అక్టోబర్ 4న దేశీయ మార్కెట్‌లోకి Lava Agni 3 5G లాంచింగ్
అక్టోబర్ మొదటి వారంలో దేశీయ మార్కెట్‌లోకి Lava Agni 3 5G అడుగుపెట్టనున్నట్లు X (గతంలో ట్విట్టర్) వేదికగా కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ 5G ఫోన్‌కు సంబంధించిన డిజైన్, కెమెరా వివరాలను అధికారిక టీజర్లు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం విడుదలైన Lava Agni 2 5G మాదిరిగానే ఈ కొత్త మోడల్ కూడా ఫీచర్స్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. Lava నుంచి రాబోయే Agni 3 స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా సెటప్‌తో ఆకర్షణీయమైన రెండు రంగులలో రానుంది. ఇది అమెజాన్ ద్వారా విక్రయించబడుతుందని కంపెనీ ధృవీకరించింది