అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో TWS Earphonesపై క‌ళ్లు చెదిరే డిస్కౌంట్‌!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో TWS Earphonesపై క‌ళ్లు చెదిరే డిస్కౌంట్‌!
ముఖ్యాంశాలు
  • అమెజాన్ SBI క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై చేసేవారికి 10 శాతం వరకు డిస్
  • డిస్కౌంట్ ఆఫ‌ర్ ఉన్న‌ TWS ఇయర్‌బడ్‌ల జాబితా ఇదే..
  • బ్రాండెడ్ కంపెనీల ఇయ‌ర్‌బ‌డ్‌ల కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ డీల్స్
ప్రకటన

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, TWS ఇయర్‌బడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు ఇలా వ‌స్తువు ఏదైనా డిస్కౌంట్ డీల్‌లో సొంతం చేసుకోవ‌చ్చు. అయితే, మీరు బ్రాండెడ్ ఇయర్‌ఫోన్‌లను త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మాత్రం ఈ సేల్‌లో పుష్కలంగా దొరుకుతాయి. ఈ సేల్ సమయంలో ఆఫర్‌లను అందించడానికి అమెజాన్ SBI క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై చేసేవారికి 10 శాతం వరకు డిస్కౌంట్ డీల్‌ను అందిస్తోంది. అలాగే, Amazon Pay-ఆధారిత ఆఫర్‌ల‌తోపాటు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ల‌ను కూడా ప్ర‌క‌టించింది. మ‌రెందుకు ఆల‌స్యం.. ఈ సేల్‌లో బ్రాండెడ్ ఇయ‌ర్ బ‌డ్స్‌పై ఇస్తోన్న ఆఫ‌ర్‌ల గురించిన పూర్తి స‌మాచారాన్ని తెలుసుకుందామా?!

దేశీయ మార్కెట్‌లో JBL, OnePlus, Oppo, Realme, BoAt లాంటి బ్రాండ్‌ల ద్వారా TWS ఇయర్‌బడ్‌లుగా మంచి ఆద‌ర‌ణ పొంది.. బ్లూటూత్ కనెక్టివిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) వంటివి ఫీచ‌ర్స్ ఉన్న బ‌డ్స్ కొనుగోలు చేసేందుకు చాలామందికి ఆస‌క్తి ఉంటుంది. పైగా ఈ ఇన్-ఇయర్ ఇయర్‌ఫోన్‌లు వాటర్ మరియు డస్ట్-రెసిస్టెంట్ బిల్డ్‌తో అందుబాటులో ఉంటాయి. అయితే, బ్రాండ్‌తోపాటు ఆ ఫీచ‌ర్స్‌కు త‌గ్గట్టుగానే వాటి ధ‌ర‌లు కూడా ఉంటాయి. ఇలాంటి ఆలోచ‌నే మీ మ‌న‌సులోనూ ఉంటే మాత్రం వెంట‌నే దానిని తీసేయండి. ఎందుకంటే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో అలాంటి బ్రాండెడ్ కంపెనీల ఇయ‌ర్‌బ‌డ్‌ల కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ డీల్స్ ఉన్నాయి.

మంచి ఫీచ‌ర్స్ ఉన్న ఇయ‌ర్‌ఫోన్‌లు

OnePlus Nord Buds 2rలో 12.4mm డైనమిక్‌ డ్రైవర్స్‌, ఒక్కో బడ్‌లో 36mAh బ్యాటరీని అందించారు. చార్జింగ్‌ కేస్‌లోని 480mAh బ్యాటరీతో దీని లైఫ్‌ మరో 36 గంటలు పెరుగుతుంది. అలాగే, డాల్బీ అట్మోస్ మ‌ద్ద‌తుతో వస్తున్న ఈ బడ్స్‌లో బ్లూటూత్‌ 5.3, యూఎస్‌బీ టైప్‌-సి కూడా ఉంటాయి. ఇన్ని ఫీచ‌ర్స్ ఉన్న OnePlus Nord Buds 2r వాస్త‌విక ధ‌ర రూ.2,299గా ఉంది. అయితే, ఈ మెగా సేల్‌లో ఈ బ‌డ్స్ కేవ‌లం రూ. 1,698కే సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే, 10mm డైనమిక్‌ డ్రైవర్‌ను ఉపయోగించి, IPX5 రేటింగ్‌ కలిగిన వాటర్‌ రెసిస్టెన్స్‌ JBL వేవ్ ఫ్లెక్స్ ఇయర్‌బడ్‌లు ఎంఆర్‌పీ ధ‌ర రూ. 4,999గా ఉంది. ఈ బ‌డ్స్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో కేవ‌లం రూ. 2,299కి కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇలా ప‌లు బ్రాండ్‌ల‌ ఇయ‌ర్‌బ‌డ్స్‌పై ఈ సెల్‌లో భారీ ఆఫ‌ర్‌ల‌ను ప్ర‌క‌టించింది.

Product Deal Price MRP
OnePlus Nord Buds 2r Rs. 1,698 Rs. 2,299
Boat Airdopes 141 Rs. 1,299 Rs. 5,990
Noise Buds N1 Rs. 1,099 Rs. 3,499
Oppo Enco Air 3 Pro Rs. 3,798 Rs. 7,999
Realme Buds T300 Rs. 1,999 Rs. 3,999
PTron Bassbuds Duo Pro Rs. 599 Rs. 2,899
JBL Wave Flex Rs. 2,299 Rs. 4,999
Truke Buds Liberty Rs. 1,498 Rs. 6,999
Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మే 5 నుంచి CMF ఇండియా వైబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో CMF ఫోన్ 2 ప్రో అమ్మ‌కానికి సిద్ధం
  2. ఒకేసారి ఇండియాలో CMF బడ్స్ 2a, బడ్స్ 2, బడ్స్ 2 ప్లస్ లాంఛ్‌.. ధ‌ర ఎంతంటే
  3. ఇండియాలో Realme GT 7 లాంఛ్ టీజ్ చేసిన కంపెనీ.. గేమింగ్ ప్రియుల‌కు పండ‌గే
  4. Vivo నుంచి మ‌రో కొత్త మొబైల్‌.. చైనాలో Vivo Y37c లాంఛ్
  5. 50MP డ్యుయల్ కెమెరా, 6,000mAh బ్యాటరీతో, భారత మార్కెట్‌లో విడుదలైన రియల్‌మీ 14T 5G
  6. சீனாவில் 1.5K LTPO OLED டிஸ்பிளேவுடன் வருகிறது OnePlus 13T ஸ்மார்ட்போன்
  7. 7200 mAh భారీ బ్యాట‌రీతో చైనాలో లాంఛ్ అయిన Realme GT 7 స్మార్ట్‌ఫోన్‌
  8. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రోసెస‌ర్‌తో Honor GT Pro లాంఛ్‌.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేష‌న్స్ ఇవే
  9. 6620mAh భారీ బ్యాట‌రీతో Huawei Enjoy 80.. చైనాలో ధ‌ర ఎంతంటే
  10. రీప్లేస‌బుల్‌ లెన్స్ సిస్టమ్‌తో Insta360 X5.. ఇండియాలో అమ్మకానికి సిద్ధం
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »