అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న హువాయ్ బ్యాండ్ 10 స్మార్ట్ వాచ్...ప్రైస్ ఎంతో తెలుసా

ఈ హువాయ్ బ్యాండ్ 10 స్మార్ట్ వాచ్లో 1.47 ఇంచ్ AMOLED రెక్టాంగులర్ డిస్ప్లే ఫిట్ చేశారు. దీనిలో ప్రత్యేకించి ఆల్వేస్ డిస్ప్లే ఆన్ ఆప్షన్ కూడా ఉంది.

అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న హువాయ్ బ్యాండ్ 10 స్మార్ట్ వాచ్...ప్రైస్ ఎంతో తెలుసా

Photo Credit: Huawei

హువావే బ్యాండ్ 10 పాలిమర్ మరియు అల్యూమినియం అల్లాయ్ కేస్ వేరియంట్లలో వస్తుంది

ముఖ్యాంశాలు
  • ఈ బ్యాండ్ 14 డేస్ బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుంది
  • డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉండనుంది
  • ఈ హువాయ్ బ్యాండ్ 10 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది
ప్రకటన

టెక్ ప్రేమికులకు గుడ్ న్యూస్! హువాయ్ వారి కొత్త బ్యాండ్ 10 ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ స్మార్ట్ వాచ్, ఆరోగ్యాన్ని ట్రాక్ చేసుకోవాలనుకునే వారికి పర్ఫెక్ట్ గాడ్జెట్ అవుతుంది. స్లీప్ హార్ట్ రేట్ వేరియబులిటీ (HRV), స్ట్రెస్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. వీటికి అదనంగా ఈ స్మార్ట్ వాచ్ లో ఎమోషనల్ వెల్ బీయింగ్ అసిస్టెంట్స్ కూడా ఉంది.ఇది 1.47 ఇంచుల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. స్క్వేర్ షేప్‌ లో, చూడటానికి క్లాస్‌ గా కనిపిస్తుంది. రెసల్యూషన్ 194x368 పిక్సెల్స్ కాగా, 282 ppi డెన్సిటీతో టెక్స్ట్, గ్రాఫిక్స్ అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్‌ తో మీరు ఈజీగా ఈ వాచ్ ఉపయోగించవచ్చు. జాగింగ్ చేయడం, సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్... ఇలా ఏ పని చేసినా ఈ బ్యాండ్ మీ ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఇందులో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. పైగా, యాక్సిలెరో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నటో మీటర్ వంటి అడ్వాన్స్డ్ సెన్సార్‌ లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ హువాయ్ బ్యాండ్ 10 స్విమ్మింగ్ చేసే వారికి బాగా యూజ్ అవుతుంది, ఈ బ్యాండ్‌కి 5ATM వాటర్ రెసిస్టెన్స్ ఉండడంవల్ల నీటిలో వాడినా కూడా ఏం కాదు,స్విమ్మింగ్ చేస్తుండగా స్ట్రోక్, లాప్ డిటెక్షన్ 95% ఆక్యురసీతో గుర్తిస్తుంది. ఇందులో 9-అక్సిస్ సెన్సార్ మరియు AI బేస్డ్ స్ట్రోక్ రికగ్నిషన్ ఫీచర్‌ లు ఉన్నాయి. మీరు స్విమ్మింగ్ చేసే విధానాన్ని కూడా ఇది గమనిస్తుంది.

హెల్త్ ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పవచ్చు. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్ లెవెల్), స్లీప్ మానిటరింగ్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. అంతేకాదు, మీ మూడ్‌ను అర్థం చేసుకునేలా ఎమోషనల్ వెల్‌బీయింగ్ అసిస్టెంట్స్ ఉన్నాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా ఇది మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీకు అవసరమైన వెల్‌నెస్ టిప్స్, పాజిటివ్ సజెషన్స్ కూడా ఇస్తుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 14 రోజులపాటు కంటిన్యూస్గా వాడుకోవచ్చు. ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 45 నిమిషాల సమయం పడుతుంది. ఒకవేళ మీకు ఛార్జింగ్ పెట్టే సమయం లేకపోతే, ఐదు నిమిషాల క్విక్ ఛార్జ్ చేస్తే చాలు రెండు రోజులపాటు ఈ డివైస్ పనిచేస్తుంది.

ఈ వాచ్ బరువు చూస్తే చాలా తక్కువ... కేవలం 14g మాత్రమే ఉంది. థిక్నెస్ కూడా 8.99 మిల్లీమీటర్స్ తో తక్కువగానే ఉంది. ఇక ప్రైస్ రేంజ్ కూడా మీడియంగా ఉంది. పాలిమర్ కేస్ తో వచ్చే స్మార్ట్ వాచ్ ధర రూ.6499గా ఉంటే, అల్యూమినియం కేస్ తో వచ్చే స్మార్ట్ వాచ్ ధర రూ.6999గా ఉంది. కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే... పింక్, బ్లాక్ కలర్స్ కి పాలిమార్ కేసింగ్ ఇస్తున్నారు. బ్లూ, గ్రీన్, మట్టే బ్లాక్, పర్పుల్, వైట్ కలర్స్ అల్యూమినియం కేసింగ్ తో వస్తున్నాయి.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »