iQOO Pad 5e టాబ్లెట్‌లో Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగించగా, 12.1 ఇంచుల 2.8K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్‌రేట్ గల డిస్‌ప్లేతో వస్తుంది.
Photo Credit: iQOO
iQOO వాచ్ GT 2 2.07-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది
iQOO 15, Pad 5e, Watch GT 2, మరియు TWS 5 ఉత్పత్తులు అక్టోబర్ 20న చైనాలో లాంచ్ కానున్నాయి. Vivoకి చెందిన iQOO ఈ లాంచ్ ఈవెంట్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15తో పాటు మరో మూడు ఉత్పత్తులను కూడా పరిచయం చేయనుంది. కంపెనీ ఇప్పటికే వీటి కోసం ప్రీ-ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభించింది.iQOO Pad 5e టాబ్లెట్‌లో Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగించగా, 12.1 ఇంచుల 2.8K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్‌రేట్ గల డిస్‌ప్లేతో వస్తుంది. 10,000mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఇందులో ఉంది. ఈ టాబ్లెట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది, వెనుక భాగంలో గుండ్రంగా ఉండే కెమెరా మాడ్యూల్‌తో ప్రత్యేకమైన లుక్ కలిగి ఉంటుంది.
iQOO Watch GT 2 స్మార్ట్‌వాచ్‌లో 2.07 ఇంచుల డిస్‌ప్లే ఉండగా, ఇది BlueOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. గేమింగ్ కోసం ప్రత్యేక మోడ్ అందించడంతో పాటు, ఒకసారి చార్జ్ చేస్తే 33 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది.
ఇక iQOO TWS 5 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ 60dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌తో వస్తాయి. గేమింగ్ కోసం 42ms తక్కువ లేటెన్సీ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది.
ఈవెంట్ ప్రధాన ఆకర్షణ iQOO 15 స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. ఇది తాజా Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌పై నడుస్తుంది. 6.85 ఇంచుల 2K 8T LTPO సామ్‌సంగ్ "Everest" డిస్‌ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్‌రేట్ కలిగి ఉంటుంది. అదనంగా, iQOO యొక్క Q3 గేమింగ్ చిప్‌సెట్ కూడా ఇందులో ఉండనుంది.
ఈ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 20న సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30కు) ప్రారంభమవుతుంది. మొత్తం చూస్తే, iQOO ఈసారి స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ వంటి విభిన్న ఉత్పత్తులతో మార్కెట్లో కొత్త ఊపును తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇండియన్ మార్కెట్ లోకి వచ్చాక మిగతా బ్రాండ్స్ కి కాంపిటీషన్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.
ప్రకటన
ప్రకటన