BSNL వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్-టు-డివైస్ శాటిలైట్ కనెక్టివిటీని DoT ప్రకటించింది

దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వినియోగదారులకు కూడా సీమ్‌లెస్‌ కనెక్టివిటీని అందించడమే డైరెక్ట్-టు-డివైస్ శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్‌ లక్ష్యంగా ఉంది.

BSNL వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్-టు-డివైస్ శాటిలైట్ కనెక్టివిటీని DoT ప్రకటించింది

Photo Credit: BSNL

సేవ యాడ్-ఆన్‌గా అందించబడుతుందా లేదా ఇప్పటికే ఉన్న ప్లాన్‌లతో బండిల్ చేయబడుతుందా అనేది అస్పష్టంగా ఉంది

ముఖ్యాంశాలు
  • శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ Viasatతో క‌లిసి డెవ‌ల‌ప్‌ చేయబడింది
  • ఈ BSNL కొత్త స‌ర్వీస్‌ మొదటగా IMC 2024లో ఆవిష్కరించబడింది
  • BSNL అక్టోబర్‌లో ఈ స‌ర్వీస్‌ను పరీక్షించడం ప్రారంభించింది
ప్రకటన

ప్రభుత్వ రంగ‌ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) డైరెక్ట్-టు-డివైస్ శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇండియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఈ ప్ర‌యోగాన్ని భారతీయ‌ మొదటి శాటిలైట్ టు డివైస్ స‌ర్వీస్‌గా ప్రకటించింది. కాలిఫోర్నియాకు చెందిన కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీ Viasatతో సంయుక్తంగా భారతీయ టెలికాం ఈ సాంకేతికతను డెవ‌ల‌ప్ చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వినియోగదారులకు కూడా సీమ్‌లెస్‌ కనెక్టివిటీని అందించడమే దీని లక్ష్యంగా ఉంది. BSNL మొదటిసారిగా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024లో ఈ స‌ర్వీసును ఆవిష్కరించింది. అలాగే, దాని సామర్థ్యాన్ని పరీక్షించడం ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించింది.

సాధారణ వినియోగదారుల కోసం..

DoT ఇండియా అధికారిక హ్యాండిల్ ఈ కొత్త సేవను ప్రారంభించినట్లు X లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. నిజానికి, శాటిలైట్ కనెక్టివిటీ అనేది కొత్త టెక్నాలజీ ఏమీ కాదు. ఆపిల్ మొదటగా ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో దీనిని ప‌రిచ‌యం చేసింది. అయితే, భారతదేశంలోని సాధారణ వినియోగదారులకు ఈ శాటిలైట్‌ కమ్యూనికేషన్ ఇప్ప‌టి వ‌ర‌కూ అందుబాటులో లేదు. అంతేకాదు, ఇప్పటివరకు అత్యవసర, సైనిక సేవ‌లు, ఇతర అనుబంధ సేవల కోసం దీనిని రిజర్వ్ చేశారు.

నెట్‌వర్క్ లేదా వై-ఫై కనెక్టివిటీ లేక‌పోయినా..

తాజా ప్ర‌క‌ట‌న‌తో BSNL వినియోగదారులందరికీ డైరెక్ట్-టు-డివైస్‌తో స‌ర్వీసుల‌ను అందిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న‌ప్ప‌టికీ కనెక్ట్ అయ్యేలా ఇది ప‌ని చేస్తుంది. ఉదాహరణకు, ఈ శాటిలైట్‌ కనెక్టివిటీ సేవ స్పితి వ్యాలీలోని చంద్రతాల్ సరస్సుకి ట్రెక్కింగ్ వెళ్లేవారికైనా లేదా రాజస్థాన్‌లోని మారుమూల గ్రామంలో నివసించే వినియోగదారులు వారి శ్రేయోభిలాషుల‌తో కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. సెల్యులార్ నెట్‌వర్క్ లేదా వై-ఫై కనెక్టివిటీ సౌక‌ర్యం లేనప్పుడు కూడా ఎమర్జెన్సీ కాల్స్ చేసేందుకు వినియోగ‌దారుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని BSNL చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో SoS మెసేజ్ పంపొచ్చు. అలాగే, UPI చెల్లింపులను కూడా చేసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో కాల్స్‌, SMSల‌కు సంబంధించిన అంశాల గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ఆ విష‌యాల‌పై స్ప‌ష్ట‌త లేదు..

ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి బీఎస్ఎన్ఎల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Viasat.. నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ (NTN) కనెక్టివిటీ కోసం ఈ స‌ర్వీస్ టూ-వే కమ్యూనికేషన్‌ను ప్రారంభిస్తుందని గత నెలలో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. IMC 2024లో జరిగిన ప్రదర్శనలో టెక్ దిగ్గజం తన జియోస్టేషనరీ L-బ్యాండ్ శాటిలైట్‌ల‌లో ఒకదానికి 36,000 కి.మీ దూరంలో సందేశాలను పంప‌డంతోపాటు రిసీవ్ చేసుకున్న‌ట్లు తెలిపింది. అక్టోబర్‌లో ట్రయల్స్‌ను ప్రారంభించన BSNL, Viasatలు, ఒక నెలలో ఈ స‌ర్వీసును వినియోగదారులకు ప‌రిచ‌యం చేశాయి. అయితే, ఈ ప్ర‌క్రియ‌లో చాలా సందేహాలపై పూర్తి క్లారిటీ రాలేదు. ఈ స‌ర్వీస్‌ యాక్సెస్‌ని పొందేందుకు ఏం చేయాల‌నేదానిపై స్ప‌ష్ట‌త‌లేదు. వినియోగదారుల ప్రస్తుత ప్లాన్‌లలోకి ఈ ఫీచర్‌ని జోడిస్తారా? లేదా దీని కోసం ప్రత్యేక ప్లాన్‌లను కొనుగోలు చేయాలా అనే విష‌యంపై కూడా ఖచ్చితమైన స‌మాచారం లేదు.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »