాతోపాటు స్పెష్ స్టేష‌న్‌ నిర్మాణ స్థ‌లాల‌కు సంబంధించిన ముఖ్య‌మైన డిజైన్‌ల‌ను అందిస్తుంది అని తెలిపింది. చంద్రునిపైన ఉన్న గ‌నుల‌ను, వనరులను కనుగొనేందుకు చేసే ప‌రిశోధ‌న‌ల కోసం అక్క‌డ‌ శాశ్వత అవుట్‌పోస్ట్‌ను నిర్మించాల‌నే చైనా దేశ‌పు దశాబ్దాల క‌ల‌కు ఈ ప్రాజెక్ట్‌ ఈ ఆవిష్కరణ కీల‌క‌మైన ముంద‌డుగుగా భావించ‌వ‌చ్చు.

దక్షిణ ధ్రువంపై బేష్ స్టేష‌న్

అంతరిక్ష ప్ర‌యోగాల‌లో చైనా వేగవంతమైన పురోగతి సాధించ‌డంతోపాటు చంద్రునిపై అధిక వ‌నరులున్న ప్ర‌దేశాల‌పై బీజింగ్ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంద‌నేందుకు ఇది ఒక సంకేతంగా NASA హెడ్ బిల్ నెల్సన్ అభివ‌ర్ణించారు. చైనా ఉపయోగించిన ఈ కొత్త పద్ధతి ద్వారా ఒక మెట్రిక్ టన్ను చంద్రుని మ‌ట్టి సుమారు 51 నుండి 76 కిలోగ్రాముల నీటిని ఉత్పత్తి చేయగలదు. ఇది వంద కంటే ఎక్కువ 500-మిల్లీలీటర్ల వాట‌ర్ బాటిళ్ల‌తో లేదా 50 మంది రోజువారీ త్రాగునీటి వినియోగంతో స‌మాన‌మ‌ని స్టేట్ బ్రాడ్‌కాస్ట్ తెలిపింది. ప్ర‌స్త‌త అవ‌సరాల‌తోపాటు భవిష్యత్తులో చంద్రునిపైకి చేరుకునే అంతర్జాతీయ చంద్ర పరిశోధనా కేంద్రాన్ని (ILRS) నిర్మించడానికి ఇది నాంధిగా చైనా భావిస్తోంది. ఇది రష్యాతో సంయుక్తంగా ఏర్పాటుకు స‌న్నాహాలు చేస్తోంది. 2035 నాటికి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై బేష్ స్టేష‌న్ నిర్మించబడుతుంద‌ని చైనా గ‌ట్టి విశ్వాసంతో ఉంది. అలాగే, 2045 నాటికి చంద్రుని చుట్టూ తిరిగే అంతరిక్ష కేంద్రం దీని నుంచి రూపుదిద్దుకోనున్నట్లు అంచ‌నా వేస్తోంది.

ఇత‌ర అంతరిక్ష ప‌రిశోధ‌న‌ల‌కు

ఇప్ప‌టికే చైనా శాస్త్రవేత్తలు చాంగ్-6 మిషన్ ద్వారా తీసుకువచ్చిన చంద్రుని నమూనాలపై ప్రయోగాలు చేస్తున్న సమయంలో జూన్‌లో ఈ ఆవిష్కరణను బ‌హిర్గ‌తం చేసింది. చాంగే-5 మిషన్ చంద్రునిపై ఉన్న ఒక్క చోట నుండి నమూనాలను సేక‌రించ‌గా, చాంగే-6 మిష‌న్ ద్వారా చంద్రునిపైన అనేక చోట్ల తిరిగి మ‌ట్టిని సేక‌రించింది. ఇది భూమి నుంచి ఊహించ‌ని దూరం నుంచి సేక‌రించిన‌ట్లు అవుతంది. NASA నెల్సన్ మేలో NPRతో మాట్లాడుతూ.. చంద్రునిపై ల‌భించే నీటిని హైడ్రోజన్ రాకెట్ ఇంధనాన్ని సృష్టించేందుకు ఉపయోగించవచ్చని, ఇది భ‌విష్య‌త్తులో అంగాక‌ర గ్ర‌హంతోపాటు ఇత‌ర‌ అంతరిక్ష ప‌రిశోధ‌న‌ల‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS)కు సంబంధించిన నింగ్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (NIMTE)లో ప్రొఫెసర్ WANG జున్కియాంగ్ ఈ ప్రయోగానికి హెడ్‌గా వ్య‌వ‌హ‌రించారు. మ‌రి చంద్రునిపై చైనా ఇంకెలాంటి ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తుందో చూడాలి.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మార్కెట్లోకి రానున్న Realme GT 8 Pro.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే
  2. రియల్‌మీ ఈ సిరీస్‌ను తొలిసారిగా అక్టోబర్ 21న చైనాలో ఆవిష్కరించింది
  3. ఐకూ 15 మోడల్ వివరాలు లీక్.. ఈ ప్రత్యేకతలు తెలుసుకున్నారా?
  4. ఈ రెండు ఫోన్లు నవంబర్ 3 నుంచి యూరప్‌లో విక్రయానికి వస్తాయి. Vivo అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు
  5. iQOO Neo 11 ధర చైనాలో CNY 2,599 (దాదాపు రూ. 32,500) నుంచి ప్రారంభమవుతోంది
  6. భారత వినియోగదారులు OnePlus 15 లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
  7. మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కె సెలెక్ట్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్
  8. అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3ఏ లైట్.. ఇంకా ఇతర విషయాలు తెలుసుకోండి
  9. ఈ ఫోన్‌లో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ అమర్చబడింది.
  10. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఛార్జ్‌పై ఇయర్‌బడ్స్ 11 గంటల వరకు పనిచేస్తాయి.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »