ఈ నూతన సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్‌ను ప్లాన్ చేస్తున్నా, మంచి డిస్కౌంట్ ఆఫర్ ధర కోసం మార్కెట్‌ను వెతుకుతున్నా, అమెజాన్ అద్భుతమైన తగ్గింపు ధరలను అందిస్తోంది
Photo Credit: Apple
I ఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 2024లో భారతదేశంలో ప్రారంభించబడింది
మన దేశంలో ప్రైమ్ సభ్యుల కోసం ముందుగానే మొదలైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్రస్తుతం అందరు వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఏడాది మొదటి సేల్ ఈవెంట్ స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలతోసహా అనేక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ నూతన సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్‌ను ప్లాన్ చేస్తున్నా, మంచి డిస్కౌంట్ ఆఫర్ ధర కోసం మార్కెట్‌ను వెతుకుతున్నా, అమెజాన్ అద్భుతమైన తగ్గింపు ధరలను అందిస్తోంది. కొనుగోలుదారులు Apple, OnePlus, Samsung వంటి పలు బ్రాండ్‌లపై ఉన్న టాప్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు.
భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 2023లో ప్రారంభించబడింది. ఇందులో బేస్ ఐఫోన్ 15 ఫోన్ 128GB వెర్షన్ ధర రూ. 69,900 నుండి మొదలవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 సేల్ సమయంలో ఈ ఫోన్‌ను రూ. 57,499లకు కొనుగోలు చేయవచ్చు. ఇది ఆపిల్ A16 బయోనిక్ ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 13, ఆపిల్ లైనప్‌లో భాగమైన ఇతర మోడళ్లపై కూడా ఆఫర్‌లు ఉన్నాయి.
ఈ సేల్‌లో ధర తగ్గింపులతో పాటు, ప్రొడక్ట్ ధరను తగ్గించేందుకు కూపన్ డిస్కౌంట్‌లు, ఎక్సేచేంజ్ ఆఫర్లు లేదా బ్యాంక్ ఆఫర్‌లు వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఈ ఈ-కామర్స్ దిగ్గజం SBI కార్డుల రూ. 14,000 వరకు కనీస లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. తమ పాత పరికరాలను ట్రేడ్ చేయాలనుకునే వారు హ్యాండ్‌సెట్ మోడల్, కండిషన్‌ను బట్టి రూ. 45,000 వరకు ఎక్సేచేంజ్ పొందొచ్చు. ఇతర ఆఫర్‌లలో రూ. 20,000 వరకు కూపన్‌లు, నో-కాస్ట్ EMI ఎంపికలు, Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఉన్నాయి.
- ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 1,44,900కాగా, సేల్‌లో రూ. 1,37,900
- ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 నుంచి రూ. 1,12,900కు
- ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 నుంచి రూ. 84,900
- ఐఫోన్ 16 రూ. 79,900 నుంచి రూ. 74,900
- ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ. 1,59,900 నుంచి రూ. 1,28,900
- ఐఫోన్ 15 ప్రో (512GB) రూ. 1,64,900 నుంచి రూ. 1,39,900
- ఐఫోన్ 15 ప్లస్ రూ. 79,900 నుంచి రూ. 69,900
- ఐఫోన్ 15 రూ. 69,900 నుంచి రూ. 57,499లకు సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 13 రూ. 59,900 రూ. 43,499
ప్రకటన
ప్రకటన
Microsoft CEO Satya Nadella Suggests Next-Gen Xbox Will Be Windows PC and Console Hybrid