Photo Credit: Infinix
దేశీయ మార్కెట్‌లోకి Infinix Xpad లాంచ్ అయింది. మన భారతదేశంలో Infinix కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ట్యాబ్ ఇది. ఈ Infinix Xpad 11-అంగుళాల ఫుల్-HD+ స్క్రీన్, 8-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, క్వాడ్ స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది Wi-Fi అలాగే 4G LTE కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తూ.. ఆండ్రాయిడ్ 14-ఆధారిత XOS 14తో పనిచేస్తుంది. కొత్తగా లాంచ్ అయిన ఈ ట్యాబ్ 8GB వరకు RAMతో 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio G99 ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాదు, ఈ ట్యాబ్ నెలాఖరులో దేశీయ మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. నిజానికి Infinix Xpad గత నెలలోనే గ్లోబల్ మార్కెట్‌లో విడుదల అయింది. ఇప్పుడు తాజాగా మన దేశంలో దీనిని లాంచ్ చేశారు.
భారతదేశంలో Infinix Xpad 4GB + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 10,999గా నిర్ణియించారు. ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీని అమ్మకాలు జరగనున్నాయి. ఇది సెప్టెంబర్ 26న మధ్యాహ్నం 12 గంటల నుంచి మన దేశంలో విక్రయించబడుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ ట్యాబ్ ఫ్రాస్ట్ బ్లూ, స్టెల్లార్ గ్రే, టైటాన్ గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఇక మన దేశంలో Infinix సంస్థ నుంచి వస్తోన్న మొదటి ట్యాబ్ కావడంతో ఈ మోడల్‌పై కొనుగోలుదారులలోనూ ఆసక్తి కనిపిస్తోంది.
Infinix Xpad 11-అంగుళాల ఫుల్-HD+ (1,200 x 1,920 పిక్సెల్‌లు) IPS LCD స్క్రీన్‌తో 90Hz వరకు రిఫ్రెష్ రేట్, 180Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ 6nm ఆక్టా-కోర్ MediaTek Helio G99 ప్రాసెసర్‌తో ARM Mali G57 MC2 GPUతో జత చేయబడింది. ఇది 4GB, 8GB LPDDR4X RAMతో పాటు 128GB, 256GB EMMC స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తోంది. ఈ మోడల్ ట్యాబ్‌లో మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత XOS 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.
Infinix Xpad కెమెరా విషయానికి వస్తే.. LED ఫ్లాష్‌తో పాటు 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది ఫ్లాష్ యూనిట్‌తో పాటు 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో రూపొందించారు. ఈ ట్యాబ్‌లో క్వాడ్-స్పీకర్ యూనిట్ అమర్చబడింది. ట్యాబ్ ఫోలాక్స్ అనే ChatGPT-సపోర్ట్ గల వాయిస్ అసిస్టెంట్‌కు మద్దతుతో అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే, USB టైప్-C పోర్ట్ ద్వారా 18W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. కనెక్టివిటీ విషయంలో 4G LTE, Wi-FI, బ్లూటూత్, OTG, 3.5mm ఆడియో జాక్‌ను అందించారు. 257.04 x 168.62 x 7.58mm పరిమాణంతో 496 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన