నేటి టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగంతోపాటు వాటి అనుబంధ ఉత్పత్తుల వినియోగం కూడా అనివార్యంగా మారిపోయింది. అందులో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నవి ఇయర్ ఫోన్స్. ఇవి మొబైల్‌తో సమానంగా వినియోగించాల్సి వస్తోంది. అయితే, ఇయర్‌ఫోన్‌లకు ఎక్కువ సమయం వాడేందుకు ఎక్కువ సమయం ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కానీ, వాటికి నిరంతరం ఛార్జింగ్ చేయడం అనేది మన బిజీ లైఫ్‌లో ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను అదిగమించేందుకు ఇయర్‌ఫోన్‌లను తయారు చేసే కంపెనీ boAt సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. పాత డిజైన్‌కు మరింత సాంకేతికతను జోడించి boAt Airdopes ProGearను వినియోగదారులకు పరిచయం చేసింది. మరెందుకు ఆలస్యం.. ఈ కొత్త బడ్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం పదండి!
boAt Airdopes ProGear పేరుతో boAt కంపెనీ మొట్టమొదటి ఓపెన్-ఇయర్ వేరబుల్ స్టీరియో (OWS) ఇయర్‌ఫోన్స్‌ను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. OWS ఎయిర్‌డోప్‌లు Quad Mic AI ENx సాంకేతికతతో తయారు చేయబడ్డాయి. ఇవి నాలుగు మైక్రోఫోన్‌లతో అమర్చబడి ఉండడంతోపాటు AI సహాయంతో బయట శబ్దాలను సమర్థవంతంగా నిరోదించగలుగుతాయి. మెరుగైన ఆడియో నాణ్యత కోసం 15mm డ్రైవర్లతో రూపొందించారు. అంతేకాదు, ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ బడ్‌లు ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. boAt Airdopes ProGear వ్యాయామంతోపాటు బహిరంగ కార్యకలాపాలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది నీరు చిమ్మడం వల్లకానీ చెమట వల్ల త్వరగా పాడయ్యే అవకాశం లేదు. ముఖ్యంగా సిలికాన్ టిప్ ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సాధారణం కంటే కొంచెం భిన్నంగా
boAt తన పాత డిజైన్‌కు వీడ్కోలు చెబుతూ సిలికాన్ టిప్స్‌తో కూడిన Airdopes ProGearను తయారు చేసింది. ఇది ఒక రకమైన ఓపెన్ ఎయిర్ డిజైన్. ఈ బడ్స్ సాధారణం కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. వీటి ధర మనదేశంలో రూ. 1,999గా ఉంది. Amazon, Myntra, boAt ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 1,699 లభిస్తున్నాయి. ఈ ఇయర్‌ఫోన్స్ రిలయన్స్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. boAt అధికారిక వెబ్‌సైట్‌లో boAt Airdopes ProGear మోడల్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి అవసరమైన సమాచారాన్ని పొందువచ్చు. ఇవి నలుపు, ఆకుపచ్చ రంగుల్లో మార్కెట్‌లోకి వచ్చాయి.10 నిమిషాల ఛార్జింగ్ ద్వారా 10 గంటలు
boAt Airdopes ProGear AI- సపోర్ట్ గల ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) క్వాడ్ మైక్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఇవి స్పష్టమైన కాలింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే, గేమింగ్ మరియు వీడియో అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా అందిస్తుంది. ఈ బడ్స్‌లో మరొక ముఖ్యమైన ఫీచర్ దీనికి అందించిన బ్యాటరీ. రెండు ఇయర్‌ఫోన్‌లు 65 mAh బ్యాటరీతో, ఛార్జింగ్ కేస్ 500 mAh బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది. ఒక్క ఛార్జ్‌తో 100 గంటల వరకు సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, boAt Airdopes ProGear కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ ద్వారా 10 గంటల పాటు పని చేస్తుంది. మొత్తంగా ఒక్క ఛార్జ్‌తో వంద గంటల ప్లేబ్యాక్ సమయం అందించడం ఈ మోడల్ సేల్‌కు ఆదనపు బలాన్ని చేకూరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం.. మీరూ ఇప్పుడే ఓ సెట్‌ను బుక్ చేసేయండి!