Poco కంపెనీ దేశీయ మార్కెట్‌లోకి Poco Pad 5Gను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. అలాగే, ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ OSతో రన్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతోపాటు క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌తో రూపొందించబడింది. దీంతోపాటు 12.1-అంగుళాల LCD స్క్రీన్‌తో ఈ ట్యాబ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో వస్తుంది. Poco Pad 5G ట్యాబ్ 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. IP52-రేటెడ్ ట్యాబ్ Poco స్మార్ట్ పెన్, Poco కీబోర్డ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని Poco స్పష్టం చేసింది.
ఇక ధర విషయానికి వస్తే.. మనదేశంలో Poco Pad 5G 8GB + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 23,999గా కంపెనీ నిర్ణయింది. అలాగే, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 25,999గా ఉంది. ఈ ట్యాబ్ కోబాల్ట్ బ్లూ, పిస్తా గ్రీన్ రంగుల ఎంపికలో అందుబాటు ఉంటుంది. Poco Pad 5G మొదటి సేల్ ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగస్ట్ 27న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే, SBI, HDFC, ICICI బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు రూ. 3,000 వరకూ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. అంతేకాదు Poco కంపెనీ విద్యార్థుల కోసం ఓ స్పెషల్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. విద్యార్థులు అదనంగా రూ. 1,000 వరకూ డిస్కౌంట్‌ను పొందొచ్చు. అయితే, ఈ ఆఫర్‌లు సేల్ ప్రారంభమైన మొదటి రోజు మాత్రమే ఉంటుంది.
ఈ Poco Pad 5G మోడల్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 12.1-అంగుళాల 2K (2,560 x 1,600 పిక్సెల్‌లు) LCD స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది 16:10 యాస్పెక్ట్ రేషియోతోపాటు 600 నిట్స్ గరిష్ట బ్రయిట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే TÜV రైన్‌ల్యాండ్ ట్రిపుల్ సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో రూపొందించబడింది.ఈ ట్యాబ్ 8GB LPDDR4X RAM, UFS 2.2 ఆన్‌బోర్డ్ 256GB వరకు స్టోరేజ్‌తో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ జత చేయబడింది. Poco Pad 5Gలో మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1.5TB వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్‌ఓఎస్‌తో రన్ చేయబడుతుంది.
ప్రత్యేకమైన కెమెరా యూనిట్...
అలాగే, Poco Pad 5G మోడల్‌లో ప్రత్యేకంగా కెమెరా విభాగం గురించి చెప్పుకోవాలి. కొత్తగా ప్రారంభించిన Poco Pad 5G 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా యూనిట్‌తో పాటు LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ముందు కెమెరా, కుడి వైపున అర్చడంతోపాటు మరొక 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. Poco Pad 5G దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP52-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఇది క్వాడ్-స్పీకర్ సిస్టమ్, రెండు మైక్రోఫోన్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ట్యాబ్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో కూడా వస్తుండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ట్యాబ్‌లో 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,000mAh బ్యాటరీని అందించారు. డ్యూయల్ 5G, Wi-Fi 6, GPS, బ్లూటూత్ 5.2తో పాటు USB టైప్-C పోర్ట్ అందుబాటులో ఉంటుంది. Poco Pad 5G పరిమాణం విషయానికి వస్తే.. 280.0 x 181.85 x 7.52mmతో 568 గ్రాముల బరువు ఉంటుంది. మరి.. ఆగస్టు 27న సిద్ధంగా ఉండండి.
ప్రకటన
ప్రకటన