హువాయి కొత్త స్మార్ట్‌వాచ్‌లు: గరిష్టంగా 21 రోజుల బ్యాటరీ లైఫ్, సాధారణ వినియోగంతో 12 రోజులు
Photo Credit: Huawei
Huawei Watch GT 6 Pro, GT 6: 21 రోజుల బ్యాటరీ లైఫ్, IP69 రేటింగ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో
చైనీస్ టెక్ సంస్థ అయిన హువాయి తమ నుంచి రానున్న కొత్త స్మార్ట్ వాచ్‌ల గురించి ప్రకటించింది. హువాయి నుంచి GT సిరీస్ స్మార్ట్‌వాచ్‌లుగా Huawei వాచ్ GT 6, Watch GT 6 Pro సోమవారం భారతదేశంలో లాంఛ్ అయ్యాయి. ఈ రెండు మోడల్స్ ప్రస్తుతం దేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. Watch GT 6 Pro 46mm డయల్ వేరియంట్‌లో లభ్యం అవుతుండగా.. వనిల్లా వాచ్ GT 6 రెండు సైజు ఎంపికలలో వచ్చింది. Watch GT 6 Pro, Watch GT 6 46mm మోడల్‌లు 466×466 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.47-అంగుళాల AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి.
భారతదేశంలో Huawei GT 6 Pro 46mm నలుపు, గోధుమ రంగులకు రూ. 28,999 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో 46mm టైటానియం ఎంపిక ధర రూ. 39,999గా ఉంది.
మరోవైపు Huawei వాచ్ GT 6 ధర రూ. 41mm బ్లాక్, వైట్, పర్పుల్, బ్రౌన్ కలర్ ఆప్షన్లకు 21,999 రూపాయలు ఉండగా గోల్డ్ వేరియంట్ కు 24,999 రూపాయలు. చివరగా 46mm మోడల్ గ్రీన్, గ్రే, బ్లాక్ షేడ్స్ కు 21,999 రూపాయలు.
Huawei Watch GT 6, Watch GT 6 Pro రెండూ దేశంలో Flipkart, RTC ఇండియా వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
Huawei Watch GT 6 Pro, Watch GT 6 Android 9 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లలో నడుస్తున్న ఫోన్‌లకు, iOS 13 లేదా కొత్త వెర్షన్‌లకు అనుకూలంగా ఉంటాయి. రెండూ 317 ppi పిక్సెల్ సాంద్రత , 466x466 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.47-అంగుళాల AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అయితే స్టాండర్డ్ మోడల్ 41mm వేరియంట్ 352 ppi పిక్సెల్ సాంద్రతతో చిన్న 1.32-అంగుళాల (466×466 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రో మోడల్ 3,000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది.
Huawei Watch GT 6 Pro టైటానియం అల్లాయ్ కేస్‌ను కలిగి ఉంది. వాచ్ GT 6 స్టెయిన్‌లెస్ కేస్‌ను కలిగి ఉంది. వాచ్ GT 6 ప్రోలో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బేరోమీటర్, టెంపరేచర్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ECG సెన్సార్, డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వెనిల్లా వాచ్ GT 6 లో ECG, డెప్త్ సెన్సార్లు లేవు. ఈ స్మార్ట్ వాచీలు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం 5ATM + IP69 రేటింగ్‌లతో వస్తాయి.
కనెక్టివిటీ కోసం వాచ్ GT 6 ప్రో, వాచ్ GT 6 హువాయి సన్‌ఫ్లవర్ GPS, NFC, బ్లూటూత్ 6, Wi-Fi, GLONASS, BeiDou, గెలీలియో, OZSS, NavIC సపోర్ట్ చేస్తాయి. స్మార్ట్‌వాచ్‌లు 21 రోజుల గరిష్ట బ్యాటరీ జీవితాన్ని, సాధారణ వినియోగంతో 12 రోజుల వరకు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లేతో ఏడు రోజుల వరకు, అవుట్‌డోర్ స్పోర్ట్ మోడ్‌లో 40 గంటల వరకు అందిస్తాయని కంపెనీ పేర్కొంది. అయితే 41mm వాచ్ GT 6 14 రోజుల గరిష్ట బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.
ప్రకటన
ప్రకటన