Photo Credit: Boat
భారతీయ మార్కెట్‌లోకి బోట్ Enigma Daze, బోట్ Enigma Gem స్మార్ట్ వాచ్‌లను ఆ కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు కూడా SOS లైవ్ లొకేషన్-షేరింగ్‌కి సపోర్ట్ చేస్తాయి. అలాగే, ఐదు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇవి బ్లూటూత్ కాలింగ్, కస్టమైజ్బల్ వాచ్ ఫేస్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఈ స్మార్ట్ వాచ్‌లు బోట్ క్రెస్ట్ అప్లికేషన్‌కు అనుకూలంగా ఉంటాయి. అలాగే, ఋతు చక్రం ట్రాకింగ్‌తో సహా అనేక ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్‌లను అందించారు. ఇవి IP67-రేటింగ్, సర్క్యులర్ డిస్‌ప్లేలు, మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మెటాలిక్ బిల్డ్‌లను కలిగి ఉంటాయి.
మన దేశంలో బోట్ Enigma Daze ప్రారంభ ధర రూ. 1,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది చెర్రీ బ్లోసమ్, మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ వాచ్ మెటాలిక్ గోల్డ్ వేరియంట్ ధర రూ. 2,199గా ఉంది. అలాగే, బోట్ Enigma Gem ధర రూ. 2,699. ఇది మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సిల్వర్, రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌లలో అందుబాటులో ఉంటుంది. రెండు కూడా అమెజాన్, బోట్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా దేశంలో కొనుగోలు చేసేందుకు కంపెనీ అవకాశం కల్పించింది.
బోట్ Enigma Daze వాచ్ 360 x 360 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.3-అంగుళాల TFT సర్క్యులర్ డిస్‌ప్లేతో వస్తుంది. అయితే, Enigma Gem ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్‌తో 1.19-అంగుళాల రౌండ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు MapMyIndia సపోర్ట్‌తో లైవ్ లొకేషన్స్ SOS సందేశాలను పంచుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఇస్తుంది. Daze వేరియంట్ ఫంక్షనల్ క్రౌన్, డెడికేటెడ్ SOS బటన్‌తో వస్తోంది. బోట్ Gemలోని క్రౌన్ SOS బటన్‌గా పనిచేస్తుంది.
ఈ వాచ్‌లు రెండూ హార్ట్ రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి (SpO2), స్లీప్ డేటా, ఋతు చక్రం ట్రాకర్ వంటి వెల్నెస్ మానిటరింగ్ ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. ఇవి బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. క్రెస్ట్ యాప్‌తో గరిష్టంగా 20 కాంటాక్ట్‌లను స్టోర్ చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పిస్తాయి. ఈ వాచ్‌లు UPI చెల్లింపులు, మెట్రో కార్డ్‌లతోపాటు మరిన్నింటి కోసం ఎక్కువగా ఉపయోగించే QR కోడ్‌లను సేవ్ చేసేందుకు ఉపయోగించే QR ట్రేలతో అటాచ్ చేయబడి ఉంటాయి.
బోట్ Enigma Daze వాచ్ 121 x 99 x 48 మిమీ పరిమాణం, Enigma Gem 135 x 127 x 87 మిమీ పరిమాణంలో ఉన్నాయి. ఈ రెండూ కూడా IP67-రేటెడ్ బిల్డ్‌లతో 75గ్రాముల బరువుతో వస్తున్నాయి. Daze, Gem వేరియంట్‌లను వరుసగా 200mAh, 220mAh బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించారు. ఒక్కొక్కటి ఐదు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ప్రకటన
ప్రకటన