Photo Credit: YouTube/OTT Telugu Flash
చాలా ఆలస్యం తర్వాత, మార్చి 14, 2025 నుండి సోనీ LIVలో ఏజెంట్ ప్రసారం కానుంది.
టాలీవుడ్ ప్రేక్షకులు దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ OTT విడుదల తేదీ ఖరారయ్యింది. పలు వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 14న సోనీ LIVలో ప్రీమియర్ కానుంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. నిజానికి, థియేటర్లలో దీని టాక్ అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఉత్సుకతతో ఎదరుచూస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి, సాక్షి వైద్య, డినో మోరియాలు కీలక పాత్రల్లో నటించారు.
ఏజెంట్ మూవీ మార్చి 14 నుండి సోనీ LIVలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉండనుంది. ముందుగా, ఏప్రిల్ 28, 2023న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ ఫలితాలతో OTT విడుదల చాలా ఆలస్యమయ్యిందని టాక్ వినిపిస్తోంది. అలాగే, కంటెంట్, లాజిస్టిక్స్, వ్యూహాత్మక నిర్ణయాలకు సంబంధించిన సమస్యలు ఈ ఆలస్యానికి కారణమైనట్లు తెలుస్తోంది. తాజాగా, స్ట్రీమింగ్ తేదీని ప్రకటించడంతో అఖిల్ అక్కినేని అభిమానులతోపాటు యాక్షన్-థ్రిల్లర్ ప్రేక్షకులు తమ సౌలభ్యం మేరకు సినిమాను చూడొచ్చు.
ఏజెంట్ ఆఫీసర్ ట్రైలర్ హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ ఫెర్ఫామెన్స్, ఉత్కంఠభరితమైన గూఢచర్య కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. ప్రధానంగా, ఈ చిత్రం RAW ఏజెంట్ రికీ (అఖిల్ అక్కినేని) చుట్టూ తిరుగుతుంది. అతనికి RAW చీఫ్ కల్నల్ మహాదేవ్ (మమ్మూట్టి) ఒక హై-స్టేక్స్ మిషన్‌ను అప్పగిస్తారు. దేశద్రోహి, మాజీ ఏజెంట్ ధర్మ (డినో మోరియా)ను పట్టుకునే పనిలో, రికీకి ఊహించని పరిణామాలు ఎదుర్కొని, అనుకున్నది సాధిస్తాడు. స్టైలిష్ విజువల్స్, అడ్రినలిన్-పంపింగ్ సన్నివేశాలు, ఆసక్తికరమైన కథనంతో ఈ మూవీని ఉత్కంఠభరితమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
ఈ సినిమా కోసం సీనియర్ నటులతోపాటు అనుభవజ్ఞులైన సిబ్బంది పని చేశారు. అలాగే, అఖిల్ అక్కినేని రా ఏజెంట్ రికీగా ప్రధాన పాత్రతో నటించగా, రా చీఫ్ కల్నల్ మహాదేవ్ పాత్రలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఇందులో డినో మోరియా విలన్ ధర్మ పాత్రను పోషించగా, సాక్షి వైద్య హీరోయిన్‌గా చేశారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, వక్కంతం వంశీ స్క్రీన్ ప్లే అందించారు. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అలాగే, హిప్ హాప్ తమిజా మూవీకి సంగీతం సమకూర్చారు.
అయితే, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో పూర్తి నెగిటీవ్ టాక్‌ను మూటగట్టుకుంది. సగటు అభిమానులను ఆకట్టుకోలేకపోవడంతోపాటు అఖిల్ అక్కినేని, దర్శకుడు సురేందర్ రెడ్డి వారి క్రియేటీవ్ ఆప్షన్స్ విషయంలో విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, OTT విడుదలకు సిద్ధమవ్యడంతో రిలీజ్‌కు ముందే సినిమాపై ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి నెలకొంది.
ప్రకటన
ప్రకటన