అతి త్వరలో భారత మార్కెట్‌లోకి 50-మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరాతో Lava Shark 2 స్మార్ట్ ఫోన్ లాంఛ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటికే నిర్ధారించింది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు.
Photo Credit: Lava
ఈ హ్యాండ్‌సెట్ రెండు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుందని టీజ్ చేయబడింది
అతి త్వరలో భారత మార్కెట్‌లోకి 50-మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరాతో Lava Shark 2 స్మార్ట్ ఫోన్ లాంఛ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ధ్రువీకరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన టీజర్ ప్రకారం, లావా షార్క్ 2 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో మెరుగుపరచబడింది.లావా షార్క్ 2 కెమెరా వివరాలు..
X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసిన లావా మొబైల్స్, దాని రాబోయే స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని ప్రకటించింది. టీజర్ ఇమేజ్‌లు ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను దగ్గరగా పోలి ఉండే కెమెరా ఐలాండ్ డిజైన్‌ను నిర్ధారిస్తున్నాయి. డెకో లోపల "50MP AI కెమెరా" బ్రాండింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది.
లావా ఇంతకుముందు లావా షార్క్ 2 డిజైన్‌ను వెల్లడించింది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే పెద్దగా మార్పులు లేవు. హ్యాండ్‌సెట్‌లో ముందు సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ కటౌట్. పవర్, వాల్యూమ్ బటన్లు ఫ్రేమ్ కుడి వైపున ఉండగా, ఎడమ వైపు క్లీన్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. మొబైల్‌లో దిగువున మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ రెండు కలర్స్ ఆప్షన్లలో అంటే నీలం, వెండి రంగుల్లో అందుబాటులోక రానుంది. హ్యాండ్‌సెట్ రెండు రంగుల్లో మెటాలిక్ షేడ్‌లో పూర్తి చేసిన ఫ్రేమ్‌తో కూడా ఉండనున్నాయి.
ఫోన్‌లో స్పెసిఫికేషన్లకు సంబంధించిన సమాచారం ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ, లావా షార్క్ 2 ముందు మొబైల్లో ఉండే ఫీచర్ల కంటే అడ్వాన్స్‌డ్‌గా ఉండే అవకాశం ఉంది. హ్యాండ్‌సెట్ లాంచ్‌కు దగ్గరగా మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్‌లో అనేక స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఈ మొబైల్ 6.75 అంగుళాల HD+ (720 × 1,600 పిక్సెల్స్) స్క్రీన్‌ను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ 6nm Unisoc T765 SoC ద్వారా పవర్‌ని పొందుతుంది. ఇది 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడింది. ఈ ఫోన్ అదనంగా 4GB వర్చువల్ RAM విస్తరణ, మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు ఎక్స్‌టెర్నల్ స్టోరేజ్‌కి సపోర్ట్ ఇస్తుంది. కెమెరా విభాగంలో లావా షార్క్ 5Gలో AI- మద్దతుగల 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, LED ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, GLONASS, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఇది 18W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
ప్రకటన
ప్రకటన