దేశీయ మార్కెట్‌లోకి Buds Pro 3ని OnePlus కంపెనీ విడుదల చేసింది. ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్‌లో సిలికాన్ టిప్స్‌తో కూడిన ఇన్-ఇయర్ డిజైన్.. అచ్చం గులకరాయి ఆకారంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ సెట్ డ్యూయల్ డ్రైవర్ సెటప్‌తో రూపొందించబడి ఉంటుంది. 11mm వూఫర్ మరియు 6mm ట్వీటర్ ప్రతి దానిలో ఒక ప్రత్యేకమైన డ్యూయల్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ (DAC)లతో వస్తోంది. OnePlus Buds Pro 3 మొత్తంగా 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), బ్లూటూత్ 5.4 ద్వారా డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ మరియు LHDC 5.0 ఆడియో కోడెక్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ OnePlus Buds Pro 3 ఇయర్‌ఫోన్‌లు ఛార్జింగ్ కేస్‌తో సహా 43 గంటల బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
ఇక మనదేశంలో OnePlus Buds Pro 3 ప్రారంభ ధర రూ. 11,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే, ల్యూనార్ రేడియన్స్, మిడ్‌నైట్ ఓపస్ కలర్స్‌ల్లో వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఇతర ఆన్‌లైన్ మరియు రిటైల్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆగస్టు 23 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి దేశంలో కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులో ఉంటుంది. ఈ OnePlus Buds Pro 3 11mm వూఫర్ మరియు 6mm ట్వీటర్‌తో కూడిన డ్యూయల్ డ్రైవర్ సెటప్‌తో పరిచయమవుతోంది. కంపెనీ అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం.. అవి డ్యూయల్ DACలతో జత చేయబడ్డాయి. ప్రతి డ్రైవర్‌కు ఒకటి కేటాయించడం ద్వారా ఇయర్‌ఫోన్‌ల సౌండ్ క్వాలిటీని మరింత మెరుగ్గా ఉంటుందని వెల్లడించింది. అలాగే, ఈ TWS హెడ్‌సెట్ తేలికపాటి, మధ్యస్థ, గరిష్ట మోడ్‌లతో 50dB ANC వరకు సపోర్ట్ చేస్తాయి. ఈ కారణంగా నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియోతో పాటు సౌండ్‌లో మెరుగైన నాణ్యతను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
HeyMelody యాప్‌లో పోల్చి చూస్తే..
ఈ OnePlus TWS హెడ్‌సెట్ ఇతర హెడ్‌సెట్‌లతో HeyMelody యాప్‌లో పోల్చి చూస్తే.. ఇది వినియోగదారులను ANC మోడ్‌లు, ఈక్వలైజర్ సెట్టింగ్‌లు, టచ్ కంట్రోల్ కమాండ్‌లు వంటివి వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది. అలాగే, OnePlus Buds Pro 3కి ముందు విడుదలైన OnePlus Buds Pro 2 మరియు Oppo Enco X2 మాదిరిగానే డానిష్ లౌడ్ స్పీకర్ల తయారీదారు Dynaudio ద్వారా ట్యూన్ చేయబడింది. బ్లూటూత్ 5.4 ద్వారా డ్యూయల్-డివైస్ కనెక్టివిటీకి మద్దతుతో పాటు 90ms తక్కువ లేట్ గేమ్ మోడ్‌ను కలిగి ఉంది. ఇది Google ఫాస్ట్ పెయిర్‌ని ఉపయోగించి ఆధునిక Android స్మార్ట్‌ఫోన్‌లతో కూడా జత చేయబడుతుంది. ఈ ఇయర్‌ఫోన్‌లు ఛార్జింగ్ కేసులా కాకుండా దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP55 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. సింగల్ ఛార్జ్‌తో 43 గంటల బ్యాటరీ..
OnePlus Buds Pro 3 సింగల్ ఛార్జ్‌తో 43 గంటల బ్యాటరీ సామర్థ్యం అందించగలదని OnePlus పేర్కొంది. అంతేకాదు, ఇయర్‌ఫోన్‌లు ఒకే ఛార్జ్‌పై 10 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయని కంపెనీ చెబుతోంది. అలాగే, ఛార్జింగ్ కేస్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతిస్తుంది. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో గరిష్టంగా 5.5 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఇయర్‌ఫోన్‌ల పరిమాణం విషయానికి వస్తే.. 33.60 x 21.15 x 25 మిల్లీమీటర్లతో 5.28 గ్రాముల బరువు ఉంటుంది. ప్లాస్టిక్ యూనిబాడీ కేస్ పరిమాణం 64.70 x 52.45 x 25.75 మిల్లీమీటర్లు, ఇయర్‌ఫోన్‌లతో కలిపి 61.38 గ్రాముల బరువు ఉంటుంది.