Photo Credit: WhatsApp
చాట్‌లలో ఇప్పటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని వాట్సాప్ తెలిపింది
WhatsApp.. ఈ మెసేజింగ్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల కోట్ల మందికిపైగా వినియోగదారులు ఉన్న ఈ యాప్ నందు త్వరలో వ్యాపార ప్రకటనలు డిస్‌ప్లే కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రకటనలపై వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టిన Meta సంస్థ, ఇప్పటికే అనేక యాప్లలో యాడ్స్ ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే కోట్లాది యూజర్స్ ఉన్న WhatsAppలో ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనిని ధృవీకరిస్తూ.. WhatsApp బ్లాగ్ పోస్ట్‌లో కీలక సమాచారాన్ని షేర్ చేసింది.Meta కు భారీ ఆదాయం,WhatsApp బ్లాగ్ పోస్ట్‌లో యాడ్‌లను యాప్‌లోని అప్డేట్స్ ట్యాబ్‌లో మాత్రమే డిస్‌ప్లే చేస్తామని స్పష్టం చేసింది. అయితే, ఈ ట్యాబ్‌ను రోజుకు సుమారు 150 కోట్ల వినియోగదారులు స్క్రోల్ చేస్తారని, దీని ద్వారా Meta కు భారీ ఆదాయం సమకూరుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, యూజర్స్‌కు వ్యక్తిగత చాట్స్ సర్వీసులో ఎలాంటి మార్పులూ ఉండవని, గతంలో మాదిరిగానే యాప్ను వినియోగించుకోవచ్చని తెలిపింది.
కొత్త ప్రకటనలో కాల్స్, మెసేజ్‌లు, స్టాటస్ ట్యాబ్‌లలో ఎలాంటి యాడ్స్ ఉండవని స్పష్టం చేసిన మెటా.. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్‌గానే పర్సనల్ మెసేజ్‌లు, కాల్స్, గ్రూప్స్, స్టేటస్‌లు ఉంటాయని కూడా హామీ ఇచ్చింది. అంతే కాదు, వీటి ఆధారంగానే యూజర్స్ ప్రాంతంతోపాటు భాష, వయసు, యాప్‌లో వారు ఫాలో అవుతోన్న ఛానెళ్స్ కు అనుగుణంగానే యాడ్స్ డిస్‌ప్లే అవుతాయని కూడా Meta వెల్లడించింది. అయితే, యాప్‌లో ఎప్పటి నుంచి ప్రకటనలు మొదలవుతాయనే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఈ అంశం పై కూడా మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
WhatsApp యాప్‌లో ప్రకటన అంశంపై చాలా సంవత్సరాలగా చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. వాటన్నింటికీ ఈ తాజా ప్రకటనతో ముగింపు పలికినట్లయింది. నిజానికి, 2018లో WhatsApp మాజీ వైస్ ప్రెసిండెంట్ క్రిస్ డేనియల్స్ మాట్లాడుతూ.. ప్రజలకు వ్యాపారాలు మరింత చేరువ చేసేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఆ ప్రకటనతో ఇందులో యాడ్స్ రాబోతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజా ప్రకటనతో దీనిపై పూర్తి స్పష్టత వచ్చింది. అలాగే, ఈ యాప్ వినియోగదారుల ఫోన్ నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటనదారులకు షేర్ చేయదని మాత్రం Meta గట్టిగా చెబుతోంది.
ట్యాబ్‌లో రాబోతున్న కొత్త మార్పులలో WhatsApp బ్లాగ్ పోస్ట్‌లో ఛానల్ సబ్క్రిప్షన్, ప్రమోటెడ్ ఛానెల్, స్టేటస్‌లో యాడ్స్ ఇలా మూడు కీలకమైన మార్పులను వెల్లడించింది. అంతే కాదు, వీటి ద్వారా WhatsAppలో అడ్మిన్స్, ఆర్గనైజేషన్స్, వ్యాపారాల డెవలప్‌మెంట్‌కు సహాయపడేలా దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే, Meta చెబుతున్నదానిని బట్టీ, యాప్ వినియోగదారులు, సబ్క్రిప్షన్స్ వారికి ఇష్టమైన ఛానెల్‌కు సపోర్ట్ ఇచ్చేందుకు, మంత్లీ పేమెంట్ చెల్లించడం ద్వారా సరికొత్త అప్‌డేట్‌లను పొందేందుకు అవకాశం ఉంటుంది.
ప్రకటన
ప్రకటన