అదిరిపోయే ఆఫర్లు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ ఎప్పటి నుంచంటే

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9, షియోమీ Pad 7, ఆపిల్ ఐప్యాడ్ 11 వంటి వాటిపై భారీ తగ్గింపుతో అందుబాటులోకి రానున్నాయి. అంతే కాకుండా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై ప్రత్యేకమైన తగ్గింపు కూడా రానుంది.

అదిరిపోయే ఆఫర్లు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ ఎప్పటి నుంచంటే

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025: ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైన 24 గంటల ముందస్తు యాక్సెస్ లభిస్తుంది

ముఖ్యాంశాలు
  • సెప్టెంబర్ 23న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
  • వన్ ప్లస్, ఐపాడ్, షియోమీ ఫోన్లపై అదిరే ఆఫర్లు
  • క్రెడిట్, డెబిట్ కార్డులపై భారీ తగ్గింపు
ప్రకటన

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025పై ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వినియోగదారులంతా కూడా భారీ డిస్కౌంట్లు లభిస్తుండటంతో ఈ సేల్ గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో సెప్టెంబర్ 23న ఈ గ్రేట్ సేల్ ప్రారంభం కానుంది. ప్రముఖ బ్రాండ్ల నుండి స్మార్ట్‌ఫోన్‌లు, మొబైల్ యాక్సెసరీస్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఆడియో పరికరాలతో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపుని ప్రకటించారు. రాబోయే సేల్‌లో రకరకాల మోడల్ ఫోన్లన్నీ కూడా సరసమైన ధరలకు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అయితే ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 22 నుండి ప్రారంభ సేల్‌‌ను ఉపయోగించుకోవచ్చు. 24 గంటల ముందస్తు యాక్సెస్‌ను పొందుతున్నందున ప్రైమ్ సభ్యులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ప్రసిద్ధ టాబ్లెట్‌లపై కొన్ని ముందస్తు డీల్‌లను అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభ డీల్‌లలో భాగంగా, వన్‌ప్లస్ ప్యాడ్ 3, శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9, ఆపిల్ ఐప్యాడ్ 11 వంటి మోడళ్లు తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి.

సేల్ ఈవెంట్‌కు ముందు సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 అమెజాన్‌లో రూ. 35,999కి అందుబాటులో ఉంది. దాని అసలు ధర రూ. 81,999 కాగా.. ఈ సేల్‌లో గణనీయమైన తగ్గింపుతో అందుబాటులోకి రానుంది. షియోమీ Pad 7 కూడా అసలు ధర రూ. 39,999 నుండి రూ. 30,999కి తగ్గింపుతో రానుంది. ఇంతలో A16 చిప్‌తో కూడిన ఆపిల్ ఐప్యాడ్ 11 కూడా ఈ అమ్మకంలో భాగం కానుంది. ఐప్యాడ్ ఎయిర్ 3 ధర రూ. 59,900 కు బదులుగా రూ. 50,000 కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన ధర ఇంకా వెల్లడించలేదు.

SBI క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపుతో పాటు Amazon Pay ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్‌తో కస్టమర్‌లు మరింత లాభపడొచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కూడా ప్రత్యేక తగ్గింపుని పొందగలరు. అంతే కాకంుడా కొనుగోలుదారులు తమ పాత టాబ్లెట్‌లను ట్రేడింగ్ చేయడం ద్వారా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఫెస్టివల్ సేల్‌లో అదిరే ఆఫర్లు.. సెక్యూరిటీ కెమెరాల ధర ఎంతంటే
  2. ఈ ఇప్పుడు మార్కెట్‌లో వాషింగ్ మెషీన్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి
  3. ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరను కంపెనీ రూ. 94,900కి తగ్గించింది.
  4. త్వరలో రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్, ఈ మొబైల్లో అదిరిపోయే కొత్త ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు
  5. అమెజాన్ సేల్లో 2025 అదిరిపోయే డీల్స్, విద్యార్థులకు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు
  6. ఈ కేటగిరీలో ఉత్తమ డీల్‌గా లెనోవో V15 G4 ల్యాప్‌టాప్‌ చెప్పుకోవచ్చు
  7. క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, వడ్డీ లేని EMI ఆప్షన్లు కూడా లభిస్తున్నాయి.
  8. ఫెస్టివల్ సేల్‌లో 2 ఇన్ 1 ల్యాప్‌టాప్‌లపై అదిరే ఆఫర్లు.. ఏ ఏ మోడల్ ఎంతకు వస్తుందంటే?
  9. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో హోమ్ అప్లయన్సెస్‌పై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.
  10. ఈ సేల్‌లో లభించే ఆఫర్లతో మీ కొనుగోలు మరింత లాభదాయకంగా మారుతుంది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »