ROG Xbox Ally లో 60W బ్యాటరీ ఉండగా, Ally X మోడల్‌లో 80Wh బ్యాటరీ కలదు

ఈ రెండు హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ PCs 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ LCD స్క్రీన్‌తో వస్తాయి, ఇవి 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తాయి.

ROG Xbox Ally లో 60W బ్యాటరీ ఉండగా, Ally X మోడల్‌లో 80Wh బ్యాటరీ కలదు

Photo Credit: Microsoft

కంపెనీ ప్రకారం, రెండు ROG Xbox Ally మోడల్స్ సౌకర్యం కోసం కాంటౌర్డ్ గ్రిప్‌ను కలిగి ఉన్నాయి

ముఖ్యాంశాలు
  • Asus–Xbox తొలి హ్యాండ్‌హెల్డ్ PCs
  • Ally X లో Ryzen Z2 Extreme చిప్‌
  • అక్టోబర్ 16 నుంచి అమ్మకాలు ప్రారంభం
ప్రకటన

గేమింగ్ ప్రేమికులకు గుడ్ న్యూస్ ప్రముఖ టెక్ బ్రాండ్ Asus మంగళవారం అధికారికంగా ROG Xbox Ally మరియు ROG Xbox Ally X హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ PC లను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. మైక్రోసాఫ్ట్‌ Xbox తో భాగస్వామ్యంగా రూపొందించిన ఈ పరికరాలు Asus నుండి వచ్చిన తొలి Xbox బ్రాండెడ్ పోర్టబుల్ గేమింగ్ డివైసెస్ కావడం ప్రత్యేకత. ఇవి ప్రయాణంలో కూడా గేమింగ్ అనుభవాన్ని అందించేలా డిజైన్ చేయబడ్డాయి. ఈ సిరీస్‌లోని అత్యున్నత మోడల్ అయిన ROG Ally X, శక్తివంతమైన AMD Ryzen Z2 Extreme చిప్‌సెట్‌ తో వస్తోంది. భారత మార్కెట్‌లో ROG Xbox Ally ధర రూ69,990గా, కాగా ROG Xbox Ally X ధర రూ.1,14,990గా నిర్ణయించబడింది. ఈ రెండు మోడల్స్ బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. నేటి నుంచే ప్రీ-ఆర్డర్స్ ప్రారంభం కాగా, అధికారిక విక్రయాలు అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానున్నాయి. గేమర్లు వీటిని Asus ఎక్క్లుసివ్ స్టోర్స్, Asus e-Shop, Amazon, మరియు Vijay Sales ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులకు ఒక సంవత్సరం GamePass Ultimate ఉచిత సబ్‌స్క్రిప్షన్ మరియు ROG Slash Sling Bag ఉచితంగా లభిస్తాయి.

ముఖ్యమైన ఫీచర్లు:

ఈ రెండు హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ PCs 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ LCD స్క్రీన్‌తో వస్తాయి, ఇవి 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తాయి. AMD FreeSync Premium టెక్నాలజీ తో స్క్రీన్ టియర్ సమస్యలు తగ్గుతాయి. అలాగే, Corning Gorilla Glass Victus ప్రొటెక్షన్ మరియు DXC యాంటీ-రిఫ్లెక్షన్ కోటింగ్ కూడా అందించబడింది, ఇది షాడోస్ తగ్గించి క్లారిటీని పెంచుతుంది.

డిజైన్ పరంగా ఇవి Asus ROG Ally మోడల్స్ తరహాలోనే ఉన్నప్పటికీ, కొత్త కాంటూర్డ్ గ్రిప్స్ వలన అన్ని రకాల చేతి పరిమాణాలకు అనుగుణంగా పట్టుకోవచ్చు. Xbox కంట్రోలర్‌ల మాదిరిగానే ABXY బటన్స్ మరియు ఒక ప్రత్యేక Xbox బటన్ కూడా ఉన్నాయి, ఇది గేమ్ బార్ ద్వారా చాట్‌లు, యాప్‌లు మరియు సెట్టింగ్స్‌కి తక్షణ యాక్సెస్ ఇస్తుంది.

ప్రామాణిక మోడల్ ROG Xbox Ally లో AMD Ryzen Z2 A ప్రాసెసర్, 16GB LPDDR5x RAM మరియు 512GB స్టోరేజ్ ఉన్నాయి. మరోవైపు, ROG Xbox Ally X లో శక్తివంతమైన AMD Ryzen AI Z2 Extreme SoC, 24GB RAM మరియు 1TB స్టోరేజ్ ఇవ్వబడింది. రెండు మోడల్స్‌లోనూ Windows 11 ను గేమింగ్ కోసం ఆప్టిమైజ్ చేశారు.

గేమింగ్ అనుభవం:

Asus మరియు Microsoft భాగస్వామ్యంతో రూపొందించిన ఈ పరికరాలు, కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన Game Bar తో వస్తాయి. ఇందులో Asus Armoury Crate ఇంటిగ్రేషన్ ఉండి, గేమర్లకు డివైస్ సెట్టింగులు, ఇన్‌పుట్ కంట్రోల్స్ మరియు వివిధ గేమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలోని గేమ్ లైబ్రరీకి త్వరిత యాక్సెస్ ఇస్తుంది.

బ్యాటరీ మరియు ఛార్జింగ్:

ROG Xbox Ally లో 60W బ్యాటరీ ఉండగా, Ally X మోడల్‌లో 80Wh బ్యాటరీ కలదు. రెండింటిలోనూ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన స్టాండ్‌ ఇవ్వబడింది. దీని ద్వారా గేమర్లకు నిరంతర గేమింగ్ అనుభవం లభిస్తుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. అయితే, ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగించాలంటే యూజర్లు తమ WhatsApp అకౌంట్‌ను మెటా ఎకౌంటు సెంటర్ కి లింక్‌ చేయాలి
  2. త్వరలో భారత మార్కెట్‌లోకి Lava Shark 2 స్మార్ట్‌ఫోన్, 50 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, రెండు కలర్ ఆప్షన్లలో హ్యాండ్ సెట్
  3. వీటిలో 6,000mAh మరియు 6,200mAh బ్యాటరీలు అందించబడ్డాయి
  4. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి 2025 సేల్లో అదిరిపోయే ఛాన్స్, అతి తక్కువ ధరకే ఆపిల్ ఎయిర్‌పాడ్స్
  5. ROG Xbox Ally లో 60W బ్యాటరీ ఉండగా, Ally X మోడల్‌లో 80Wh బ్యాటరీ కలదు
  6. ఇదే విధంగా హోమ్ స్క్రీన్‌లోని ఫోల్డర్ పేర్లు కూడా ఇప్పుడు ఎడమవైపుకే సెట్ అవుతున్నాయి.
  7. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్16 బేస్డ్ OriginOS 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రాబోతున్నాయి
  8. Realme 15 Pro 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్ ధర, ఫీచర్స్ వివరాలివే
  9. స్మార్ట్ వాచ్‌లపై అదిరే ఆఫర్లు.. ఏ ఏ బ్రాండ్లపై ఎంతెంత తగ్గింపు లభిస్తోందంటే?
  10. ఈవెంట్‌లో విడుదలైన ఉత్పత్తుల ప్రీ-ఆర్డర్లు నవంబర్ 7 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »