ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఆటోమేటిక్ ఫీడ్ రిఫ్రెషింగ్ సమస్యకు చెక్
ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లతో యూజర్‌లను ఆకట్టుకుంటోంది. తాజాగా.. చాలా రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు ఇబ్బందికరంగా మారిన ఫీచర్‌ను తొలిగించేందుకు కంపెనీ సన్నద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ హెడ్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. అంతేకాదు, ఇప్పటి నుండి యాప్ నుంచి బయటకు వచ్చిన కొద్ది సమయం తర్వాత మళ్లీ యాప్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫీడ్ ఆటోమిటిక్‌గా రిఫ్రెష్ అవ్వదు. దీంతో వినియోగదారు వారి స్క్రీన్‌పై మొదట కనిపించే పోస్ట్‌లను చూడగలుగుతారు. అయితే, ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు వీక్షించిన వీడియోల కోసం వరుస క్రమంలో రిజర్వ్ చేస్తూ, ఎక్కువ వీక్షణలను పొందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, రీల్స్ క్వాలిటీని ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తుందని కంపెనీ ధృవీకరించిన తర్వాత ఈ డెవలప్‌మెట్ అమల్లోకి వచ్చింది